తెలియనితనం



హృదయం ఉదాసీనంగా ఉన్నప్పుడు..
నా చుట్టూ నీవు ఉన్నట్లే తెలియలేదు

పెదవులు నిశ్శబ్దంగా మాట్లాడుతుంటే..
ఊపిరి కదలిక వేగమెంతో కనుగొనలేదు

కనులు కన్నులనే కవ్విస్తున్నప్పుడు..
చల్లగా శ్వాస కాగుతుందని అర్థంకాలేదు

కళ్ళ ముందు రూపాలు కదలాడుతుంటే..
నా మోము నిన్నే ధ్యానిస్తుంది అనుకోలేదు

అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు..
అమాయకంగా అడిగిన ప్రశ్నే గుర్తుకులేదు

ఒకరికొకరం వాగ్దానాలు చేసుకోలేదనుకుంటే..
మరెందుకని ఈ నిరీక్షణలో తెలియడంలేదు

శరీరం అలసి విశ్రాంతి చెందుతున్నప్పుడు..
మదిలో అలజడి ఎందుకో అర్థంకావడంలేదు!!

30 comments:

  1. ఎందుకంటే ఇది లవ్వు జివ్వు కాబట్టి... త్వరగా పెళ్లి చేసుకోండి... :)

    ReplyDelete
  2. బాగుంది యవ్వారం
    తెలియదని నేనంటే షూట్ చేయకండి

    ReplyDelete
  3. ఒక్కొక్కసారి మనసులో మెదిలే భావాలే మాటలుగా కాకుండా పదాలుగా కవితలుగా అలలారుతాయి పద్మగారు.. ఇలా తెలియదు తెలియలేదంటూనే అమాయకంగా మీ కవితలో నాయిక చాలా విశేషాలు విషయాలు తెలిపిన తీరు ప్రశంసనీయం..

    కొన్ని సార్లు మాటలకంటే కూడా పదాలే చాలా వరకు ఎన్నో చెబుతాయి..

    పదాలు భావాలు చక్కగా అమరినాయి పద్మగారు..

    ఇహ నే అందించిన రిప్లైల విషయానికొస్తే వారి వారి కామెంట్లకు తగ్గట్టుగానే సమాధానాలిచ్చాను.. సరదాగా.. :) థ్యాంక్యు పద్మగారు..


    ~శ్రీ~

    ReplyDelete
    Replies
    1. మీ జవాబులు బహుత్ ఖూబ్ జీ.sukriya

      Delete
    2. షుక్రియ సాహెబ్ పాషా జీ..

      Delete
  4. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు..అమాయకంగా అడిగిన ప్రశ్నే గుర్తుకులేదు,బహుశా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకున్నారో ఏమోనండి.

    ReplyDelete
  5. ప్రేమలో మొదటి మెట్టు మీద ఉన్నవాళ్ళు పలికినట్లు వ్రాస్తే ఎలాగ మీరు పద్మార్పిత. ఎంతో ఎత్తులో ప్రేమని ఉంచి అభిషేకించే మీ అక్షరాలు ఇలా చప్పబరచడం బాగుండలేదు.

    ReplyDelete
  6. ప్రేమంటే ఇదే ఇదే.

    ReplyDelete
  7. అన్ని తెలిసిన మీరు తెలియనితనం అని తప్పించుకోకండి.:)

    ReplyDelete
  8. మాదియా మీదా తెలియనితనం ఎవరిదో తెలుపండి.

    ReplyDelete

  9. ఒకరికొకరం వాగ్దానాలు చేసుకోలేదనుకుంటే..
    మరెందుకని ఈ నిరీక్షణలో తెలియడంలేదు

    శరీరం అలసి విశ్రాంతి చెందుతున్నప్పుడు..
    మదిలో అలజడి ఎందుకో అర్థంకావడంలేదు!! Nijame ardhamkavadamledu.. lovely..

    ReplyDelete

  10. ఒకరికొకరం వాగ్దానాలు చేసుకోలేదనుకుంటే..
    మరెందుకని ఈ నిరీక్షణలో తెలియడంలేదు

    శరీరం అలసి విశ్రాంతి చెందుతున్నప్పుడు..
    మదిలో అలజడి ఎందుకో అర్థంకావడంలేదు!! Nijame ardhamkavadamledu.. lovely..

    ReplyDelete
  11. అహా...
    హన్నన్నా
    అర్థం అవడంలేదా
    నిజమా...నటనా!

    ReplyDelete
  12. ఇటువైపు కుశలం
    అటువైపు కుశలమని ఆశిస్తూ
    ఒకప్పుడు తెలియదు అన్నవాడంత తెలివైన వాడు లేడు అనేవారు. ఈ కవితలో అదే అనుకోమంటావా అర్పిత-హరినాధ్

    ReplyDelete
  13. తెలీదు అనకుండా మరో మాట చెప్పండి.

    ReplyDelete
  14. పాపం మీ కవితా నాయిక ఎంత అమాయకురాలో ☺

    ReplyDelete
  15. హృదయం ఉదాసీనంగా ఉన్నప్పుడే అసలు గుర్తుకు వచ్చేది, మీరేమంటారు

    ReplyDelete
  16. నాకు నేను ఎవరో తెలుసుకోవడమే కష్టం ఇక ప్రేమ గురించి ఏం చెప్పను.

    ReplyDelete
  17. అలాగే మరి మీరు చెబితే కాదంటే బాగుండదు.

    ReplyDelete
  18. [01/06, 21:19] Sridhar Bukya: కదలాడే కాలమే కరిగి కమ్మని కలల కానుకై కనుల కొలనులో కనిపించేనా
    కేశవ కృష్ణ కాళిందివిహారా
    [01/06, 21:21] Sridhar Bukya: గడగడమంటు గర్జించే గగనానా గజ్జలు గాలిగమనానా గలగలమంటు గాజులు
    గజ్జలెవరివి గాజులెవరివి గోవిందా గరుడగమన...

    ~శ్రీ~

    ReplyDelete
  19. చిత్రము ఎందుకు నీరసంగా ఉందో, మీరు కవితని ఎందుకు తెలియదు అన్నారో అర్థమైతే కమెంటుతాను.

    ReplyDelete
  20. Vah...ye kya bholdiya aap..ha ha ha

    ReplyDelete
  21. తెలియదు అని చెబితే నమ్మేంత వెర్రివాళ్ళం అంటారా మరీను :-)

    ReplyDelete
  22. బాధల అంచుల్లో చిరునవ్వు పూయదా?
    రాలిన ఆకులైనా రేపటి వసంతానా చివురులు తొడగదా..??
    ఆశే ఆయువై పరిపూర్ణమవదా ఈ జీవితం..!
    దేవుడు లిఖించిన ఈ బ్రతుకు కావ్యం..!!

    ReplyDelete
  23. happy world environment day, we humans and all life-forms are a part of the environment, destructing the ecology will be equivalent to ruining ourselves. the onus lies on us to replenish the ecology and join the race to make the world a better place.

    ReplyDelete
  24. ఆలోచనలనేవి మనిషి మనసులో మెదిలే భావాలు
    కొన్ని సార్లు ఆలోచనలు ఆవేదనను రేకేతిస్తాయి
    మరి కొన్ని సార్లు ఆలోచనలే సాంత్వన చేకూర్చుతాయి
    ఆలోచనలు సున్నితమే సౌమ్యంగా తట్టేవే అలోచనలు

    ReplyDelete
  25. అందరికీ ధన్యవాదములు._/\_

    ReplyDelete