సరసమెరుగని సంసారి

పొద్దుటేల లేచి సద్దికూడు నేను తిని
మినప ఆవిరి కుడుములు ఎందుకని
నా మనసంటి ఇడ్లీలు వేసి వెన్నరాసిస్తే
మాడిన అలసంద అట్టులా ముఖం పెట్టి
పెసరట్టంటే ప్రాణమని ప్రేమగా అడిగావు!
పోనిమ్మని సందేల పెసలు నానబోస్తుంటే
జారిన పైటమాటు దాగిన అందాలు చూసి
సజ్జ కూడు చాలు సరసానికి రమ్మన్నావు!
సిగ్గుపడి సగ్గుబియ్యం జావతో కవ్వించబోతే
జున్నుపాలేవని జావకారి జాలిగా చూసావు!

మరుసటేల మురుమరాల ఉగ్గానీ నే తిని
ఉప్మా చేతికందిస్తే ఉరుమురిమి చూస్తావని
ఉల్లిదోశనే దోరగా కాల్చి ఊరగాయతో అందిస్తే
ఉలిక్కిపడి ఊరడించమాకని మీసం మెలిపెట్టి
రాగిసంకటి ముద్ద ఏదని ముద్దుగా అడిగావు!
రాకపోయినా రాగమే రంగరించి వండబోతుంటే
వేడి పుట్టిస్తున్న వాడిచూపులకి ఒళ్ళు విరిచేసి
మజ్జిగ తాగి మరిగే నీళ్ళ స్నానమాడాలన్నావు!
పొంగే పరువమాపి పొంగడాలో బజ్జీలో వేయబోతే
గారెలేవి గృహలక్ష్మీ అంటూ గారాలు బోతున్నావు!

62 comments:

 1. పల్లెటూరి జంట సరస సరాగాలు హృద్యంగా ఆవిష్కరించారు..బావుంది పద్మాజీ...

  ReplyDelete
  Replies
  1. మెచ్చిన మీకు ధన్యవాదాలండి._/\_

   Delete
 2. ఇంతకీ ఈరోజు ఏంటి స్పెషల్ . మొత్తానికి పస్తులుంచావన్నమాట:-) -హరినాధ్

  ReplyDelete
  Replies
  1. వండినవి వదిలేసి లేనివాటిని అడిగితే ఏం చేయమంటారు :-)

   Delete
 3. సరసమెరుగని సంసారి కాడు..
  అన్ని రుచులు మరిగిన భోగసలాలుడు.. .
  పెనిమిటికి ఇష్టమైన పదార్ధం ఇవ్వక..
  తాత్సారం చేస్తున్న నారితో....
  కొసరి కొసరి వడ్డించుకుని సంతుష్టుడవుతున్నాడు...
  (నాకు ఇలాంటివి ఇష్టం వుండవు.. కాని నా కవిత్వం ఏపాటిదో పరీక్షించుకుందామని...)

  ReplyDelete
  Replies
  1. మీ కవిత్వానికేమండి...షడ్రుచుల సమ్మేళనం. కొనసాగించండి :-)

   Delete
 4. காட்சியோடு கவிதையும் வெளிவரும் படைப்புகள் அற்புதம்.

  ReplyDelete
  Replies
  1. Meaning:: అద్భుతమైన ద్రుశ్యకావ్యాల మాలిక మీ బ్లాగ్ ప్రచురణలు... (Just assessing)

   Delete
  2. తెలుగులో పుడిస్తె బాగుంటాదబ్బా

   Delete
  3. உங்கள் கருத்துக்கள் மிகவும் நன்றி Padmanabhan Ramaswamy.

   Delete
  4. Fans blog ki dhanyavaadaalu translate chesinanduku.

   Delete
 5. thanks for delicious romantic poetric buffet dishes padmarpita. you made it once again . congrats

  ReplyDelete
 6. చాలా రోజుల తరువాత మీ బాణీలో సరసశృంగార కవితతో అలరించారు.

  ReplyDelete
  Replies
  1. తెలుగమ్మాయిగారు....మీరు రాయడంలేదు ఎందుకనో.

   Delete
 7. వంటలతో కాదు వలపు మాటలత మురిపిస్తారు మీరు . ఇంక ఏం మాట్లాడతాం

  ReplyDelete
  Replies
  1. మాటలతో మురిపిస్తే ఆకలి తీరుతుందా మహిగారు . మీరు నన్ను పొగడ్డానికి అంటారే కానీ ఈ విషయం మీకు కూడా తెలుసును. :-)

   Delete
 8. అచ్చ తెలుగు వంటకాలతో చక్కని సరస బాణీని కలగలిపి రాసిన చిక్కని కవిత... మధురంగా ఉంది

  ReplyDelete
  Replies
  1. వంటల్ని రుచిచూసి ఆస్వాధించిన మీకు ధన్యవాదాలండి.

   Delete
 9. జానపదుల జీవనంలో సరసాల్ని చాలా చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. One of the best Poems of Yours... You are always Wonderful with your surprising poems... Thanks a lot for such wonderful poem...

  ReplyDelete
  Replies
  1. నా శైలిని, రాతల్ని మెచ్చే మీ అభిమానానికి సదా బద్దురాలినండి.Thank you very much.

   Delete
 10. ఇంతకీ కూడేమైనా పెట్టారా లేక కబుర్లతో కడుపు నింపారా!?

  ReplyDelete
  Replies
  1. కబుర్లతో ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తాను చెప్పండి...కాలే కడుపుకి కూడు కంపల్సరీ కదా:-)

   Delete
 11. అందమైన భావానికి తగిన చిత్రం. కవితలో అనురాగాన్ని కురిపించారు.

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనకు ధన్యవాదాలు యోహంత్

   Delete
 12. పాపం ఇది చదివి మా శ్రీవారు భుజాలు తడుముకున్నారు ఎందుకో:-)

  ReplyDelete
  Replies
  1. పాపం ఎప్పుడూ నా అభిమానిని ఆడిపోసుకుంటారెందుకో :-)

   Delete
 13. కెవ్వు కవిత్వం

  ReplyDelete
  Replies
  1. గట్టిగా అనకండి జనాలు జడుసుకుంటారు :-)

   Delete
 14. సరసం ఎరుగని సంసారి అంటే నేను ఒప్పుకోను
  టిఫిన్ పెట్టి అంటే====అయితే ఓకె హా హా హా

  ReplyDelete
  Replies
  1. ఓకె అన్నారు కాబట్టి నాకు డబుల్ ఓకే

   Delete
 15. కల్లబొల్లి కబుర్లు కడుపు నింపవమ్మా జర మంచి జబర్దస్త్గా వండి పెట్టాలా :-)

  ReplyDelete
  Replies
  1. గదే నేను చెప్పేది....పెట్టింది తినాలని :-)

   Delete
 16. enti madam appude manchi appude bad
  konchem ishtam konchem kashtam priyudu.
  artham karu meru lover ;)

  ReplyDelete
  Replies
  1. Mixed feelings unnavaade manchi priyudu kadaa :-)

   Delete
 17. మీ బాయ్ ప్రెండు రాయల్సీమలో ఉంటాండాడా.... :-)))

  ReplyDelete
  Replies
  1. తెలంగాణా తెగింపు
   రాయలసీమ రాయల్ లుక్స్
   ఆంధ్రావాలా అంత ఆత్మస్థైర్యం
   ఉన్నవాడండి....ఎనీ డౌట్స్ :-)

   Delete
 18. తన కాంతకు దాసులు కాని వారు కలరే కానీ మీ కవితలకు దాసులు కాని వారెవరూ లేరే :-)

  ReplyDelete
  Replies
  1. నయనిగారు....కాంతలందరితో కొట్టించేలా ఉన్నారు మీరు :-)

   Delete
 19. అనురాగం హెచ్చితే తప్పులు దండీగా అగుపిస్తాయి. సరసంలేని సంసారి కాడు సద్గుణవంతుడు. కవితతో గిలిగింత పెట్టారు పద్మార్పితా

  ReplyDelete
  Replies
  1. అతి సర్వత్రా వజ్జిత్...కాదంటారా :-)

   Delete
 20. మనసంటి మెత్తని ఇడ్లీలు మనస్పూర్తిగా చేసి అందించేవారు మాకులేరు. కేవలం మీరు కవితలు చదివి నోరూరుతుంటే లొట్టలు వేయడం తప్ప ఏం చేయలేం.

  ReplyDelete
  Replies
  1. బోలెడన్ని హోటల్స్ అందుబాటులో ఉన్నాయి కదండి :-)

   Delete
 21. thanks for your tasty & healthy food poem

  ReplyDelete
 22. కమ్మగా అన్నీ చేసిపెడితే తిని సమ్మగా తొంగుంటాడే కాని సరసానికి సై అని ఏం అంటాడు చెప్మా :-)

  ReplyDelete
  Replies
  1. అయితే మీరు చెప్పినట్లు ఈసారి పస్తులుంచుతానులెండి :-)

   Delete
 23. ఏం సరసమో ఏమోనమ్మా...మాకు మాత్రం ఎప్పుడూ బ్రెడ్ జాం బిస్కట్లు తప్ప వేరేవి ఉండవు. :-)

  ReplyDelete
  Replies
  1. సంధ్యగారు...మీరే ఇలా అంటే ఏం చెప్పను :-)

   Delete
 24. గారెలేవి గృహలక్ష్మీ అంటూ గారాలుబోయాడు

  ReplyDelete
  Replies
  1. అదే కదా చూడండి చోద్యం ;-)

   Delete

 25. గారెలేవే గృహలక్ష్మీ అంటూ గారాలుబోయాడు ఘరానామొగుడు!!!

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఘరానా మొగుడు అని పొగిడితే జిలేబీలు చేసిపెట్టమంటాడండి :-)

   Delete
 26. Replies
  1. ప్రియగారు నవ్వుతూ ఉండండి. :-)

   Delete
 27. delicious snacks served with romantic touch. తినెసినా అన్ని :-)

  ReplyDelete
 28. అచ్చంగా మా విశ్వం కూడా ఇంతే :-)

  ReplyDelete