వేడితాపం ఏలనో నన్ను ఇంతగా వలచె..
వద్దు వద్దంటున్నా వెంటపడి వేధించసాగె
వేడిసెగ తాకగానే ఒళ్ళంతా కమిలిపోయె
చెమటపట్టి తనువు మొత్తం తడిసిపోయె
తాపం తాళలేనంటూ మేని నగ్నమాయె
విప్పిన వస్త్రాలు ఉతుక్కుటుండగానే ఆరె
జలకమాడి దుస్తులు వేసుకోగానే తడిసె!
వేడి వలపుసెగ వద్దుపొమ్మన్నా వరించె..
దాహమే తీరలేదన్న గొంతు ఎండిపోయె
అరుణకాంతి తాళక అధరాలు ఆరిపోయె
విరబోసుకున్న కురులు అలిగి కొప్పాయె
రవికిరణం క్రీగంట చూడ రవిక రంగుమారె
సరసమే కంపరంపెడుతూ రుసరుసలాడె
సంధిసేయ వచ్చిన చంద్రుడే చల్లగా జారె!
చెమటపట్టి తనువు మొత్తం తడిసిపోయె
తాపం తాళలేనంటూ మేని నగ్నమాయె
విప్పిన వస్త్రాలు ఉతుక్కుటుండగానే ఆరె
జలకమాడి దుస్తులు వేసుకోగానే తడిసె!
వేడి వలపుసెగ వద్దుపొమ్మన్నా వరించె..
దాహమే తీరలేదన్న గొంతు ఎండిపోయె
అరుణకాంతి తాళక అధరాలు ఆరిపోయె
విరబోసుకున్న కురులు అలిగి కొప్పాయె
రవికిరణం క్రీగంట చూడ రవిక రంగుమారె
సరసమే కంపరంపెడుతూ రుసరుసలాడె
సంధిసేయ వచ్చిన చంద్రుడే చల్లగా జారె!
విసవే కిడికితా ఖ్యవ్యా యేటాకటుఇ.. శ్రీ కృష్ణ పరమాత్మ..!
ReplyDeleteమీక్కూడా వేడిసెగ తగిలెనా శ్రీధర్ గారు. తిరగేసి వ్రాస్తున్నారు :-)
Deleteదిక్కుమాలిన వేడి వద్దు వద్దు అంటుంటే వెంట పడుతుంది-అయ్యో పాపం
ReplyDeleteపద్మార్పితగారు వేడి సెగలు చల్లారే మార్గం సూచించండి. చిత్రం మరింత వేడి ఎక్కిస్తుంది.
ReplyDeleteమిమ్మల్ని మాత్రమే కాదండోయ్ వేడిసెగ వలచింది నేను కూడా భాధితురాలినే... చిలిపిగా వలపు చిచ్చు రగిలించారు కాదు కాదు వర్ణించారు.
ReplyDeleteఈ తాపం తట్టుకోవడం బహుకష్టం సుమ్మీ
ReplyDeleteనిజంగా ఇదంతా వేడి వలపు సెగేనా లేక ఆ వంకన మీరు చెప్పవలసిన విషయాలు ఈవిధంగా చేరవేసారా? క్లారిటీ ఇవ్వండి మేడం అంటే క్లాస్ పీకుతారేమో అందుకని అడక్కుండా "SIMPLY SUPERB" అని చల్లాగా జారుకుంటా...అన్నట్లు చెప్పడం మరిచాను చిత్రంలో మొత్తం భావాన్ని కాచివడకట్టారు. కుడోస్
ReplyDeleteఅడగకూడదేమోనని అడగలేదంటూనే అడగాల్సింది అడగకనే అడిగేసినట్టున్నారు ఆకాంక్షగారు..!
Deleteఎండ తాకిడికి ఏ తుపాకీ తూటు సరిపోదు.
ReplyDeleteవేడిగా వాడిగా ఉంది కవిత చిత్రం
ReplyDeleteవేడి వలపుసెగ వద్దుపొమ్మన్నా వరించె
ReplyDeleteదాహమే తీరలేదన్న గొంతు ఎండిపోయె
అరుణకాంతి తాళక అధరాలు ఆరిపోయె
వేడిగాలి బాగా సోకింది, నయం వడదెబ్బ తగల్లేదు :)
sunstroke tagilindi. take care
ReplyDeleteవలపు వేడితో సరిగంగ స్నానం చేసినట్లుంది. చిత్రంతో పూర్తిగా తడిసి ముద్దైపోయాం.
ReplyDeleteFantastic...
ReplyDeleteరవికిరణం క్రీగంట చూడ రవిక రంగుమారె,నాసిరకం బట్టల తీరు అంతేనండి
ReplyDeleteవేడి కూడా యమ హాయిగా ఉంది మీ కవితలో
ReplyDeleteNo Comments Madam
ReplyDeleteవేడి వలపుసెగ వద్దుపొమ్మన్నా వరించె..వరంగల్ లోనూ అంతే :-)
ReplyDeleteవాహ్ ఏమి చెప్పినారు
ReplyDeleteoh ha ha he hee :)
ReplyDeleteహాట్ హాట్గా చెప్పినా నిజమే చెప్పారు
ReplyDeleteహాట్ అంటూ ఇలా నాజూకు నడుము చూపి కూల్ గా ఉన్న మాకు హాట్ అనిపించేట్లు చెమటలు పట్టించకండి...
ReplyDeleteఅందరి స్పందనలకూ అభివందనములు._/\_
ReplyDeleteవేడి తాపం చల్లబడేనా..హా హా హా
ReplyDelete