మనసులోనే మూతపడ్డ వ్యధని కరిగి కన్నీటి జల్లవనీ
కన్నీటితో తడిసిన కోర్కెలు ఆశల గాలిసోకి మరీ ఆరనీ
నమ్మకంలో సొమ్మసిల్లిన మదిని నీరుతాకి కాస్త లేవనీ
బరువు తీరి మనసు తేలికైనదని తెలిసి మరల ఎగురనీ
విప్పారిన రెక్కలు ఆరగానే విహంగినై గగనాన్నే తాకనీ!
దారిలేని మజిలీలు ఎన్నున్నా కొన్ని అయినా నెరవేరనీ
రేయంతా తపనతో తడిసిన చెమటకి వేకువవేడేదో సోకనీ
కరిగిపోబోయిన కలలని మనోధైర్యంతో మంచుగా మారనీ
సూర్యకిరణాల తాకిడికి సాధించాలన్న పట్టుదలనే పెరగనీ
ఆ స్థైర్యంతో ఒడుదుడుకులనే ఖండించి ముందుకు సాగనీ!
మనసు మైనం ముద్దలా కరిగిపోయి మమతలనే వెతకనీ
ప్రేమనే అన్వేషిస్తూ పై మెరుగులకే లొంగక బయట పడనీ
గుండె పగిలితే అతుక్కుని గుణపాఠమై ముందుకు సాగనీ
అనుభవాలనే జ్ఞాపకాల వరంగా ఇచ్చి చెడుని మరచిపోనీ
మచ్చలనే దాచి చందమామనై చీకటిలో వెలుగునే పంచనీ!

SUPERB
ReplyDeleteHATS OFF TO YOU AND YOUR THOUGHTS
ప్రతి వాక్యం ఎంతో ఇన్స్పైరింగ్ గా రాశారు మేడం. చదునైన సముద్రంపై సాఫీగా సాగిన వెన్నెల కిరణాల్లా ప్రకాశిస్తున్న మీ ఈ కవిత అభిమానుల మనసు-మెదళ్ళలో వెలుగుదీపమై నిలుస్తుందని కాంక్షిస్తూ.... మీ అభిమాని
ReplyDeleteఇది పద్మార్పిత బ్రాండ్ కవిత అనడంలో సందేహం లేదు. అభినందనలు.
ReplyDeleteXordinary feel kavitha
ReplyDelete+వ్ థాట్స్.. మీ బ్లడ్ గ్రూప్ B+ అన్నమాట :-)
ReplyDeleteఅన్నీ మంచివే జరగనీ అంటే ఇంక చెడుకి ఆస్కారం ఎక్కడుంటుంది అర్పితగారు.
ReplyDeleteఇలా జరగనీ అని అన్నీ మంచి మాటలు మీరే చెప్పేస్తే మా విశ్వం అసలే మాలోకం ఏం చెప్పగలడు చెప్పండి. మీ కవితా మాయలో పడ్డం తప్ప :-)
ReplyDeleteమీలోని పాజిటివ్ ఆలోచనలే మిమ్మల్ని ఇంత అనందంగా వ్రాయడానికి ప్రేరేపిస్తున్నాయి అనిపిస్తుంది మీ ఈ అధ్భుతమైన కవిత చదువుతుంటే. కుడోస్ పద్మార్పిత
ReplyDeleteMastugundi. paintinglo nuvvena akka.
ReplyDeleteబరువు తీరి మనసు తేలికైనదని తెలిసి మరల ఎగురనీ
ReplyDeleteవిప్పారిన రెక్కలు ఆరగానే విహంగినై గగనాన్నే తాకనీ!
Very good positive thoughts.
మాడం మరోమారు మీకు వందనం. అచ్చ తెలుగు ఆత్మబలం ఉన్న భావమాల అందించారు.
ReplyDelete1."మరల ఎగురనీ" బదులుగా "మరల ఎగరనీ" అంటే మరింత బాగుంటుంది!
ReplyDelete2"విహంగినై గగనాన్నే తాకనీ" బదులుగా "విహంగినై గగనాన్ని" అంటే మరింత బాగుంటుంది!
మొత్తం మీద భావం ఆశని నింపేదిగా బాగుంది!
హరిబాబుగారూ,
Deleteఎగురు అన్నదే సరైన రూపం కదా, అందుచేత మీతో ఏకీభవించలేకపోతున్నాను. విహంగినై గగనాన్నే తాకనీ అన్నదే బాగుందని నా అభిప్రాయం, విహంగినై గగనాన్ని తాకనీ అన్నదీ సరైనప్రయోగమే ఐనా అర్థఛ్ఛాయాబేధం కొంత ఉంది కాబట్టి కవయిత్రితోనే ఏకీభవిస్తున్నాను.
మీ వివరణ బాగుందండి శ్యామలీయంగారు.పద్మార్పిత తెలియకుండా/తెలుసుకోకుండా అనాలోచితంగా ఏదీ వ్రాయరని మా నమ్మకం. చాలా ఏఅళ్ళుగా ఆవిడ బ్లాగ్ ని ఫాలో అవుతున్న అనుభవం.
Deleteమంచి స్ఫూర్తినిచ్చే కవితను వ్రాశారు పద్మార్పిత
ReplyDeleteప్రేమనే అన్వేషిస్తూ పై మెరుగులకే లొంగక బయట పడనీ
ReplyDeleteగుండె పగిలితే అతుక్కుని గుణపాఠమై ముందుకు సాగనీ
అనుభవాలనే జ్ఞాపకాల వరంగా ఇచ్చి చెడుని మరచిపోనీ
మచ్చలనే దాచి చందమామనై చీకటిలో వెలుగునే పంచనీ! outstanding lines mam.
as usual your poem rocks.
ReplyDeleteఅందమైన భావాలతో కూడిన మీ కవితలా జీవితం సాగిపోతే ఎంతో బాగుంటుంది పద్మార్పతగారు.
ReplyDeleteతలవంచని నీ ఆత్మస్థైర్యమే నీ ఆలోచనలకి నీ భావాలకి నిచ్చెనలు అవే నీవు అధ్భుతమైన కవితలు అందించేలా చేసాయి. ధీర్ఘాయుష్మాన్ భవః-హరినాధ్
ReplyDeleteso beautiful art pic padmaji.
ReplyDeleteరోజు రోజు అభిమానం పెరిగి అభినందించడానికి అక్షరాలు కరువైపోతున్నాయి పద్మ.
ReplyDeleteజబర్దస్త్ తూటాలాంటి మాటలు. :-)
ReplyDeleteసుమధురభావాల సుమమాలకి తగిన చిత్రాన్ని జోడించారు పద్మార్పిత.
ReplyDeleteHAPPY VALENTINE DAY PADMA.
ReplyDeleteస్పందనలతో ప్రేరణనిస్తున్న అక్షర అభిమానులు అందరికీ అభివందనం_/\_
ReplyDeleteమీ భావాలకి అద్దంపట్టే మరో కవిత ఇది.
ReplyDeleteసూపర్ పెయింటింగ్ మాడం. ఎక్కడ దొరుకుతాయండి బాబు మీకు ఈ చిత్రాలు. కవిత అదరహో అదుర్స్
ReplyDeleteఇలానే జరగనీయండీ... మీరేం చెప్పినా ఓ తాత్వికత అంతర్లీనంగా ఒద్దికగా ఒదిగిపోయుంటుంది కదా.. అభినందనలతో.
ReplyDelete