నీ పరిచయం నూతనోధ్యాయానికి నాంది పలుకుతూ
నువ్వు ఎదురుపడ్డ ప్రతీసారి గుండె వేగం పెంచుకుంది!
నీవు నాయందే దాగి ఉన్నావన్న నిజాన్ని గుర్తుచేస్తూ
నా గతం తాలూకు గుర్తుల్ని నీ ప్రేమ చెరిపివేయమంది!
నాలో తప్ప నాతో లేవని అలిగినమదిని బ్రతిమిలాడుతూ
నిన్ను నీవే గాయం చేసుకోకు నన్ను తిరస్కరించి అంది!
నీ ఊపిరి నా ఊపిరితో రమించి కమ్మనికలకి రూపమిస్తూ
నా బిడియాన్ని బిగికౌగిట బంధించి కొత్తలోకం చూపింది!
నీవు వెళ్ళొస్తానని వీడ్కోలు చెప్ప నిలువడ్డంగా తలూపుతూ
ఆనందాలని మూటకట్టి కంటనీరుని రెప్పమాటున దాచింది!
నీ పై నాకు ఇంకిపోదు ప్రేమ ఇసుమంతైనానని బాసచేస్తూ
నీవన్న మాటలకి...కరిపోదులే ఆశ నీ పై కాస్తంతైనా అంది!
నువ్వు ఎదురుపడ్డ ప్రతీసారి గుండె వేగం పెంచుకుంది!
నీవు నాయందే దాగి ఉన్నావన్న నిజాన్ని గుర్తుచేస్తూ
నా గతం తాలూకు గుర్తుల్ని నీ ప్రేమ చెరిపివేయమంది!
నాలో తప్ప నాతో లేవని అలిగినమదిని బ్రతిమిలాడుతూ
నిన్ను నీవే గాయం చేసుకోకు నన్ను తిరస్కరించి అంది!
నీ ఊపిరి నా ఊపిరితో రమించి కమ్మనికలకి రూపమిస్తూ
నా బిడియాన్ని బిగికౌగిట బంధించి కొత్తలోకం చూపింది!
నీవు వెళ్ళొస్తానని వీడ్కోలు చెప్ప నిలువడ్డంగా తలూపుతూ
ఆనందాలని మూటకట్టి కంటనీరుని రెప్పమాటున దాచింది!
నీ పై నాకు ఇంకిపోదు ప్రేమ ఇసుమంతైనానని బాసచేస్తూ
నీవన్న మాటలకి...కరిపోదులే ఆశ నీ పై కాస్తంతైనా అంది!
మీ దారిలో మీరు :)
ReplyDeleteఏమని వ్యాఖ్యానించగలను నేను..!
ReplyDeleteనా కనులు చెమ్మగిల్లి చెంపను తాకితే..!!
ఏమని వ్యాఖ్యానించగలను నేను..!
నా మదిలో భావాలన్ని అక్షరాలై ఉరకలేస్తే..!!
ఏమని వ్యాఖ్యానించగలను నేను..!
నా కనులకెదుట జ్ఞాపకాలన్ని కదలాడితే..!!
ఏమని వ్యాఖ్యానించగలను నేను..!
నా మనసే మాటరాకా మౌనాన్ని ఆశ్రయిస్తే..!!
~శ్రీ~
మీ ఈ కవితకు సరితూగేలా నే రాసిన అక్షర విన్యాసమిది పద్మ గారు.. కవితను తిలకించినపుడు నాకు మళ్ళి మళ్ళి ఇది రాని రోజు సినిమా లో (శర్వానంద్ నిత్య మేనన్) గతమా గతమా పాట గుర్తుకు వచ్చింది..!
కమెంట్ వ్రాయనేల
Deleteఆ పై డెలిట్ చేయనేల
అందునా మేము చదవకనే
మీరు ఇటుల చేయనేల???? :-)
మొదటి కమెంట్ లో ఒక్క లైన్ వ్రాసాను
Deleteమరో మారు కమెంట్ లో ఒక్క స్టాంజా వ్రాసాను
అనక వ్రాసిన కమెంట్ లో మొత్తం వ్రాసానని తెలియపరుస్తున్నాను ఆకాంక్ష గారు..
ఈ రోజు నాకు స్పెషల్ డే
భువి పై ఊపిరి పోసుకున్న డే
ఈ రోజే వర్ల్డ్ కు హెల్త్ డే
మరి నాకది నా బర్త్ డే
:-)
బుక్య శ్రీధరు మిత్రమా ! మొదట మీకు
Deleteజన్మదిన శుభాకాంక్షలు , శత శతముల
ఆయురారోగ్య భాగ్య సౌఖ్యాల దేల్చి
శ్రీరమణుడు కాచి మిము రక్షించు గాత !
రాజారావు సర్..
Deleteమీబోటి మహామహుల ఆశిస్సులు సదా సర్వద శిరోధార్యం ఆచార్యవర్య.. ధన్యోస్మీ.. పెద్దవారి ఆశిస్సులు అందుకునందుకు కడు ఆనందంగా ఉంది..
జై శ్రీమన్నారాయణ
శ్రీధర్ గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు.
Deleteపద్మగారు.. థ్యాంక్యు.. వెరి మచ్ ఆబ్లైజ్డ్ టూ రిసీవ్ ఆల్ యువర్ విషెస్ యాండ్ బ్లెసింగ్స్ ఆన్ మై బర్త్ డే.. శ్రీ దుర్ముఖి నామ ఉగాది నూతన వత్సర శుభాకాంక్షలు మీకు మీ ఇంటిల్లిపాదికి..
DeleteExcellent
ReplyDeleteప్రేమ భావం పెల్లుబికిన వేళ ఇలాంటి కవితలు పుట్టుకొస్తాయి
ReplyDeleteతనువు పులకరించింది
ReplyDeleteనీ పై నాకు ఇంకిపోదు ప్రేమ ఇసుమంతైనానని బాసచేస్తూ
ReplyDeleteనీవన్న మాటలకి...కరిపోదులే ఆశ నీ పై కాస్తంతైనా
బిగిసిన భావం
చిత్రం భిన్నంగా బాగుంది
రెండేసి లైన్లలో చిక్కటి ప్రేమభావాన్ని పండించడం మీకే సాధ్యం. అభినందనలు.
ReplyDeleteexcellent art and lovely lines padma
ReplyDeleteచిక్కనైన చక్కని భావాలు మీ సొంతం.
ReplyDeleteమీరు వ్రాసే కవితల్లో అందమైన ఎన్నో సున్నిత పదాలు దొర్లుతుంటాయి. తెలుగు లిటరేచరా మీది?
ReplyDeleteనువ్వు నేను శరీరాలు వేరైనా ఒకటే అన్న భావాన్ని తెలిపే కవితాచిత్రం బాగుంది.
ReplyDeleteప్రేమ మీ పుట్టిల్లు అనుకుంటాను :-)
పదాల బిగువు బాగుంది
ReplyDeleteచాలాబాగుంది.
ReplyDeleteVery Nice madam
ReplyDeleteవెళ్ళొస్తానని చెబితేనే కదా తంటా
ReplyDeleteచెప్పకుండా అయితే పర్వాలేదు:-)
వెళ్ళొస్తానని ప్రియుడన
ReplyDeleteకళ్ళల్లో యుబుకు నీళ్ళు కనురెప్పలలో
చెల్లును గ్రుక్కగ నీకే
కల్లోలము దాచుటెంత కష్టమె? లలనా !
అయ్యో ఎంత కష్టమొచ్చింది.:)
ReplyDeleteనాలో తప్ప నాతో లేవని అలిగినమది.
ReplyDeleteపద్మగారు మీరు వ్రాసిన కవితకు టూకిగా..
ReplyDeleteYour Poem Says this Summarily Padma Gaaru..
మరిచాననుకోవటం నీ భ్రమ
తలవక ఉండటం నా తరమా..!
Deleteయింక కొద్దిగా టూకీ చేసా నండీ :)
మరిచాననుకోవటం నీ భ్రమ !
తలవ ఉండటం నా ఖర్మ :)
జిలేబి
జిల్ జిల్ జిగా.. జీలేబియం వారులకు.. ●జిలేబి వదన● కొఱకు..
Deleteతడవ తడవ తలపుల తట్టఁగా..!
కడవలో నీరు దెచ్చి బొర్లించఁగా..!!
కడు పలవరింతలలో తడవఁగా..!!!
మరిచే దేటుల జ్ఞాపకాలై నిలువఁగా..!!!!
~శ్రీ~
గరుడగమన శ్రీరమణ
శ్రీధర్ భూక్య
నాలో తప్ప నాతో లేవని అలిగినమదిని బ్రతిమిలాడుతూ
ReplyDeleteనిన్ను నీవే గాయం చేసుకోకు నన్ను తిరస్కరించి .....excellent heart touching words padma gaaru........hats-off to you
చెప్పి పోయిండు లేకుంటే లబో దిబో హా హా హీ హీ...
ReplyDeleteఈ ప్రేమ ఎన్ని తూటాలు పేల్చినా తూట్లు పడుతుంది తప్ప తరగదు :)
ReplyDelete07 Apr 2016 00:07
ReplyDeleteనువ్వొస్తానంటే నేనొద్దంటానా
ReplyDeleteవెళ్ళొస్తానంటే ఒప్పుకుంటానా
నీదానెనన్నదిరా నిన్నే కోరిన చిన్నదిరా
మనసు ఇచ్చిపుచ్చుకోవడం మాటకాదురా
కడలి కెరటం
Deleteకరిగే మేఘం
వేచిన నయనం
మూడు సరిసమానం :-)
పద్మార్పిత గారికి మరెయు బ్లాగ్ మిత్రులందరికి శ్రీ దుర్ముఖినామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాభినందనలు..
Deleteచెరుకుగాడలోని తీయదనమంత.. మామిడికాయలోని వగరునంత.. వేప పువ్వులలోని చేదునంత.. చింతపండులోని పులుపునంత..చిటికేడు ఉప్పు కాస్తంత కారం దట్టించి కాసిన్ని కాచిన నీటిలో కలగల్పితే ఆయురారోగ్యాలు సిరిసంపదలు సద్భావన సంతోషాలనే ఆరు గుణాల అభివృద్ధిని కాంక్షిస్తు నూతన వత్సరానికి శుభాగమనం మరో ఇరువది నిమిషాలలో
ReplyDeleteఅందరికీ వందనములు _/\_
ReplyDeletepicture chala bagundi :)
ReplyDelete