అదే పిలుపు

తీరిగ్గా ఉన్నప్పుడు దరిచేరి నా ఒంటరితనాన్ని పూడుస్తావు
ఆ చేష్టలంటే నాకు వల్లమాలిన అభిమానమని తెలిసికూడా
సగం తెలిపేసి తెగేసిన మాటలతో నా హృదయాన్ని కోస్తావు
మౌనాలతో మిగిలిన ఖాళీలని భర్తీచేసే తర్ఫీదు తెలపకుండా
కాస్తంత తడిని కళ్ళలో నింపి సాగరంతో మదిని పూడుస్తావు!

మగతనిదురలో తెరలు తెరలుగా నా కనుపాపలపై నర్తిస్తావు
ఆ జ్ఞాపకాల్లో అచ్చంగా మనిద్దరమే ఉన్నామని తెలిసికూడా
జామురేయి జోరీగవై నా కంటి కునుకుని తెలియక దోచేస్తావు
నిదురలేమిని పారద్రోలేసే వింతకళనొసగే విద్యనేదో నేర్పకుండా
మాయని పొరలు పొరలుగా కప్పి జోలపాడి మరల నర్తిస్తావు!

పనిలో ఉంటే పిలవద్దన్నా పిల్లనగ్రోవిలా పలుమార్లు పిలుస్తావు
ఆ ఆకాతాయి అల్లరి అంటే నాకు ఎంతో ఇష్టమని తెలిసికూడా
పలికీపలకని భ్రమంటి తెలియని దాగుడుమూతలు ఆడిస్తావు
పసిదాన్నై అన్నీ మరచి ఆటలాడబోతే వాస్తవం మరువకుండా
పెద్దరికమేదో ఒసగి ప్రియాతి ప్రియంగా "పద్మా" అని పిలుస్తావు!

70 comments:

 1. మీరు అంతలా పరితపించే ఆ పిలుపు ఎవరిదో, ఆ అదృష్టవంతుడు ఎవరో :-). కవితలో సున్నితంగా మీ భావాలని తెలిపారు. అభినందనీయం.

  ReplyDelete
  Replies
  1. ఆ అదృష్టమంతా నా నీడదేనండి. నో డౌట్ :-)

   Delete
 2. అలా పిలవడంలోని మాధుర్యం అతనికే తెలుసును. కవితాభావం బాగుంది పద్మగారు.

  ReplyDelete
  Replies
  1. తెలియని వాళ్ళు మధురంగా పిలిచినా పలుకుతాను :-)
   (వివాహమహోత్సవ శుభాకాంక్షలు మీ ఇద్దరికీ)

   Delete
 3. సున్నితమైన భావల పుట్టినిల్లు మీ బ్లాగ్. చదువుతుంటే మనసుకి హాయిగా ఉంటుంది. చిత్రంలో మీరేనా ఉంది.

  ReplyDelete
  Replies
  1. ఏ చిత్రం గురించి మీరు అడిగేరు.. ఇందులో మూడు వేరు వేరు చిత్రాలు వున్నాయి "పద్మార్పిత" బొమ్మ మీద??? కనిపించేవన్నీ నిజాలు కాకపోవచ్చు ఈ ఇంటర్నెట్ యుగంలో.. "పద్మార్మిత" పేరు లోనే వుంది అసలు గుట్టు.. "పద్మార్మిత"అంటే ఏవిటి?? పద్మానికి అర్పించిన వాడు అనా?? బ్లాగు సృష్టి కర్తే జవాబు చెప్పాలి..

   Delete
  2. రుధిర వీణ గారు,

   ఖచ్చితం గా పద్మార్పిత గారిది సున్నిత మైన 'బావల' పుట్టినిల్లే !!

   జేకే
   జిలేబి

   Delete
  3. voleti sir ninu adigedi ade. :-)

   Delete
  4. కల్కిగారు...అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక కదా... :-)
   నా ప్రతిపోస్ట్ లో నేను కనబడతాను అనుకున్నప్పుడు. ఈ చిత్రం ఒక్క దాంట్లోనే నన్ను చూడ్డం ఏంటండి!

   Delete
  5. voletigaru...మనసు మంచిదైతే చాలు మోముతో పనిలేదు అనుకున్నప్పుడు..బొమ్మలో భామ ఎవరైతేనేమండి? భావాలు నచ్చాలే కానీ బొమ్మల్లో నిజాలు ఏం వెతుకుతారు చెప్పండి.
   పద్మానికి అర్పించిన వాడు స్త్రీ భావాలని సున్నితంగా అర్థం చేసుకుని రాస్తే, ఈ ఇంటర్నెట్ యుగంలో స్త్రీల పై గుట్టుగా ఇన్ని అరాచకాలు జరగవేమో కదండి.
   "పద్మార్పిత" అంటే పద్మ(నేను) అర్పించు భావాలు అని కదా అర్థం!
   మీ స్పందనకు వందనములు._/\_

   Delete
  6. Zilebigaru..."భావాల" బదులుగా "బావల" అని అచ్చు తప్పు అనుకుంటున్నాను. కాదంటే మాత్రం మీ అంచనా తప్పు.
   పద్మార్పిత బ్లాగ్ నిజంగా "బావల" పుట్టిల్లే అయితే, మీతో బ్లాగ్ లో కాక ఆ బావలతోనే భావాలు పంచుకుంటాను కదా!
   మీలాంటి గొప్పవారి అభిమానానికై ప్రాకులాడనుగా..:-)

   Delete
  7. Potugadu pokirigaru...raplies chaduvukuntaarane anukuntaanu.

   Delete
 4. lovely poetic lines from your thoughts.

  ReplyDelete
 5. మౌనాలతో మిగిలిన ఖాళీలని భర్తీచేసే తర్ఫీదు తెలపకుండా
  కాస్తంత తడిని కళ్ళలో నింపి సాగరంతో మదిని పూడుస్తావు! ఈ పదాలతో మనసుని తడిచేసావు పద్మార్పిత-హరినాధ్

  ReplyDelete
  Replies
  1. హరినాధ్ గారు మీ స్పందనలు నాకెప్పుడూ స్పూర్తినిస్తాయి. థ్యాంక్యూ.

   Delete
 6. The Essence of the True Philosophy of a woman's heart reflect in each and every poem of Padmarpita. She could transform the concepts of love, mix it with emotions, feelings and imagination. Kudos to this young poetess ...its a way to go..Keep rocking

  ReplyDelete
  Replies
  1. Yes, its 100% correct.

   Delete
  2. This is exact definition for Padmarpita's blog I think Navajeevan. Good analysis.

   Delete
  3. మాక్కూడా కొద్దో గొప్పో చెప్పే చాన్స్ ఇవ్వండి :-) అయినా లెస్స పలికారు.

   Delete
  4. నవజీవన్ గారు...Thanks for your amazing compliments.
   Thank God...at least you accepted that my thoughts are genuine(woman's heart) and i am a poetess:-)

   Delete
  5. Payal thank you for supporting.
   Sandyagaaru thanks a lot.
   ఆకాంక్ష...ఛాన్స్ ఒకళ్ళు ఇవ్వాలా చెప్పండి. అందులోను మీకు :-)

   Delete
 7. సరళమైన భాషలో భావాలను కళ్ళకు కట్టినట్లు రాసే నీ శైలికి నజరానా పద్మ

  ReplyDelete
  Replies
  1. షుక్రియా సృజనగారు.

   Delete
 8. మీరు అదే పిలుపులో ఏం ఆనందాన్ని పొందారో తెలియదు కాని మరో అందమైన కవితతో మమ్మల్ని తన్మయత్వం పొందేలా చేసారు.

  ReplyDelete
  Replies
  1. ఎవరి పేరైనా సరే అప్యాయంగా పిలిస్తే ఆ అనందమే వేరు కదండి :-)

   Delete
 9. మీ కవితల బులెట్స్ వాడి వేడిగా ఉన్నా మీరు షూట్ చేసిన ప్రతిసారి అంటే రాసిన ప్రతిమారు మళ్ళీ మళ్ళి గాయం అవ్వాలనిపిస్తుంది అదేం విచిత్రమో.

  ReplyDelete
  Replies
  1. ఈ తుపాకీల భాష నేనెప్పుడు సరిగ్గా అర్థం చేసుకుని మీకు థ్యాంక్స్ బులెట్స్ సక్రమంగా వేస్తానో :-)

   Delete
 10. ఒక పిలుపులో జీవితపు సౌందర్యం ఎంత బాగుంటుందో అద్భుతంగా ఆవిష్కరించారు... అద్భుతః

  ReplyDelete
  Replies
  1. మీ హృదయపూర్వక అభినందనలకు అభివందనాలు_/\_

   Delete
 11. పద్మ.. పద్మ.. పద్మ..అర్పిత ప్రతి కవితలో ప్రత్యేకత, అందుకే ఈ మాధుర్యం.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ...థ్యాంక్యూ...థ్యాంక్యూ :-)

   Delete
 12. ఉఫ్,,,,స్త్రీ మనసునెరగ బహుక్లిష్టం

  ReplyDelete
  Replies
  1. ష్ ష్ ష్....మన గురించి మనమే ఇలా చెప్పుకుంటే ఎలా :-)

   Delete
 13. painting lo meera?
  who are you?
  male or female?

  ReplyDelete
  Replies
  1. ఓహో ఇలాంటి డౌట్స్ కూడా అడగవచ్చన్నమాట.
   ఆమెనో/అతడో తెలీదు బట్..భావాలు మాత్రం ఖచ్చితంగా స్త్రీ మనోనేత్రాలే. వారినాయనో నేనూ పర్మార్పితనైపోతున్నా :-)

   Delete
  2. Samrat Srinath...Yes in every painting & writing I am here. Iam a human being.

   Delete
  3. nayanigaru...ఏమైపోయారు ఇన్నాళ్ళు. మీక్కూడా ఇలాంటి డౌట్స్ రావడం అశ్చర్యంగా ఉందండీ.:-)

   Delete
 14. అందమైన స్త్రీ మనసు మనోహరమని మరోమారు ఋజువు చేసావు పద్మార్పితా.

  ReplyDelete
  Replies
  1. నా మనోభావదర్పణాన్ని మెచ్చిన మీకు అభివందనం

   Delete
 15. ఈ కవితలో అతనికి మీపై మీకు అతనిపై ఉన్న ప్రేమైకభావన ప్రస్పుటంగా గోచరమౌతున్నది .
  హ్యాట్సాఫ్ టు యు మేడం !!

  ReplyDelete
  Replies
  1. అభిమానులకి ఎటువంటి డౌట్స్ లేవనే అనుకుని ఆనందిస్తున్నాను మీ స్పందనలకు.

   Delete
 16. శివరాత్రి జాగరణలో మీ పోయంస్ రివైండ్ చేసి చదువుతూ గడిపేద్దామని మా మిత్రబృంద నిర్ణయం. మీరేమంటారు అర్పితగారు. ఇది పక్కన పెడితే ఈ కవిత మీ మునుపటి కవితకి సీక్విల్లా ఉంది. మరో మారు అరిపించారు.

  ReplyDelete
  Replies
  1. శివరాత్రి పర్వదినాన్న...ఏ భక్త శిరియాల వంటి భక్తి సినిమా చూడకుండా ఇలా జాగారం ఎనటండి నయనిగారు :-)
   ఆ సీక్వెల్ ఏదో మీరే చెప్పొచ్చుగా :-)

   Delete
 17. ఆమెనో/అతడో తెలీదు బట్..భావాలు మాత్రం ఖచ్చితంగా స్త్రీ మనోనేత్రాలే. వారినాయనో నేనూ పర్మార్పితనైపోతున్నా :-)mari atlane nenu pilavacha

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగ్ చదివిన ఇన్నాళ్ళకి ఈ వింత డౌట్ ఏంట్రా బాబోయ్ :-)
   వోరిదేవుడా...నన్ను మార్చేయకు :-)

   Delete
 18. మగతనిదురలో తెరలు తెరలుగా నా కనుపాపలపై నర్తిస్తావు
  ఆ జ్ఞాపకాల్లో అచ్చంగా మనిద్దరమే ఉన్నామని తెలిసికూడా
  జామురేయి జోరీగవై నా కంటి కునుకుని తెలియక దోచేస్తావు
  మీరేమో అందంగా అలవోకగా చెప్పేస్తారు, కమెంట్స్ రాయాలంటే తలకొట్టుకుని చస్తున్నా...నమ్మరు కదా చెప్పినా

  ReplyDelete
  Replies
  1. ఆకాంక్షగారు...మీరు ఇలా తలకొట్టుకుంటే నాకు తలనొప్పికదా! ఈ అనుబంధాన్ని చంపేయకండి :-)

   Delete
 19. సగం తెలిపేసి తెగేసిన మాటలతో నా హృదయాన్ని కోస్తావు
  మౌనాలతో మిగిలిన ఖాళీలని భర్తీచేసే తర్ఫీదు తెలపకుండా
  కాస్తంత తడిని కళ్ళలో నింపి సాగరంతో మదిని పూడుస్తావు! sooooooooooooper like touching lines...

  ReplyDelete
  Replies
  1. మీరు భావాన్ని ఆస్వాధించడంలో అగ్రగాములు. అందుకే మీకు సలాం _/\_

   Delete
 20. కొన్ని జీవితాలు అంతే చిన్నతనంలోనే పెద్దరికాన్ని వహించాల్సి వస్తుంది. కవిత బాగుంది.

  ReplyDelete
  Replies
  1. తప్పదు కదాండి ప్రేరణగారు. థ్యాంక్యూ

   Delete
 21. తెగేసిన మాటలతో నా హృదయాన్ని కోస్తావు...మనసు తాకిన కవిత.

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనకు అభివందనం

   Delete
 22. నిదురలేమిని పారద్రోలేసే వింతకళనొసగే విద్యనేదో నేర్పకుండా
  మాయని పొరలు పొరలుగా కప్పి జోలపాడి మరల నర్తిస్తావు!
  సుందర భావం సున్నితంగా అమర్చారు పద్మగారు.

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనకు అభివందనం

   Delete
 23. A big applause to your wonderful poetry mam.

  ReplyDelete
 24. ఆ పిలుపే ఒక ప్రకంపనమేమో పద్మార్పితగారు అందుకే పదే పదే పరవశించి అలా పిలుస్తున్నారు :-) మొత్తానికి మరో మంచి కవితను అందించారు.

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనలే నాకు స్పూర్తి

   Delete
 25. మనసు మీటే మాటలని మెచ్చుకోడానికి మాటలే కరువయ్యాయి. ఏం వ్రాయమంటారు.

  ReplyDelete
  Replies
  1. ఏం రాయకపోయినా అర్థం చేసుకుని స్పూర్తినిచ్చే అభిమానం మీది. థ్యాంక్యూ

   Delete
 26. మగతనిదురలో తెరలు తెరలుగా నా కనుపాపలపై నర్తిస్తావు
  ఆ జ్ఞాపకాల్లో అచ్చంగా మనిద్దరమే ఉన్నామని తెలిసి
  కనీసం కలనైనా కనబడుతున్నాడు అనుకోండి :-)

  ReplyDelete
  Replies
  1. కలలతో కడుపు నింపుకుని కాలక్షేపం ఏం చేస్తాం చెప్పండి :-)

   Delete
 27. mana'ssumaala" abhinandanalu padma garu. as I sad nenu sahitya roopalatho parichayam leni vadini. mee kavithalu chaduvutoo ippude adugulu veyatam nerchukuntunnanu. naa baashaku andani bhavam cheppalani tapatrayam vundi. asakthdini. one thing. Having read a couple of poems, i see a fullness of a woman in your poetry

  ReplyDelete