ఏం అడిగేవు!


 ఎగిరిన భ్రమరాన్ని ఏం అడిగేవు
రాలిన పువ్వులోని పుప్పొడేదని!

నుదుటి ముడతల్ని ఏం అడిగేవు
బ్రతుకుబాటలో వంకర్లు ఎందుకని!

వెలుగుతున్న వత్తిని ఏం అడిగేవు
ప్రమిదలోని చమురు ఎంతుందని!

పీలుస్తున్న ఊపిరిని ఏం అడిగేవు
ఎన్నాళ్ళు ఎడతెరపిలేని ప్రక్రియని!

పాతిపెట్టిన శవాన్ని ఏం అడిగేవు
సమాధిలో నిశ్చింత నచ్చిందా అని!




17 comments:

  1. అంత వయ్యారంగా అడిగితే ఏం చెప్పగం.

    ReplyDelete
  2. How are you ? Nice .
    To know the answers she is questioning .
    But she has to question till she knows for that she has to put in question manner in the second line last .

    ReplyDelete
  3. మీ ప్రతి ప్రశ్నలో అంతర్లీనంగా దాగి వున్న వేదన అవగతమౌతోంది. మీ శైలికి మరో మచ్చుతునక ఈ కవిత. అభినందనలతో..

    ReplyDelete
  4. పాతిపెట్టిన శవాన్ని ఏం అడిగేవు
    సమాధిలో నిశ్చింత నచ్చిందా అని! //// Fentastic lines Madam .. Hope You are fine.

    ReplyDelete
  5. lovely poem with beautiful picture

    ReplyDelete
  6. ఏం అడిగిన తప్పు అందుకే అడగం

    ReplyDelete
  7. ప్రశ్నలు ఏం అడక్కుండానే జవాబులు వచ్చేసాయి. బాగుంది మీ కవితాచిత్రం.

    ReplyDelete
  8. ప్రతి పంక్తిలో వేదనను మిక్స్ చేసి అర్ద్రతతో మనసుని తడిచేసారు మాడం.

    ReplyDelete
  9. expressive painting with impressive wordings padmaji

    ReplyDelete
  10. nazakath anukuna chadivite samj ayindi. correct chepinav

    ReplyDelete
  11. అడగడానికి బోలెడన్ని ప్రశ్నలు పద్మార్పిత, కానీ జవాబులు కడుచేదు జీవితంలో అందుకే అడక్కపోవడమే ఉత్తమం

    ReplyDelete
  12. మేం అడగాలా ఏంటి చెప్పదలుకున్నవి అన్నీ చెప్పేస్తున్నారు మీ కవితల్లో :-)

    ReplyDelete
  13. బులెట్స్ వంటి క్వెషన్స్ అడుగుతాం ఆన్సర్స్ చెబుతారా? హా హా

    ReplyDelete
  14. అడగను అడగను లేమ్మా :-)

    ReplyDelete
  15. మీరు ప్రశ్నల పరాక్రమరాలా?? :-)))

    ReplyDelete
  16. ఏం అడిగావు అని వయ్యారంగా నిలబడి అమాయకంగా అడిగితే అడవలసినవి అన్నీ మరచిపోతాం అని తెలిసే మీరు అడిగారని మాకు తెలుసులెండి. :-)

    ReplyDelete

  17. ఏం అడిగేవు అని ఎదుప్రశ్నించినా...ఓపిగ్గా సమాధానం ఇచ్చిన ప్రతి అభిమాన వాక్యాని వందనం._/\_

    ReplyDelete