మధ్యలో మౌనం మరికొంత మధురగానం!
ఇద్దరం మాటలేలంటూ మైమరచిపోబోతే...
కొంత బిడియం మరికొంత తీయనిసరాగం!
ఇద్దరం తెలియని బంధమై పెనవేసుకోబోతే...
చిన్నిగాయాల హింస మరికొంత మీమాంస!
ఇద్దరం గిల్లికజ్జాలతో గొడవపడి అలకబూనితే...
కొంత ఇష్టం మరికొంత అలవికానేదో అయిష్టం!
ఇద్దరం వేరుకాలేక రాతిరి కౌగిలిలో ఏకమైతే...
అంతా పవిత్రత మరికొంత చెప్పలేని నిశ్చింత!
ఇద్దరం పగటిపూట పనిలోపడి విడిపడిబోతే...
కొంత అనురాగం మరికొంత తప్పని అసహనం!
EK MAIN EK AUR EK THU..
ReplyDeleteఇద్దరం కాని మాటల్లోనే
ReplyDeleteఒక్కరం అనేది మనసు చెప్పె వేదం
కాలం అనే తక్కెడ లో సరి సమానమై
తూగే సుమధుర అద్వితీయ అద్వైతం*
అనురాగం మేళవించగా పూచిన పుష్పరాజం
మౌనంతోనే మాటలల్లే మౌనరాగాలాపన ద్వంద్వం
* అద్వితీయ: అ+ద్వితీయ: That which has no peer (Peerless), which can never be duplicated. उदाहरण: जो ममता माता और पिता उनके बच्चों को देते हैं वह अद्वितीय होता है।
అద్వైతం: అ+ద్వ+ఇతి: That is not a double entity, but one and single entity even though they seem to be two entities physically.
उदाहरण: एक बच्चे को अपने माता और पिता कभी भी अलग नहीं दिखते वे दोनो ही अद्वैत होते हैं।
మరికొంత తొందరపాటు.. మరికొంత తత్తరపాటు.. మరికొంత ఊరట.. మరికొంత బాసట..
మరికొంత తన్మయత్వం.. కలగలిపి సాఫిగా సాగే జీవనయానం..
మీ కవిత పదాలు ఎప్పుడు ఆలోచింపజేస్తాయి పద్మ గారు
26042016 06:30 IST
~శ్రీ~
ఇద్దరం వేరుకాలేక రాతిరి కౌగిలిలో ఏకమైతే...
ReplyDeleteఅంతా పవిత్రత మరికొంత చెప్పలేని నిశ్చింత!అధ్భుతం
ఇద్దరి కలయిక కేక...
ReplyDeleteమీ నుంచి మరిన్ని ఇలాంటి మధురమైన కవితలు కోరుకుంటున్నాము.
ReplyDeleteప్రేమించడంలో కొంత ఆనందం మరికొంత అశాంతి
ReplyDeleteఛా..చాల్లే ఇంకెక్కడ ఇద్దరూ అన్నిటిలో ఒకటైతేను.
ReplyDeleteఅందమైన ఆవిష్కరణ
Simply Superb Expression
ReplyDeleteలాభనష్టాలు తులాభారం వేసి ఇద్దరూ నిర్ణయానికి రండి. అప్పుడు ఇద్దరూ ఇద్దరైనా ఒకటే :-)
ReplyDeleteతెలియని బంధమై పెనవేసుకోబోతే...
ReplyDeleteచిన్నిగాయాల హింస మరికొంత మీమాంస!
అందమైన అనుభూతి కలిగించారు.
నాణెం బొమ్మా బొరుసులా ప్రేమ రెండు వైపులా చూపారు.
ReplyDeleteఅంతా పవిత్రత మరికొంత చెప్పలేని నిశ్చింత
ReplyDeleteకొంత అనురాగం మరికొంత తప్పని అసహనం
మీ సొంతం
ReplyDeleteచిన్నిగాయాల హింస మరికొంత మీమాంస!
కొంత ఇష్టం మరికొంత అలవికానేదో అయిష్టం!
అంతా పవిత్రత మరికొంత చెప్పలేని నిశ్చింత!
ద్వంధ ప్రవర్తన చక్కగా చెప్పారు.
మీ కవితలు దేనికి అదే ప్రత్యేకం.
ReplyDeleteచిత్రం ఎంపిక ఎప్పటిలాగే కనువిందు
ఇద్దరు ఒక్కటయ్యే వేళ...అంటూ సాంగ్ ఏదో సింగుతారు అనుకుంటే ఏంటండి కొంచెం ఇష్టం కొంచెం కష్టం టైపులో చెప్పారు :-)
ReplyDeleteచిన్నిగాయాల హింస మరికొంత మీమాంస..చాలా రోజులకి మళ్ళీ విన్నాను మీమాంస అనే పదం. బాగుంది జీ
ReplyDeleteమరో రసరమ్య కావ్యం
ReplyDeleteప్రేమలో ఇద్దరూ ఎంజాయ్
ReplyDeleteLovely post madam
ReplyDeleteఇద్దరం వేరుకాలేక రాతిరి కౌగిలిలో ఏకమైతే...
ReplyDeleteఅంతా పవిత్రత మరికొంత చెప్పలేని నిశ్చింత! అధ్భుతః
VERY VERY NICE LINES DEEDI
ReplyDelete