మట్టివాసనతో మనుషులు పులకరించేలా
వేడెక్కిన రాతి హృదయాలు చల్లబడేలా...
మేఘమా కనికరించి జల్లు కురిపించరాదా!
పల్లె పట్టణాలన్న భేధాలు మరచి దారిమళ్ళి
గుడిసెలోనా గోపురం పైనా వానజల్లులా వెళ్ళి
తడారిన నదీబావుల దాహం తీర్చు మళ్ళీ...
మబ్బులు మనుగడకే మిత్రులని తెలుపరాదా!
నృత్యం చేసేటి నెమలి రెక్కలే అలసిపోయె
కప్పలేమో బెక బెకమని సొమ్మసిల్లిపోయె
వానపాములే తడిలేక ఎండి పుల్లలాయె...
మెరుపులో మమకారాన్ని కుక్కి కురవరాదా!
పొలంలో ఎదురు చూసే రైతు నడుము విరిగి
నాగళ్ళు సమ్మె చేయగా ముళ్ళపొదలు పెరిగి
ఉరుములకి ఉలిక్కిపడే పడుచులేమో తరిగి...
మేఘాలు మొండివన్న నిందేల కురిసేయరాదా!
వర్షాన్ని ప్రేమగా పిలచినారు.
ReplyDeleteపిక్ నచ్చింది.
barish jaruur ayega..
ReplyDeleteబీటలు వారిన నేల నీకు కానరాకున్నదా వరుణ
ReplyDeleteచిటపట చినుకులు కురిపింపగా లేదా మా పై కరుణ
ఐతే అతివృష్టి లేదా అనావృష్టి కలగదా జాలి దయా
ఉరుములతో మెఱుపులతో వాననీటి మేఘాలతో రావయా
జోరు వర్షాలకు ఆషాఢం ఢాంఢామంటు ఢంక
చినుకులకై చూసే ప్రతి ప్రాణి ఆకాశం వంక
నైరుతి ఋతుపవనాలకు తగదు నత్త నడక
రోజు విడిచి రోజు మంచినీళ్ళు వచ్చేనిక
బారిష్ కా మౌసం ఆనే కో హై
మగర్ ఇత్ని దేరి క్యోఁ హై
భీగి జమీఁ తో బాదల్ ఖుష్ హో జాయే
బాదలోఁ కో దేఖ్ కర్ మాయూసి ఖో జాయే
గమనిక: ఇక్కడైతే మూడు రోజులనుండి (ఇంక్లుడింగ్ టుడే) ఎడతెరిపి లేకుండ వానలు కురుస్తు మశకాలను వృశ్చికలను బయిట ప్రపంచానికి పంపుతు హడల్ పుట్టిస్తున్నాయి పద్మ గారు..
బాగుంది మీ వాన కవిత.. మండుకాల బెకబెకతో మండుటెండ నుండి ఉపశమనం కలగాలని..!
~శ్రీ~
గోవర్ధనోద్ధార గోవింద
వ్రాయడం తరువాయె
ReplyDeleteకురవడం మెదలాయె
పర్యావరణ పంధాలో పద్యాన్ని పండించారు అందుకే ఇక్కడ వానలు. బొమ్మ వెరైటీగా ఉంది.
ReplyDeleteనృత్యం చేసేటి నెమలి రెక్కలే అలసిపోయె
ReplyDeleteకప్పలేమో బెక బెకమని సొమ్మసిల్లిపోయె
వానపాములే తడిలేక ఎండి పుల్లలాయె...పశుపక్షాదుల పై మమత
వానలు కురిసే తడిసేయి
ReplyDeleteBeautiful mausam in poetry
ReplyDeleteవాన వచ్చి ఆనందం వెల్లివిరిసినట్లుంది మీ కవితతో.
ReplyDeleteIt's already raining mam
ReplyDeleteమీ పాత వాటికి భిన్నంగా ఉంది కవిత.
ReplyDeleteఅయ్యో అయ్యో అయ్యయ్యో
ReplyDeleteమీకు వానలు పడ్డంలేదా
కుండపోత వర్షం ఇక్కడ..
వానని మీరు వలచి పిలిచినట్లున్నారు బాగుంది.
ReplyDeleteAgain dont write...rain rain go away.
ReplyDeleteఇంగ్లీసోల్ పోటో బెట్టుడెందుకు?:)
ReplyDeleteకురుస్తున్న వానలో తడుస్తున్నారా :)
ReplyDeleteఅందరికీ ధన్యవాదాలు _/\_
ReplyDelete