దారెటు!?

జీవితాన్ని జీవించాలన్న జిజ్ఞాసకు లోబడి
అందరిలా పరుగులు పెడుతూ హడావిడిలో
మార్పులకు చేయూతగా నేనూ మారిపోయి
ఒంటిచక్రమై అలుపన్నదిలేక తిరుగుతున్నా..


***

ఏదో చేసి, ఎంతో సాధించాలన్న యావనబడి
ఉదయం చంద్రుడు రాత్రి సూర్యుడు వచ్చెనని  
అసలు నన్నునే మరచి యంత్రం అయిపోయి 
నే కన్న కలలకు కవచం తొడిగి తిప్పుతున్నా..


***


పగలు రాత్రి అన్న తేడాలేక పని ధ్యాసలోపడి
మదిలో మొలచిన కోరికల్ని కలనైనా తలవక
పనికి నేను బానిసనై మనిషిని రాయిగా అయి
పరిగెడుతూ పరిభ్రమణపుపట్టులో చిక్కుకున్నా..


***


పరుగులాటలో అలసట నాపై అరచి చతికిలబడి 
జీవితమే చీత్కరించి సంధ్య కూడా ఛీ పొమ్మంటే
కాలేకలల కాంతిలో ఏం కనబడక ఆశ చనిపోయి
యాంత్రికంగ గమ్యంలేని ప్రయాణం సాగిస్తున్నా..

52 comments:

  1. జీవితాన్ని జీవించాలన్న జిగ్నాసకు లోబడి ప్రయాణం తప్పదు

    ReplyDelete
  2. దేవుడిచ్చిన కేరళ కొబ్బరికాయలా సంప్రదాయబద్ధంగా చూడ ముచ్చటగా ఉంది. సంప్రదాయాలపై సవాళ్ళు విసరకుండా ఉండగలగడమే సవాల్ కదా ఇలాగే సాగిపొండి,విజయం మీదే !

    ReplyDelete
    Replies
    1. నారికేళం.. కదళిఫలం.. ఆమ్రఫలం.. అమృతతుళ్యం..
      గోక్షీరదధీఘృతం..మనుజజాతం..జాహ్నవితోయం..దుర్లభవరదహస్తసమానం..

      కొబ్బరకాయ/కొబ్బరాకు..అరటిపండు/అరిటాకు/అరటిదుంగ.. మామిడికాయ/మామిడిపండు/మావిచిగురు/మామిడాకు తోరణం ఇవన్ని శుభకార్యాలకు నాంది పలుకుతాయి

      ఆవుపాల పెరుగు తో కాచిన నేయ్యి..గంగాజలం.. ఇత్యాదులన్ని మనిషి నిర్వర్తించే భగవద్సంకల్పితాలకు త్రికరణ శుద్ధి (అనగ మనసా వాచా కర్మణ) తో అవలంబించే పుణ్యకార్యాలకు ఆలంబనగా నిలుస్తాయి.. స్వస్తి..

      Delete
    2. అయ్యా శ్రీధర్ గారూ,
      నీహారికా ఆంటీ ఎందుకలా కేరళ కొబ్బరికాయల్ని గురించి ప్రస్తావించిందో,నా స్మైలీ వెనక ఉన్న భావమేమిటో తెలుసుకోవాలంటే ఈ పోస్టు చూదండి!పోస్టు మాత్రమే కాదు,కామెంట్లు కూడా - ముఖ్యంగా పైనుంచి నాలుగో కామెంటు చూడండి:-)

      Delete
    3. నీహారికా అంటే మీకు ఏడుపు ఎందుకు ?
      :=( sad emotion
      :=) smily emotion

      Delete
    4. ఒక్కోసారి ఘనాపాటిలకూ గండము ఉండునని తెలియవచ్చినది మహాశయా.. సదరు నిత్య మీనన్ గూర్చి ప్రస్తావించటం దేనికి.. ఇలా టెంకిజెల్లల ఘటవాద్యమంటు మరల చింతించటం దేనికి ఆచార్యవర్య.. చిన్న వాడినైనా ఒక చిన్న మాట చెబుతాను తప్పుగా అనుకోవద్దు.. పరులు దూషిస్తున్నారంటే రెండు కారణాలు ఉండవచ్చు: ఒకటి మనం రాసింది ఎక్జాట్ గా నిజమై ఉండాలి లేదా మనం రాసింది ఎక్జాజరేషన్ ఐనా ఉండాలి.. ఇహ లోకం ఆలోచన తీరు బట్టి కూడా ఉండునని మీకు తెలియనిదా.. ఇది క్లాస్ అనుకోమాకండి తిట్టు పొగడ్త సలహా కూడా కాదు..

      ఐతే నేను నీహారిక కృష్ణమూర్తి గారి కేరళ కొబ్బరి కాయ పదాన్ని ఆపద నివారిణిగా సూచనప్రాయంగా సెలవిచ్చాను..


      కొబ్బరి లేనిదే ఏ పుణ్యకార్యము సఫలికృతం కాదు.. అరిటాకు లేనిదే పంచభక్ష్య పరమాన్నమైన ఒంటబట్టదు.. మామిడాకులు లేకుండా పండగ మొదలవదని పెద్దల ఉవాచా..

      ఐనా కృష్ణమూర్తి మ్యాడమ్ గారు.. యూ కుడ్ హ్యావ్ పోస్టెడ్ ది కామెంట్ దేర్ ఇట్సెసెల్ఫ్.. ఎనివేస్ అపాలజీస్ ఇఫ్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ఎనిథింగ్ ఇన్ రూడ్ ఆర్ అబ్జేక్షనేబల్ మ్యానర్..
      మరోలా అనుకోవద్దు.. ఏదైన తప్పుగా రాసి ఉంటే ముగ్గురు: అనగ పద్మ గారు, హరిబాబు గారు, నీహారిక గారు మన్నించండి.

      హరిరామాచ్యుతగోవిందమాధవ
      గరుడగమన శ్రీరమణ

      ~శ్రీధర్ భూక్య

      Delete
    5. నా మొదటి సాడ్ స్మైలీకి అర్ధం,అయ్యయ్యో!నీహారికా ఆంటీ నా పోష్టు మొత్తం కామెంట్లతో సహా చదివేసి అక్కడ కిక్కురుమనకుండా ఇక్కడ మిగతావాళ్ళ కెవరికీ అర్ధం అయ్యీ కాకుండా ఒక అన్యాపదేశపు కామెంటు వేసిందేమిటా అని మొదట బిక్కమొహం పెట్టాను.మీరేమో ఈ బ్యాక్ డ్రాప్ ఏమీ తెలియక నారికేళ కదళీ పురాణం విప్పారు.దానికి నాకు నవ్వొచ్చి మీకు క్లూ ఇస్తూ నవ్వుమొహం పెట్టాను.అంతకన్న ఘోరం/దారుణం ఏమీ జరగలేదు లెంది - ముఖ్యంగా నేను చాలా స్పోర్టివ్!

      Delete
    6. This comment has been removed by the author.

      Delete
  3. మీ నుంచి ఇటువంటి నిసృహా వాక్యాలు నిరాశగా ఉన్నాయి.

    ReplyDelete
  4. Haiy padma...hope everything is well.
    Always be happy and in cheerful mood.

    ReplyDelete
  5. ఈ కవిత కు దారి తెలిస్తే జీవితాన్ని ప్రయాణమని ఎందుకంటారు..
    ఈ కవిత కు దారి తెలిస్తే పలుకులకు భావాల లేపనం ఎందుకంటారు..
    ఈ కవిత కు దారి తెలిస్తే ఆశ నిరాశ ల నడుమ ఏదో అనిశ్చితి ఎందుకంటారు..
    ఈ కవిత కు దారి తెలిస్తే జనన మరణ ప్రక్రియ కాల చక్ర భ్రమణమని ఎందుకంటారు..

    మన దేహమంత రుధిరమే ఉంటుంది కాని బాధ కలిగితే కన్నిరే ఉబికోస్తాయి.. కన్నీరే ఉబికోస్తాయి

    కాదంటారా పద్మ గారు

    ReplyDelete
    Replies
    1. ఆశలే ఊపిరైతే అడియాశల ఊబిలో చిక్కిన నేను జీవచ్ఛవమే
      నవ్వులే ఆయువైతే దుఃఖంలో కూరుకున్న నేను జీవచ్ఛవమే
      పలకరింపులే జీవమైతే మౌనం అలవర్చుకున్న నేను జీవచ్ఛవమే
      :
      జీవచ్ఛవమైనా
      :
      అడియాశల ఊబి నుండి ఆశ చివురులు తొడిగేనని ఎదురు చూపులు
      కూరుకుపోయినా ఏ చిన్న గడ్డి పరకైనా కాపాడుతుందేమోనని ఎదురు చూపులు
      మాటరాక మూగబోయిన గొంతుకలో తీయ్యని భావాలు ఎగిసిపడతాయేమోనని ఎదురు చూపులు

      Despair Poetry Disclaimer: The above poetry piece is just a fiction based comment and has no relevance or relation to anything or anyone either living or dead.

      ~శ్రీ~

      Delete
    2. నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే
      విరుచుకుపడు సుర గంగకు విలువేముంది విలువేముంది

      కాశినాథుని విశ్వనాథ్ గారి స్వర్ణకమలం లో కనిపించే ఒక చక్కని భావరాగభరిత కృతి

      Delete
    3. ఎడాపెడా ఏదేదో వ్రాసి
      మత్తులో మరోలోకానికి
      తీసుకుని వెళ్ళిపోతే
      ఏం చేయమంటారు శ్రీధర్గారు

      Delete
    4. ఎడారిలో ఎండకి దారి మరిచిన బాటసారి
      ఏ వైపని పయనమయ్యేది ఓ కృష్ణ మురారి
      ఇహ పరాలను మించి మరే లోకం లేదు
      చౌపంక్తి లో భావాన్ని తెలిపినారు ఆకాంక్ష గారు

      Delete
  6. భాధలో దారితెన్నులు వెతకడం ఎందుకు చెప్పండి.
    కనులారా ఏడ్చి తరువాత నవ్వడమే..కాదంటారా

    ReplyDelete
  7. అమోఘం మీ అక్షరమంత్రజాలం
    అది వేదనైనా వేడుకైనా మీ ధాటికి తలవంచాలి.

    ReplyDelete
  8. పగలు రాత్రి అన్న తేడాలేక పని ధ్యాసలోపడి
    మదిలో మొలచిన కోరికల్ని కలనైనా తలవక...ఇలా ఎలా???

    ReplyDelete
  9. ఏడుపే పరిష్కారం అనుకుంటే నాలా మీలా ఏడ్చేవాళ్ళు ఎందరో :-)

    ReplyDelete
  10. దారులు మనం ఎంచుకోవాలి
    అడగడం ఏమిటి మాడంగారు

    ReplyDelete
  11. కనుపాప పిల్లలైతే కనురెప్ప అమ్మ
    కనుల ముందు కదలాడే దైవం అమ్మ
    అవనిపై నడియాడే బ్రహ్మ స్వరూపిణి అమ్మ

    ప్రాణానలు సైతం పణంగా పెట్టి ప్రాణాలు పోసేది అమ్మ
    అణువణువును పులకింపచేసే పలకరింపు అమ్మ
    కొలువగ ఒక రోజైనా చాలునా.. పంచప్రాణాలకు ప్రతీక అమ్మ


    మాతృదినోత్సవ శుభాభినందనలతో..
    ప్రతి మాతృమూర్తికి అంకితం..
    మే ఎనిమిదవ తేది మదర్స్ డే సందర్భముగా..

    ReplyDelete
  12. గమ్యం లేని ప్రయాణం:-(
    అర్ధం లేని ఆలోచనం:-(
    అయోమయమైన తీరం:-(
    ప్రాప్తమున్న తీరానికి ఈ పడవ సాగిపోతుందా?
    కాలం కలిసిరాక "నౌకా డుబీ" అయిపోతుందా!

    ReplyDelete
  13. పగలు రాత్రి అన్న తేడాలేక పని ధ్యాసలోపడి
    మదిలో మొలచిన కోరికల్ని కలనైనా తలవక
    పనికి నేను బానిసనై మనిషిని రాయిగా అయి-ఈ రీతిలో ప్రయాణం ప్రమాదం, వలదు వలదు పద్మమ్మో జాగ్రత్త

    ReplyDelete
  14. వేదనని చక్కని వర్ణించారు.

    ReplyDelete
  15. మీకే సులువుగా చెప్పేస్తారు వ్యధలని కూడా సునాయసంగా జయించడం ఎలాగో. కానీ కష్టం కదూ ఆలోచించడం ఆచరించడం

    ReplyDelete
  16. పరుగులాటలో అలసట నాపై అరచి చతికిలబడి
    జీవితమే చీత్కరించి సంధ్య కూడా ఛీ పొమ్మంటే,,,మరీ ఇంత నిరాశా ఎందుకని మీలో పద్మగారు.

    ReplyDelete
  17. Y desperate sad poem from you?

    ReplyDelete
  18. నలుగురూ నడిచిన దారిలో నడిస్తే అది సామాన్యం...మరో విన్నూతనంగా ప్రయత్నిద్దాం అర్పితగారు.

    ReplyDelete
  19. No Way
    Happy Mothers Day

    ReplyDelete
  20. Fantastic....change the route and run

    ReplyDelete
  21. అడిగితే చెప్పలేం
    దారి మళ్ళిపోతాం

    ReplyDelete
  22. ఏదో చేసి, ఎంతో సాధించాలన్న యావనబడి
    ఉదయం చంద్రుడు రాత్రి సూర్యుడు వచ్చెనని
    అసలు నన్నునే మరచి యంత్రం అయిపోయి
    నే కన్న కలలకు కవచం తొడిగి తిప్పుతున్నా..అందంగా రంగులు అద్దినట్లుంది

    ReplyDelete
  23. oooixviiiivxiiixivxxiiooo
    బ్రతుకనే పుస్తకాన్ని వ్రాస్తున్నామో.. చదువుతున్నామో.. ఆచరిస్తున్నామో తెలిసే లోగా ఆఖరు పుట మన చేతిని తాకుతుంది..!
    ఇదే జీవిత సారం.. బ్రతుకు పాఠం..!!
    oooixviiiivxiiixivxxiiooo

    ~శ్రీ~
    గరుడగమన శ్రీరమణ

    ReplyDelete
  24. అర్పితా... ఇలా అదరగోట్టేలా కవితలు రాస్తే విష్వక్సేనుడైనా తలవంచక తప్పదు...వెల్డన్!! డియర్...

    ReplyDelete
  25. తాత్వికతను వెదుక్కుంటూ జీవిత పరమార్థాన్ని గూర్చి ఆలోచించే ఒక మంచి కవిత. అధ్బుతం మేడం! చాన్నాళ్ళకు వచ్చాను. దయవుంచి మన్నించగలరు. మీ కవితలు మాత్రం మిస్సవలేదండి. ధన్యవాదాలతో... సలాం!!!

    ReplyDelete
  26. ఆమె కవితల స్పూర్తితో నేను కవితలు వ్రాయడం మొదలుపెట్టింది...
    http://padmarpitafans.blogspot.in/2016/05/blog-post.html

    ReplyDelete
  27. కలలైనా కమ్మగా కని ఆనందిద్దాం అంటే వినరుగాక వినరుగా మీరు :)

    ReplyDelete
  28. బులెట్స్ దాటికి దక్కని చిక్కలేని వేదనలు.

    ReplyDelete
  29. Art is a visual poetry, where each colour represents a distinct emotion.
    Art is Amazing, Realistic and Thought-provoking blend of colours that the eyes can capture and the mind can visualise.

    ReplyDelete
  30. Deep meaningful lines

    ReplyDelete
  31. అంతా భ్రాంతి

    ReplyDelete
  32. ఏదారి ఎటు బోతాందో ఎవరికేం ఎరుకలేదు తల్లో

    ReplyDelete
  33. ఆ దారి ఎటువైపో తెలియక చేస్తున్న ప్రయాణంలో ఎన్నెన్నో మలపులు జిమిక్కులు...అయినా మీకు తెలియని విద్యయా నీరజాక్షా :-)

    ReplyDelete
  34. ఏయే దారి ఎటువైపో ఎవరినీ అడుగక

    ReplyDelete
  35. జీవితమే గమ్యంలేని ప్రయాణం అని చెబుతూ దారి ఎటువైపు అని అడిగితే ఏం చెప్పేది ఎలా చెప్పేది. ఆలస్యంగా వచ్చి లేని పోని వ్యాఖ్యలు అని పుసుక్కుమంటే నేను బాధ్యురాలిని కాను కాలేను :-)

    ReplyDelete
    Replies
    1. ఊపిరి ఉన్నంత కాలం జీవించటమే మనం మనుషులుగా చేసే ప్రయాణం.. కాసింత మానవత్వపు అడుగులు వేస్తే ఏ కొందరి మదిలోనైనా చిరకాలం చిరజ్ఞాపకంగా మిగిలి ఉంటాం..

      ఉచ్వాస నిఃశ్వాసతో చేసే ఈ వింత పయనానికి గమ్యం చేరువైతే ఆత్మజ్యోతి కొండెక్కుతుంది.. మరో జన్మకై వేచి చుస్తది.. కాదంటారా ఆకాంక్షగారు.

      దేహం ఒకటి.. జీవాత్మ పరమాత్మ.. రెండు
      మనసా వచసా కర్మణ.. మూడు
      మంచితనం మానవత్వం ఔదార్యం ఔనత్యం.. నాలుగు
      నీరు నిప్పు గాలి ఆకాశం భూమి.. ఐదు

      ఈ ఐదు గుణాలను మిళితం చేసుకున్న ఎంతో పుణ్యం చేసుకుంటే గాని దక్కని మానవ జన్మ..!

      ఆలస్యంగానైనా ఆలోచనాత్మకంగా బాధ్యతాయుతంగా నాలుగు లైన్లలో మస్తుగా వివరణ ఇవ్వటం మీకు పరిపాటి.. నాకేం తెల్వద్.. మీ విచక్షణ ముందు మా వ్యాఖ్యలు ఎల్ ఈ డి ల్యాంప్ లేని హై మ్యాస్ట్ లైటింగ్ మాదిరి వెలవెలబోయాయి ఆకాంక్ష గారు..!

      Delete
    2. వామ్మో నిజంగా కామెంట్ లెంథ్ పెరిగింది.. ఎమనుకోమాకండి ఆకాంక్ష గారు

      Delete
  36. మరేం క్రొత్తగా వ్రాయడంలేదు..ఎందుకని?

    ReplyDelete
  37. _/\_ అందరి ఆదరణాభిమానాలకి పద్మార్పిత అభివందనములు _/\_

    ReplyDelete