వింత వ్యసనం

ఎప్పుడు తలపుల్లో తడిమేస్తావు
ఇదే మాయరోగమో ఏమో నీకు
నీకంటూ నివాసమే ఏదీ లేదా!?
నా మదిలోనే నిదురిస్తుంటావు..నిటారుగా నిలబడ లేక తిరిగేవు
కాళ్ళకి చక్రాలు ఉన్నాయా నీకు
నిబ్బరంలేని నికార్సైన వాడివా!?
నా చుట్టూనే పరిభ్రమిస్తున్నావు..నిషాలో ఉన్న త్రాగుబోతువి నీవు
కల్తీలేని నాప్రేమ కిక్ ఎక్కింది నీకు
ఈ వ్యసనం నుండి బయటకురా!?
నాశ్వాసలో చేరి మత్తెక్కిస్తున్నావు.

23 comments:

 1. సరళమైన భాషలో ప్రేమలోని నిషాని చక్కగా చెప్పారండి.. అదేంటో మీరేం రాసినా అద్భుతంలా అనిపిస్తుంది మేడం... సూపర్...

  ReplyDelete
 2. your feelings and thoughts on love are impressive continue

  ReplyDelete
 3. బాగుంది మీ ప్రేమ వ్యసనం అది చెప్పిన అనుభవసారం.

  ReplyDelete
 4. ఖచ్చితంగా మాయచేసి మంత్రం వేసిన బాపతే అనిపిస్తుంది కవిత చదువుతుంటే :-)

  ReplyDelete
 5. నిషాలో ఉన్న త్రాగుబోతువి నీవు..కల్తీ లేని నా ప్రేమ కిక్ ఎక్కింది నీకు...చాలా బాగా రాసారు అని అనటానికీ జంకుతున్నా...మీ భావుకతకు కామెంట్ చేసేంతటి వాడినా అని...

  ReplyDelete
 6. ప్రేమలోని మాధుర్యం అన్నింటికన్నా గొప్ప వ్యసనం. అది మీ పదాల్లో మరింత తేనెలూరి మత్తెక్కిస్తుంది.

  ReplyDelete
 7. "Amar" chitr along with your lovely poetry rocks didi

  ReplyDelete
 8. రోబొలు సైతం ఈ వ్యసనానికి బానిసై సంక నాకిపోతే మనిషిని వ్యసనం నుండి బయటపడడం సాధ్యమా చెప్పండి.

  ReplyDelete
 9. ఇది సర్వసాధారణం
  old wine in new bottle

  ReplyDelete
 10. పార్వతి దేవదాసుకు చెబుతున్నట్లు...లైలా మజ్ఞూను బుజ్జగిస్తున్నట్లు...అనార్కలి సలీం ను అనునయిస్తున్నట్లు ఉన్న మీ ప్రేమ గీతం అనిర్వచనీయం...అపురూపం...నూతన సంవత్సర శుభాకాంక్షలతో -నవజీవన్

  ReplyDelete
  Replies
  1. మీరన్నది నిజమే..ఇలాగే అనునయిస్తే అతుక్కోని వారు ఉండరు నవజీవన్ :-)

   Delete
 11. వదిలేస్తే అది వ్యసనం ఎందుకు అవుతుంది. అయినా అంత సులభమా చెప్పండి.

  ReplyDelete
 12. ప్రేమను వ్యసనం అంటే ఎలాగండి పద్మార్పితగారు.

  ReplyDelete
 13. మీ కవితలకి బానిసలమై జవాబులు ఇచ్చినా ఇవ్వక పోయినా మారు మాట్లాడక ఉంటున్నాము, ప్రేమని కూడా వ్యసనమని వదిలేయమంటే మావలన కాదు.

  ReplyDelete
 14. వద్దు వద్దు చల్ చల్ అంటే బంకలెక్క అంటుకుంటాది లవ్, మంచిగుంటది మీ కవితలెక్కనే

  ReplyDelete
 15. ఊబిలో కూరుకు పోయాక పైకి తేలడం కష్టం :)

  ReplyDelete
 16. అతనికి మీ ప్రేమ కిక్కు ఎక్కింది. అతను మీ శ్వాసలో చేరి మీకూ మత్తెక్కింది. ఇద్దరూ మత్తెక్కి ఉన్నారు. తలపుల్లో తడిమేస్తున్నప్పుడు, వలపుల్లో తడిసిపోక వారించుటెందుకు పద్మాక్షి?

  ReplyDelete
 17. ప్రేమిస్తున్నామని చెప్పి లోకువగా చూసి వ్యసనమంటూ నిందలు వేసి బెట్టు చూప తగునా? ఈ ఆడువారు మహా గడుసరులు.-హరినాధ్

  ReplyDelete
 18. చక్కటి కవిత.
  చిత్రం తగినట్లుంది.

  ReplyDelete
 19. Simple and not up to your mark padma.

  ReplyDelete
 20. Madam one doubt why you are blaming only one gender. merits and demerits are on both sides.

  ReplyDelete
 21. పిచ్చి ప్రేమకు పరాకాష్ట:-)

  ReplyDelete
 22. మీ అందరి స్పూర్తిదాయక స్పందనలకు నమస్సుమాంజలులు.

  ReplyDelete