ముఖం చూపలేని భావాలు చూపిస్తున్న కళ్ళలో
ఆపేక్ష సాంద్రతేదో కొరవడి చెమ్మగిల్లిన నయనాలు
మసకెక్కి తడి దర్పణాలుగా మారి నర్తిస్తే తెలిసే..
అసంతృప్తి చెందితే ఆలోచన్లు సైతం అవశేషమేనని!
ముద్దగట్టిన తీపిగుర్తుల్ని విడదీయబోయే ప్రక్రియలో
కాలానికి వేలాడుతున్న వయసుని మభ్యపెట్టబోయి
డోలకమై ఊగిపోతూ ఒంటరి వర్ణంగా నిలిస్తే తెలిసే..
పాదరసమోలె పనికిరాని మెరుపు లోహద్రావణాన్నని!
మస్తిష్కానికి వేదనలు ముసురుగా పడితే శరీరంలో
నిస్సత్తువే రాజ్యం ఏలుతుంటే అడుగు వేయలేనన్న
జీవితం అటూ ఇటూ పొర్లుతూ నడవబోతే తెలిసే..
చావక బ్రతుకుతున్నవి చలనమున్న అవయవాలని!
మనసునైనా ద్రావణం చేయాలన్న ప్రయత్నంలో
కొన్ని ఆమ్లక్షార ద్రావణాలని గొంతులో పోసుకుని
తటస్థీకరణ స్థితిలో ఉన్నట్లుగా నటించబోతే తెలిసే..
నేనొక నిర్లిప్తతతో కూడి ఘనీభవించిన రాతిశిల్పాన్నని!
వేదనకి చిరునామా ఈ కవిత
ReplyDeleteచిత్రం భవ్యభావాన్ని తెల్పింది.
ఆర్ద్రత భావం కొట్టొచ్చినట్టుంది మీ కవితలో
ReplyDeleteనిరాశ నిర్వేదం అసహనం ఆంతరంగిక వ్యథలను
అంతే రీతిలో తెలియపరిచారు పద్మ గారు
సంతోషాన్ని మాత్రం ఘడియలుగా ఎంచి క్షణకాలమే ఆనందించి అనక ఆ సంగతే మరిచిపోతారు.. బాధనైతే మాత్రం ఎందుకు తాడులా చుట్టుకుని వేదనలో గడుపుతారు అని ప్రశ్నిస్తు ఉంది మీ కవితలో చిత్రం
ReplyDeleteఆమ్లాక్షరమును గోరెను
ఆమ్లత నతనికి జిలేబి ఆయువు పట్టున్
ఈ మ్లానమువలదు రమణి
ఆ మ్లిష్టము కానిది మరి ఆదరణగనౌ ?
వేదన కవితల్లోను సీరియల్లో చదవడానికి చూడ్డానికి బాగుంటుంది భరించడమే కష్టం.
ReplyDeleteరాతలకే పరిమితం కానివ్వండి వేదనలు
ReplyDeleteవ్యక్తిగత వ్యధలని అందంగా పలికించారు.
ReplyDeleteకుసలమా పద్మా...
ReplyDeleteనిరుపయోగం అంటూ ఏదీ లేదని ప్రత్యేకంగా పద్మార్పితకి చెప్పవలసిన అవసరం లేదనిపిస్తుంది.
మస్తిష్కానికి వేదనలు ముసురుగా పడితే శరీరంలో
ReplyDeleteనిస్సత్తువే రాజ్యం ఏలుతుంటే అడుగు వేయలేనన్న
జీవితం అటూ ఇటూ పొర్లుతూ నడవబోతే-ఇలాంటి ఆలోచనలు మీకే చెల్లు.
Heart breaking expressions.
ReplyDeleteరసాయనశాస్త్ర ప్రక్రియలో నీవు వెళ్ళబుచ్చిన ఫీలింగ్స్ మనసుని తాకి కుదురుగా ఉండక మెల్లగా మెలిపెట్టి మంటను పుట్టిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఎండలు తగ్గుతున్నాయి అనుకుంటే ఇదేమిటో ఇంతలా వ్రాసావు. చిత్రం భిన్నంగా మొత్తం భావాలని వ్యక్తపరుస్తున్నట్లు బాగుంది.
ReplyDeleteఆమ్లక్షార ద్రావణాలని గొంతులో పోసుకుని తటస్థీకరణ స్థితిలో ఉన్నట్లుగా నటించబోతే...చాలా వరకు జీవితంలో నటిస్తున్నవారే. చక్కటి కవితను చిత్రాన్ని అందించారు.
ReplyDeleteపద్మా...ఏమైంది?
ReplyDeleteచాన్నాళ్ళకు కవిత నిండా వ్యధను కురిపించినట్లు అనిపిస్తుంది
చిత్రం చాలా నచ్చింది
ఏమిటి మాడంగారు..
ReplyDeleteఒకోమారు అన్నీ ఉపయోగకరం అని
ఇక్కడ ఆలోచించడమే నిరుపయోగం అంటున్నారు
బొమ్మలోని ముద్దుగుమ్మ విచారంగా ఉంది.
అయ్యో కష్టమే ఇలాగైతే
ReplyDeleteHEART TOUCHING.
ReplyDeleteArpitagaru feel thoe touch chesinaru.
ReplyDeleteనా పరిస్థితి ప్రస్తుతం మీ కవితలానే ఉంది.
ReplyDeleteవేదనలని బహు చక్కగా వర్ణించారు.
ఇన్నేసి వ్యధలని భరించడం వాటి రసాయినిక చర్యలూ మనిషికి కష్టమే.
ReplyDeleteమీలో ఈ నిరాశావాదం ఏలనో
ReplyDeleteవామ్మో గిట్లైతే కష్టం
ReplyDeleteఉపయోగం ఉన్నా లేకపోయినా నవ్వుతూ గడిపేయడమే జీవితం.
ReplyDeleteపాదరసమోలె పనికిరాని మెరుపు లోహద్రావణాన్నని,,,మనసు కదిలించారు.
ReplyDeleteuseful poetry rasinaru.
ReplyDelete
ReplyDeleteఅందరి అభిమానానికీ ఆత్మీయవందనం _/\_
అద్భుతమైన పదసంపదతో భావాలను మేళవించి గొప్ప కవితతో మమ్మల్ని కట్టిపడేశారు.... అద్భుతం! మేడం.... సలాం...!!
ReplyDeleteardmnv_eight
ReplyDelete