మరువకు

వీడ్కోలు చెప్పి వెళుతూ నన్ను మరువకు
నవ్వుతూనో తిడుతూనో నన్ను తలచుకో
రాళ్ళపై రాయలేని పేరు గుండె పై రాసుకో  
వేడుకలందు మరచినా వేదనలో మరువకువిడిగా ప్రేమించే ఇద్దరం ఒకటని మరువకు
అలసిన వేళలో సేదతీరుస్తాను గుర్తుంచుకో
కునుకు తీస్తే కలకు రంగులేస్తాను చూసుకో
కానరాకుంటే నీ ఊపిరిలో దాగాను మరువకుప్రణయప్రయాణ బడలికలో నన్ను మరువకు
దారితప్పి గమ్యం మరిస్తే నన్నడిగి తెలుసుకో
తిరుగుతూ వేసారితే నా పేరొకసారి స్మరించుకో
వచ్చి నీ గుండెకు ప్రతిధ్వనినౌతాను మరువకు

48 comments:

 1. మరిపోతే పిస్తోల్తో కలుస్తారు అన్నట్లు ఉంది మాడం
  అహా హా హా హా

  ReplyDelete
  Replies
  1. రబ్బర్ బులెట్ ఐతే బాగుంటుంది.. సినిమ స్టైల్ లాగా.. ఏమంటారు పో..పో.. గారు.. డండం బులెట్ ఐతే డాం సుమి.. ఫోరెంసిక్ వారికి ఆచుకి అందదు.. సరదాగా కామెంట్ చేశాను అన్యథ భావించకండి

   Delete
 2. chalte chalte hey dost thakna math aur bhoolna jana

  ReplyDelete
  Replies
  1. चलते चलते गुमराह न हो जाना ऐ पंथी, काँटे है कहीं तो कहीं रेगिस्तान कही नदी है तो कहीं दलदल, चिडिया की चहक और फ़ूलों की महक कभी भूल न जाना।

   बस आपकी पंक्तियाँ अच्छी लगी तो यह मैने लिख दिया है सुरेश जी

   Delete
 3. మీరు ఇలా ముద్దు ముద్దుగా చెబితే మరువగలమా ☺

  ReplyDelete
  Replies
  1. కోపతాపాలను మరిచి అలకలను మరువకు
   బాధలను మరిచి సంతోషాన్ని మరువకు
   జీవితమే ఓ ప్రయాణం కాలమే వాహనం
   నిశ్చల నిర్ఝరిలా తీపి గురుతులను దాచుకో

   సుబ్బారావు సర్.. నిజమే కదా నేను చెప్పిన మాట..

   Delete
 4. Jahabhi rahein yaad karenge hum.

  ReplyDelete
  Replies
  1. पलभर में लम्हा और भी छोटा होता है पायल जी, मगर वह छोटा लम्हा ही सही उम्रभर याद रहता है।

   धन्यवाद

   Delete
 5. ప్రణయప్రయాణ బడలికలో నన్ను మరువకు, ఎంతో మంచి భావం మీ కవితల్లో దాగి ఉంటే మరువడం కష్టం పద్మగారు

  ReplyDelete
  Replies
  1. జీవితం అలుపెరుగని ప్రయాణం
   బాధలు ఇందులోనే సంతోషాలు ఇందులోనే
   రెప్పల అలికిడిలో ఒక్కోసారి లోకం ప్రస్ఫూటం
   ఒక్కోసారి లోకానికి అక్షువులకి మధ్య జలపాతం

   శుభాన్ అల్లాహ్ సాహేబ్ పాషా జి

   Delete
 6. మరువ తగునా
  తరమా చెప్పండి.

  ReplyDelete
  Replies
  1. కాలం అనే సంగ్రహాలయంలో ఎన్నో మధురమైన క్షణాలను భద్రపరుచుకోవటమే జీవితం.. కాదంటారా కల్కి గారు

   Delete
 7. ఆర్ద్రత నిండిన భావం..!
  యేతిని జాపా మన కాఁయి కేతారో కోని పద్మ గారు..!
  ఇలా మీ కవిత థీమ్ ను అలవర్చుకునేవారు ఈ కాలం లో కోటికి నలభై మంది ఉంటారు..!

  ReplyDelete
  Replies
  1. యేతిని జాపా తోన లక్తావనతో లక్మత్.. పణన్ బంచన్ ర జత్రా దాడ్ కేని భూలేర్ ఛేని.. కన్నాయి కన్నాయి కాంటోతి సదాయి కాంటేన కాడేవాసు.. సామ్ళోగ..!

   Delete
  2. పై వ్యాఖ్యాకు అర్థం:

   దీనికంటే మించి ఏమి రాయను.. కాని బ్రతికి ఉన్ననాళ్ళు ఎవరిని మరువ కూడదు.. అప్పుడప్పుడు ముళ్ళుతో కూడా ముళ్ళును తియ్యవచ్చు.. విన్నారా..!

   ~శ్రీ~

   Delete
 8. తలచి తలచి మరువడం అసాధ్యం.

  ReplyDelete
  Replies
  1. తలిచినపుడు మరుపే రాదు.. మరిచిపోవాలనే ధ్యాస లేనపుడు మరువడమనే మాటే మరిచిపోతారు.. ఆశ గారు

   Delete
 9. వీడ్కోలు చెప్పి వెళుతూ నన్ను మరువకు
  విడిగా ప్రేమించే ఇద్దరం ఒకటని మరువకు
  ప్రణయప్రయాణ బడలికలో నన్ను మరువకు
  రాయడం మరువకు మరువకు మరువకు

  ReplyDelete
  Replies
  1. హిమఝరుల తరంగిణిలా నిత్యం ప్రవహించే యామిని సెలయేటి గలగలలా స్మృతులన్ని నిత్యమై అలరారితే మహిగారు.. ఒకసారి ఊహించండి.. ఆ విజువల్ ట్రీట్ ను మరువగలరా మీరు..!

   Delete
 10. గుర్తు తెచ్చుకోవలసిన అవసరం లేదు.అసలు మరచిపోతే కదాండీ. మీ కవితలు మనసునిండుగా ఉంటాయి. చిత్రాలు మరింత అందాన్ని ఇస్తాయి

  ReplyDelete
  Replies
  1. కడలి కెరటం ఒడ్డును తాకడం మరిచిపోదు
   ప్రభాతమున భాస్కరుడు ఉదయించడం మరువడు
   పక్షం పాటు దాగుడుమూతలాడినా జాబిల్లి వెన్నెలను మరువదు
   ప్రకృతిలో భాగమైన మనషులం మనం మంచిని నలుగురితో పంచుకోవటం మరువకూడదు..కదా మధు సర్

   Delete
 11. వలచుట తెలిపిన మనసుని మరువడం ఎలాగో తెలియదు :-)

  ReplyDelete
  Replies
  1. మనసు అనేది అపుడపుడు ఎడారిలో ఇసుకతిన్నే అపుడపుడు సంద్రం ఒడ్డున నానిన రేణువు
   అందుకే బాధలను రేణువులా పరిగణించి ఒడ్డున కెరటాలను ఆనందాలుగా చిత్రించుకొవాలి ఔనా భైరవి గారు!

   Delete
 12. నేను మరువనుగాక మరువను మరువలేను.

  ReplyDelete
  Replies
  1. మరువనని మారుమాట మార్చక మీరా మాట మాట్లాడినపుడే మనసులో మననమై మిగిలుంటుంది మీరన్న మాట నందుగారు

   Delete
 13. Replies
  1. Some Moments of Life are to be remembered and recollected, it acts like the Best and Safe Medicine to the Heart and Mind.. Is it not Janardhan Sir

   Delete
 14. వెళ్ళిపోతున్నానంటూ మరువకు
  వంకలు వెతుక్కుంటూ కూర్చోకు
  అని చక్కగా చెప్పారు

  ReplyDelete
  Replies
  1. వెళ్ళాలని మనసుకి లేకుంటే కాలు కూడా కదలదు.. అలాగే మరిచిపోవాలని అనుకుంటే తప్పా ఏది మరిచిపోలేరు.. మనసులో అణువణువు జ్ఞాపకాలుంటే తలచిన వెంటనే గుర్తుకు వస్తాయి కదా నందినిగారు

   Delete
 15. పద్మ గారికి.. మరియు 27, 28 మే 2016 15:00:00 IST వరకు కామెంట్ చేసిన వారికి:

  పద్మగారి కవితల్లో భావాలకి కొదవ వుండదు అని చెప్పే కవిత ఇది..!
  ఎందుకో తెలియదు మీ కామెంట్లకి రిప్లైలు రాయలనిపించి రాశాను.. తప్పులేమైన ఉంటే మన్నించండి.. సరదాగా రాశాను..


  జై శ్రీమన్నారాయణ

  ReplyDelete
  Replies
  1. కమెంట్స్కి జవాబుల వరకూ సరిసరి, చివరిది ఎవరికోసం?
   మీరు పద్మార్పితగారు ఒకే గూటి పక్షులా లేక అభిమానమా?

   Delete
  2. మైత్రి గారు.. నమస్తే.. చివరిగా వేసిన కామెంట్ కి ఈ కవితకి ఎటువంటి సందర్భం లేనప్పటికి సరదాగా రాశాను.. కొంచం వాతావరణం తేలికపర్చటానికి..

   పద్మగారు నాకు బ్లాగ్ ముఖంగా మాత్రమే తెలుసునని గమనించగలరు.. ఎవరి మనసును ఉద్దెశ్యపూర్వకంగా గాయపర్చాలనే దురాలోచన నాకు ఎప్పుడు లేదు.. ఏదైన పొరపాటుగా అనిపిస్తే క్షమించండి..

   ~శ్రీ~
   గరుడగమన శ్రీరమణ

   Delete
  3. మీరు ఎంతో అభిమానంతో రిప్లైస్ ఇచ్చినందుకు ధన్యవాదములు.
   (మిగిలిన వారి ఆగ్రహానికి మీరే భాధ్యులు సుమా)Just Kidding Sridhargaru.

   Delete
 16. దారితప్పి గమ్యం మరిస్తే నన్నడిగి తెలుసుకో
  తిరుగుతూ వేసారితే నా పేరొకసారి స్మరించుకో
  మీ కవితలు చదవకపోతే జరిగే పరిణామాలని ఊహించి వ్రాసినట్లున్నారు తెలివిగా పద్మార్పితగారు.

  ReplyDelete
 17. ఈ మధ్య నీ రాతల్లో వైరాగ్యం ఎక్కువైంది అనుకునే లోపే మరో పిడుగు వలే మరచిపోకు మారిపోకు ఏంటో!? అర్థమైయ్యే లోపు లేచిపోదాం ఎగిరిపోదాం వంటి కవిత రాసి కవ్వించేయి :-)

  ReplyDelete
 18. బొమ్మ సూపర్
  మాటలు డూపర్
  మొత్తానికి సూపర్ డూపర్

  ReplyDelete
 19. గట్లనే ఇనుకుంటా

  ReplyDelete
 20. మరువకు మరువకు అంటూ మరింత బంధాన్ని బలపరచడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అయినా మీకు నేను చెప్పతగునా :)

  ReplyDelete
 21. మఖ్ఖీ కీ రోటీ ని , సరసోం కీ సాగ్ తో కలిపి , సూఖీ మిర్చీ , ప్యాస్ కా సలాడ్ నంజుకుంటూ తింటే అద్భుతం గా ఉంటుంది , జనాలు ఎగబడి తింటారు . అలాగని , ఉదయం బ్రేక్ ఫాస్టు , మధ్యాహ్నం లంచ్ , రాత్రి డిన్నర్ లోకీ అదే వండి వడ్డిస్తే ... విరేచనాలు అవుతాయేమో .. కొంచెం ఆలోచించండి .

  ReplyDelete
  Replies
  1. ఏదో తెలిసిన దాని గురించి రాసి
   వచ్చిన వంటవండుకుని తిననివ్వండి మహాప్రభో:-)

   Delete
 22. మరీ ఇంతలా
  మరచిపోయేంతలా
  చేసింది ఏముందని మరువడానికి :-)

  ReplyDelete
 23. మొత్తానికి అందరి మదిలో ఉండాలన్న కోరిక బాగుంది.

  ReplyDelete
 24. ఎప్పటి వలె అలరించారు కవితతో.

  ReplyDelete
 25. మిత్రులందరికీ అభివందనములు.
  రాసిన పదాలు చదివి ప్రోత్సాహం అందిస్తున్న వారికి సదా వందనములు.
  _/\_ _/\_

  ReplyDelete
 26. అయ్యో... నాక్కుడా చెప్పండి ... ధ్యనవాదాలు :( లేట్ కమ్మర్ అని మర్చిపోకండి అర్పితా

  ReplyDelete
 27. సున్నిత భావాలని చెప్పడంలో దిట్ట అనిపించింది ఈ కవిత, ఆశ్శీస్సులతో-హరినాధ్

  ReplyDelete