అలక అలిగి మటుమాయం అయిపోయె
నీవు నాతో లేవని నేను దూరం జరిగితే
ఎడబాటు ఎందుకో ఎర్రి ముఖమేసి ఎగిరె
నా చిన్నమాటల్లో లేని అర్థాలు నీవెతికితే
అర్థానికే నీ మనసు అర్థమవక ఆశ్చర్యపడె
నాలో దుఃఖాన్ని చూసిన నీ కళ్ళు నీరిడితే
దుఃఖానికే ఈర్ష్యపుట్టి ఎక్కడికో ఉడాయించె
నీ అహం నాలో దాగిన అహాన్ని రెచ్చగొడితే
దయకే తిక్కరేగి నీ నాలోని క్షమని తిట్టిపోసె
నా మౌనం చూసి నీవు మూతి ముడవబోతే
మౌనమే మంత్రమేదో వేసినట్లు మాట్లాడసాగె
నీవు జీవితానికి నిర్వచనం ఇదాని నన్నడిగితే
జీవితమే సందిగ్ధ సలపరమని చల్లగా జారుకునె
GOOD ANSWER
ReplyDeleteNO REPLY
Ha ha :-)
Deleteచాలా రోజులకి వ్రాశారు
ReplyDeleteవేసవి శెలవు తీసుకున్నారు
అడిగితే జవాబు ఇవ్వరు
మరీ జవాబు ఇవ్వను అని నిష్టూరమా :-)
Deleteజీవితాన్ని కెవ్వున అరిపించారు.
ReplyDeleteలేదండీ నేనే అరిచినట్లున్నాను :-)
Deleteజవాబు లేని జీవితానికి ఏం వ్రాయడం అని మైండ్ పిచ్చిదాయె ☺
ReplyDeleteమహీ పిచ్చి మాకు ఎక్కించారు మీ కమెంట్ తో
Deleteఅర్థమై అర్థం కానట్లుంది.
ReplyDeleteఇప్పుడు అర్థం విడమరచడం అవసరమా!?:-)
DeleteGoo picture with golden words.
ReplyDeletethank you ;-)
Deleteకామెంట్ కట్టబెట్టాలంటే కన్నీళ్ళే కరిగి కాగితమే కానరాక కదలిపోయే..?
ReplyDeleteసమాధానం సంధించబోతే సరిగాలేనని సక్కగా సెంటెన్స్ సైలెంటాయే..?
రవ్వంతైనా రిప్లై రాయబోతే రాతలకి రంగుల రామచిలుక* రుసరుసలాడే..?
*ప్రాసకోసం వాడవలసివచ్చింది పద్మ గారు..
~శ్రీ~
శేషశయన శేశగిరివాస
కన్నీళ్ళతో కమెంట్...అంత అవసరం ఉందంటారా :-)
Deleteనేను అలిగానని మీరు అలిగితే...ఇంతే సంగతులు అలమాకండి
ReplyDeleteమనలో మనకి అలకలు ఎందుకులెండి :-)
Deleteఅయ్యో మీరే తెలియదంటే ఎలాగండి పద్మగారు.
ReplyDeleteఅన్నీ నాకే తెలుసంటే బాగుండదేమో :-)
Deleteాగా చెప్పారు జీవితం గురించి
ReplyDeleteఏదో తెలిసింది మీ ముందు ఇలా :-)
Deleteబాగుంది కానీ ఎక్కడో అసంతృప్తి.
ReplyDeleteఅసంతృప్తి ఎక్కడో తెలీదు :-)
Deleteనా చిన్నమాటల్లో లేని అర్థాలు నీవెతికితే
ReplyDeleteఅర్థానికే నీ మనసు అర్థమవక ఆశ్చర్యపడె, ఎంతో చిక్కని అర్థం చెప్పారు
హమ్మయ్య...నచ్చిందా మీకు
Deleteఅర్థం కాని జీవితం అవసరం అంటారా మరి మీరు
ReplyDeleteఅలాగని ఏం చేయగలం చెప్పండి ;-)
Deleteనీ అహం నాలో దాగిన అహాన్ని రెచ్చగొట్టనేల అందరిలో ఉన్నది ✓
ReplyDeleteఆ అహాన్ని అణగార్చుకుంటే పోలే :-)
Deleteచిత్రం బాగుంది
ReplyDeleteకవిత అంతగా ననచ్చలేదు.
ఈసారి నచ్చేలా రాస్తానులెండి :-)
Deleteపద్మ అసలు ఏంటో ఈమధ్య ఏం అర్థం అవ్వడంలేదు.
ReplyDeleteసంధ్యగారూ లైఫ్ అర్థం కాలేదు అనకుండా నేనే అర్థంకాలేదు అంటే ఎలా చెప్పండి :-)
Deleteనాక్కూడా ఏమీ తెలియకుంది
ReplyDeleteఅంతా అయోమయం అంధకారం
ఏమిటో ఇంత భారం :-)
Deleteఇంత కఠోరంగా తెలియదు లేదు అని చెబితే తట్టుకోలేము.
ReplyDeleteకఠోరమా...అదేంటండి.
Deleteఏమి ప్రశ్నలో
ReplyDeleteఏం జవాబులో
చిత్రం సుందరం
నేను జవాబు లేదంటే మీరూ తెలియదంటూ సై అంటారా :-)
Delete