నీలో నేనని


నీ కనుసంజ్ఞల వైపు చూడాలంటే చచ్చేంత భయం..
నీ చూపుల గాలంలో చిక్కుకుని బయటపడలేనని!

నీవు వెనుతిరిగి వాలుచూపులు విసిరితే గందరగోళం..
నీ కోసమే కొట్టుకునే గుండె ఆనందంతో ఆగిపోవునని!

నిన్ను గట్టిగా వాటేసుకున్నట్లు నాకొచ్చెను స్వప్నం..
నీ సాంగత్యంలో కలలే నిజమై ఉక్కిరి బిక్కిరి అవునని!

నీ ప్రేమలో జీవిస్తుంటే నాకే తెలియని అలౌకికానందం..
నీకై నన్ను పుట్టించిన విధిని ముందు తూలనాడానని!

నీ కోరికల సెగలో లావానై పొంగిపోతే నాకదెంతో ప్రియం..
నీతో కలిసి జీవించడమే కాక మరణించి కలసిపోయానని!

17 comments:

 1. వావ్ మరోసారి మురిపించారు మీ కవిత మరియు చిత్రంతో.

  ReplyDelete
 2. పైనుండి క్రిందికి చదువుతూపోతే చివరికి మనసుదోచే భావంతో ముగుంపుని ఇవ్వడం మీ కవితా పటిమకి తాత్కారణం.

  ReplyDelete
 3. ప్రణయానికి పరాకాష్టలా ఉన్నాయి మీ ఆఖరి రెండుపంక్తులు. మీ ప్రత్యేకరీతిలో అదిరించి చిత్రకవిత

  ReplyDelete
 4. looking like a beautiful song while reading all your poems. you are blessed with beautiful thoughts.

  ReplyDelete
 5. పద్మా ,

  ఏ ప్రేయసీ ప్రియులైనా తమ ప్రేమ లావాలా పొంగిపొరలిపోవాలనుకోవాలని ,
  కలసి మరణించాలనుకోవాలని ఎంత చక్కగా తెలియ చేశావు ఈ కవిత ద్వారా .

  ReplyDelete
 6. నీ కోరికల సెగలో లావానై పొంగిపోతే నాకదెంతో ప్రియం..
  నీతో కలిసి జీవించడమే కాక మరణించి కలసిపోయానని!
  పరిపూర్ణమైన ప్రేమకు ఈ రెండు పంక్తులు నిదర్శనం. చాలా చాలా బాగా రాశావు పద్మా-హరినాధ్

  ReplyDelete
 7. గిట్ల రాస్తే మాకు సమజైతాది. మస్తుగుందక్క.

  ReplyDelete
 8. మీరు ఇలా రాయడంలో తిరుగులేని మహారాణీగారు :-) మీకేం చెప్పగలం :-)

  ReplyDelete
 9. మీ ప్రతి పదంలోను పరువం పరుగులు తీస్తుంటే...ఆపడం మీతరం కాదు, మాతరం అసలేకాదు.Painting Pic Super

  ReplyDelete
 10. అలనాడు ఆకుమాటున పిందె తడిచె పాట హిట్
  నేడు అర్పిత కవితలో మేము తడిచేము అన్నది కరెక్ట్ :-)

  ReplyDelete
 11. నీ కోరికల సెగలో లావానై పొంగిపోతే నాకదెంతో ప్రియం..
  నీతో కలిసి జీవించడమే కాక మరణించి కలసిపోయానని!
  మీ అక్షరాల్లో విరహం అంతా కలబోశారు.

  ReplyDelete
 12. ప్రణయాలాపనలో కవితానాయకి పడ్డ తపనను అధ్బుతంగా మలిచారు... చివరి పంక్తులు చాలా నచ్చాయండి.. చిత్రం కూడా భావవ్యక్తీకరణలో ఎక్కడా తగ్గలేదు మేడం... జస్ట్ సుపర్బ్...

  ReplyDelete
 13. చదివేస్తూ యమా హాట్ పోయెమ్ అనుకుంటే, చివర్లో హార్ట్ టచ్ చేసారు... :-)))

  ReplyDelete
 14. నీ కోరికల సెగలో లావానై పొంగిపోతే నాకదెంతో ప్రియం..
  నీతో కలిసి జీవించడమే కాక మరణించి కలసిపోయానని!

  ReplyDelete
 15. ప్రేమైకజీవుల ప్రణయకావ్యం వ్రాయాలంటే మీ తరువాతే అని మరోసారి రుజువు చేసారు.

  ReplyDelete