నా మదిలోని భావాలను లూటీ చేసేసి
మౌనమనే లాటీతో కొట్టి లాలించమాకు
నాపై నీ భావాలని మనసులోనే దాచేసి
మాయమాటలతో మదిని మభ్యపెట్టకు!
నా గుండెసడికి నీ గుండెలయ శృతిచేసి
ఆశలే రేపి ప్రణయమని రాగాలు తీయకు
మనసిచ్చానన్న మిడిసిపాటుతో చిందేసి
తనువునే కోరి తైతక్కలాడి అలుసైపోకు!
నా మనసుని నీ అనురాగంతో పెనవేసి
ఒక పోగు నీవు మరొకటి నేనని వేరవకు
ప్రేమతో ఆడిన దాగుడుమూతల్లో అలసి
సొమ్మసిల్లినాక తనువులు వేరని అనకు!
నా చెలిమి నీ ఎదలోయలో ప్రవహింపజేసి
వలపునదై పొంగి పొర్లిపోతే ఘనీభవించకు
నా మనసు నిన్ను నమ్మినవేళ కాపుకాసి
ప్రేమపై నాకున్న ప్రేమను వమ్ముకానీయకు!
మౌనమనే లాటీతో కొట్టి లాలించమాకు
నాపై నీ భావాలని మనసులోనే దాచేసి
మాయమాటలతో మదిని మభ్యపెట్టకు!
నా గుండెసడికి నీ గుండెలయ శృతిచేసి
ఆశలే రేపి ప్రణయమని రాగాలు తీయకు
మనసిచ్చానన్న మిడిసిపాటుతో చిందేసి
తనువునే కోరి తైతక్కలాడి అలుసైపోకు!
నా మనసుని నీ అనురాగంతో పెనవేసి
ఒక పోగు నీవు మరొకటి నేనని వేరవకు
ప్రేమతో ఆడిన దాగుడుమూతల్లో అలసి
సొమ్మసిల్లినాక తనువులు వేరని అనకు!
నా చెలిమి నీ ఎదలోయలో ప్రవహింపజేసి
వలపునదై పొంగి పొర్లిపోతే ఘనీభవించకు
నా మనసు నిన్ను నమ్మినవేళ కాపుకాసి
ప్రేమపై నాకున్న ప్రేమను వమ్ముకానీయకు!
అంతటి రసికతనెరిగిన వాడా ఆ ప్రియుడు :) లవ్లీ పిక్
ReplyDeleteమీకు తెలియనివాడా. :-) థ్యాంక్యూ
Deleteడైరెక్ట్ నువ్వు కావాలి అని చెప్పేస్తే పోతుంది ఈ డొంకతిరుగుడు లేకుండా. ఏమంటారు?
ReplyDeleteడైరెక్ట్ గా అడిగే ధైర్యం ఉండాలిగా :-)
Deleteఒక్కొక్క స్టాంజా మీదైన మార్క్ తొ.. వలపు కుమ్మరిస్తోంది ...
ReplyDeleteగోముగానో... ఘాటుగానో...గడుసుగానో ... మొత్తానికి సూపరండి మీ కవిత...
గోమైనా... ఘాటైనా...గడుసుతనమైనా మీ ఆభిమానం ముందు దిగదుడుపే :-) థ్యాంక్యూ
Deleteమదిలోని భావాలనె లూటీ చసేవాడు మౌనంగా వుంటాడా?
ReplyDeleteలాలించడానికి లాటీ వాడేవాడు సరసుడెట్లా అవుతాడు?
భావాలని మనసులోనే దాచేస్తే అప్పుడిక
మాయమాటలెట్లా వస్తాయి మభ్యపెట్టటానికి?!
గుందెసడికి గుండెలయని చేర్చి శృతి చెయ్యవచ్చును గానీ
అది ప్రణయమని రాగాలు తియ్యకూడదా యేమి చోద్యం?
ఇంతటి గడుసరి మనసిస్తే మిడిసిపడని వాడుంటాదా?
తనువును కోరని వుత్త ప్రణయం మరీ అలుసైపోదా?
మనసునీ మనసునీ ముడిపెట్టి పెనవేశాక
అసలు పోగులుగా విడిపోవటం సాధ్యమా?
దాగుడుమూతలు పూర్తయి అలసి
సొలసినాక కూడా వేరవకపోతే కష్టం కదా!
నేను ప్రశ్నలు వేసి మీ బుర్రలు తింటున్నానని నున్ను ఇలా తిరిగి ప్రశ్నించడం న్యాయమా :-)
Deleteyem chesindu :-)
ReplyDeletecheppaniki chinni kadha kaadule :-)
Deleteపద్మా ఈ సంవత్సరం అంతా ఏం, ఎందుకు, ఎలా అని ప్రశ్నలతో చంపేస్తావా ఏంటి. :) కవితాపరంగా భవ్యమైన పదశైలి నీది. ఆయుష్మాన్ భవ-హరినాధ్
ReplyDeleteహన్నన్నా ఎంతమాట :-)
Deleteనా చెలిమి నీ ఎదలోయలో ప్రవహింపజేసి
ReplyDeleteవలపునదై పొంగి పొర్లిపోతే ఘనీభవించకు
ఇది పద్మార్పిత ప్రణయ ప్రావాహం ha ha
కాదు కాదు...చిరుజల్లు మాత్రమేనండి :-)
Deleteనా మదిలోని భావాలను లూటీ చేసేసి
ReplyDeleteమౌనమనే లాటీతో కొట్టి లాలించమాకు bagundi bhavam
Thank Q
DeleteNo chance
ReplyDeleteI don't want to take risk :-)
Deletemee priyudu police? lootee chesi latito lalinchadaniki.:-)
ReplyDeletePolice aithe maagoppa chikku kadaa :-)
Deleteమాటల గారడితో మభ్యపెట్టేది మీ కవితలే ఆ అదృష్టం అందరికీ ఎక్కడిది చెప్పండి :-)
ReplyDeleteనిష్టూరాలు వేస్తే ఎలా చెప్పండి.
Deletegood poetic lines. i luv it.
ReplyDeleteImpressive Profile & Blog
ReplyDeleteWelcome to my blog. thank you.
Deleteso happy to read this blog.
Delete2good
ReplyDeletethankQ Payal
Deleteచురుకైన ప్రేమ పదాలు చాకులా మీ ప్రియుడి గుండెల్లో దించినట్లు... మరీ ఇంత ఆక్రమణా??? :-) :-)
ReplyDeleteఇదో నేరమా నాపై :-)
Deleteపద్మా ,
ReplyDeleteభావానికి తగ్గ చిత్రం ఈ సారి రాలేదనిపిస్తుంది .
ఏదో చేయమాకు అంటూ ఏదోలా గీశావేమో అన్నట్లుగా వున్నది .
ఆ టైటిల్ నిన్ను ప్రభావితం చేసిందేమో అనిపించింది .
అవునా భావానికి తగ్గ చిత్రం కాదా శర్మగారు. అయ్యుండవచ్చును.
Deleteకానీ నేను గీయలేదుగా.
మీ స్పందనకు నేనర్లు.
భావాత్మకంగా వ్రాసారు అర్పితగారు.
ReplyDeleteధన్యవాదాలండి ప్రేరణగారు.
Deleteమాడం మీరు అదనీ ఇదనీ కంప్యూజ్ చేయకండి. అసలే టెన్షన్లో ఉన్నాను.
ReplyDeleteకంప్యూజ్ అయ్యి టెన్షన్ మరిచిపోతారనే ఇలా :-)
Deleteభావాలను లూటీ చేసేసి
ReplyDeleteమౌనమనే లాటీతో కొట్టి లాలించకు
మీరు లూటీ చేసి ఎదుటివారిపై నిందా :-)
మీది మరో అభియోగం...తప్పదు భరించాలి :-)
Deleteవిరహ గీతా విలాసం...మధుర భావాల సమ్మేళనం..ప్రణయ రాగాల సుధామయం...పద్మర్పిత కవిత్వం
ReplyDeleteమీ కవితాభిమానం
Deleteనాకు ఉల్లాసం ఉత్తేజభరితం.
మీకు నా హృదయపూర్వక వందనం
No comments, bcoz no words :) ha hah
ReplyDelete