ఓ నా ఆత్మా!

ఆత్మా! ఓ నా ఆరో ప్రాణమా
ఆలోచిస్తూ అడుగులో అడుగేయకు
ఆవహానమని అరిచి అక్కున చేర్చుకో...
ఆలోచనలు కుళ్ళిపోకుండా ఆనందించనీ
ఆవేశమే అణగారి నీలో నన్ను ఏకమైపోనీ
ఆపేక్షలనే పాడు ఆత్మల్ని అసహ్యించుకోనివ్వు
ఆడంబరాల బానిసత్వం నుండి విముక్తి పొందనివ్వు!

ఆత్మా! ఓ నా అంతర్మధనమా
ఆలాపించి అలసినానని ఆగమనకు
ఆదరించి నీవు నా ఊపిరినే పీల్చేసుకో...
ఆశ్రయించిన నన్ను ఆత్మలకే అధినేతనవనీ
ఆడిపాడి నీ లోకంలో అంచెలంచెలుగా ఎదిగిపోనీ
ఆశల ఆకలితో చచ్చిన నాకు అమరత్వాన్నివ్వు
ఆగిపోయిన జీవగుండెకాయ కొట్టుకోకనే బ్రతకనివ్వు!

29 comments:

 1. ఆపేక్షలనే పాడు ఆత్మల్ని అసహ్యించుకోనివ్వు
  ఆడంబరాల బానిసత్వం నుండి విముక్తి పొందనివ్వు
  అర్పితగారు మీ ఆత్మసౌందర్యం అమోఘం.

  ReplyDelete
  Replies
  1. ఆత్మసౌందర్యాన్ని అనుభవసారం అధికమిస్తుందండి.

   Delete
 2. ఆది ప్రాసలతో ఆద్యంతం అలరించారు... అంతులేని ఆలోచనల మేళవింపులతో అమరత్వం వైపు సాగిపోవాలని నా తరపున కుడా మీ అంతరాత్మకు విన్నవించుకుంటున్నాను మేడం... కవితలో అంతరాత్మని ఇలా అడగడం గొప్పగా ఉందండి... అంతరాత్మని చిత్రిస్తున్న మీ ఈ చిత్రం ఇంకా గొప్పగా ఉంది.
  కొత్త సంవత్సరంలో ఈ ఆరంభ కవిత మీ ఆలోచనలకు అద్దం పడుతోంది. కానీ ఇవన్నీ మనచేతిలో లేనివి. ఎలా వస్తే అలా ఎదురీడక తప్పదు కదండీ...

  ReplyDelete
  Replies
  1. నిజమే బాగాచెప్పారు. సర్దుకుపోయి ఎదురీతలో అలసిపోయినప్పుడు పొంగే భావాలు ఇలా అంతరాత్మతో మొరపెట్టుకోవడం :-)

   Delete
 3. ఆలోచనలు కుళ్ళిపోకుండా ఆనందించనీ
  ఆవేశమే అణగారి నీలో నన్ను ఏకమైపోనీ
  మంచి మానవత్వ భావ కవిత్వం.

  ReplyDelete
  Replies
  1. ఆలోచనలు కుళ్ళిపోతేనేగా ఆశలు, ఆవేశాలు వాటిని అణగార్చుకోవాలనే తపన

   Delete
 4. శవాలని పీక్కుతినే రాబందులు వంటి బంధాలు వద్దని మీ ఆత్మని మీరే పిలుచుకోవడం వెరైటీతో పాటు వింతగా ఉన్నప్పటికి ఆలోచించవలసిన అంశం ఇది. మీకు అంతరాత్మలు ఆత్మలతో కూడా సత్సంబంధాలే ఉన్నాయని అర్థం అయింది.

  ReplyDelete
  Replies
  1. నోరు మంచిదైతే ఊరు మంచిది కదా. మనం ఒకరిని అనడం ఎందుకు అనిపించుకోవడమెందుకని :-)

   Delete
 5. ఆత్మలతో ప్రేతాత్మలు మాట్లాడతాయి కాని మీరు వాటితో స్నేహం విచిత్రం.

  ReplyDelete
  Replies
  1. కుదరనప్పుడు కాళ్ళ బేరంలా :-)

   Delete
 6. మంచి భావాత్మకవిత పద్మ. ఒకే మూసలో రాస్తున్నావు. అన్యదా భావించక బయటపడే ప్రయత్నం చేయి

  ReplyDelete
  Replies
  1. మీలాంటి పెద్దవారు చెబితే అయినా వింటారేమో పద్మగారు చూడాలి. ఇకపైన ఆత్మల్ని వదిలి ఆత్మీయులతో ఉంటారని ఆశ

   Delete
  2. మనుషులతో పొత్తుకుదరక వాళ్ళ స్వార్థం ముందు నేను ఓడిపోయి ఆత్మలే అభిమానులుగా అనిపిస్తున్నాయండి.

   Delete
  3. పద్మార్పిత ఒకరు చెబితే వినదని మహీకి బాగా తెలుసు :-)

   Delete
 7. ఆత్మలతో ఆటలాడకండి మేడం. అర్థరాత్రి నిదురలేకుండా చేస్తాయి. :)

  ReplyDelete
  Replies
  1. ఇప్పుడు మాత్రం కంటిపైన కునుకే కాని మనసు మేలుకునే ఉంటుంది కదండి.

   Delete
 8. ఆగిపోయిన జీవగుండెకాయ కొట్టుకోకనే బ్రతకనివ్వు! గుండె కొట్టుకుంటుంటేనే బ్రతకలేక చస్తున్నాము మీరేమో ఆగిన గుండెతో ఎలా బ్రతకమంటారో అర్థం కాలేదు :)

  ReplyDelete
  Replies
  1. మనిషి మనసు చచ్చాక గుండె కొట్టుకున్నా ఆగినా ఒకటే కదా అని :-)

   Delete
 9. picture super. comments pedadamante letter bullets shortage.ha ha ha

  ReplyDelete
  Replies
  1. profile pic lo unna bullets use cheyakapoyaaraa :-)

   Delete
 10. మీరు ఆత్మలతో ఆంతరంగిక ఒప్పందాలు చేసుకుంటే మేము ఒప్పుకోము.

  ReplyDelete
  Replies
  1. ఒప్పందం ఏంటండి అలా కలిసిపోయాం అంతే

   Delete
 11. మీరూ మీరూ మాటలాడుకుంటే చాలా? మాతో సంప్రదించవలసిన పనిలేదా. వదలు అర్పితా నిన్ను నీ ఆరో ప్రాణాన్ని :-)

  ReplyDelete
  Replies
  1. నన్ను వీడని నీడ మీరైతే సంప్రదించకుండానే తెలుసుకుని ఆమోధిస్తారని :-)

   Delete
 12. 2015 సంవత్సరం మొదట్లోనే ఆత్మలతో ఆటలేవిటి.

  ReplyDelete
  Replies
  1. నాపై ఆత్మ అలగకుండా కాకా పడుతున్నాను అంతే.

   Delete
 13. ఇంతవరకూ ఆదరించి అభిమానించిన ఆత్మీయులు అందరికీ అభివందనములు.
  ఇకపై కూడా మీ అభిమానాన్ని ఆశిస్తూ..._/\_
  ...మీ పద్మార్పిత

  ReplyDelete