పైసలు లేనిదే ప్రేమ
ప్రేమాంటే పనికిరాదమ్మో
పైస పరిమళమంటని
పువ్వులీ వలపు సెగలమ్మో
ప్రేమ పువ్వై నేడు విచ్చుకుని...రేపు నీకు
వడిలి ఎండిన పుష్పంలా వికారం పుట్టించునమ్మో!
పైసలుంటే మనసుపడ్డది
కావాలంటే దక్కునమ్మో
ప్రేమికులు కాదని వాదించినా...కాలం నీకు
అనుభవం ఆలస్యంగా నేర్పించే పాఠం ఇదేనమ్మో!
పైసలు లేక పస్తులు
ఉండి నీవు ప్రేమించలేవమ్మో
ప్రేమ కడుపు నింపేను అనుకుంటే...అది నీలో
భ్రమకి పరాకాష్ట తెలుసుకో మనసుండి మతిలేనమ్మో!
పైసల్లో పరమాత్మ
వాటి వెనుకే ప్రేమ పరుగులమ్మో
ప్రేమ వెంట గుడ్డిగా పరుగులెడితే...చివరికి నీకు
అంటుకునేవి ధూళి అదీ కాదనుకుంటే వేదనలేనమ్మో!
ప్రేమ పువ్వై నేడు విచ్చుకుని...రేపు నీకు
వడిలి ఎండిన పుష్పంలా వికారం పుట్టించునమ్మో!
ప్రేమికులు కాదని వాదించినా...కాలం నీకు
అనుభవం ఆలస్యంగా నేర్పించే పాఠం ఇదేనమ్మో!
ప్రేమ కడుపు నింపేను అనుకుంటే...అది నీలో
భ్రమకి పరాకాష్ట తెలుసుకో మనసుండి మతిలేనమ్మో!
ప్రేమ వెంట గుడ్డిగా పరుగులెడితే...చివరికి నీకు
అంటుకునేవి ధూళి అదీ కాదనుకుంటే వేదనలేనమ్మో!
పైసల్ గిట్ల లేకబోతే మస్తు పరేశాని ఐతదని సక్కగా సెప్పినారు పద్మ గారు..
ReplyDeleteపైసల పరమాత్మ ఉంటది.. గదిభి ఉండాలా.. కుసింత ఆప్యాయత ఉండాలా..
పైసల్ లేనిదే లోకం ముందుకు సాగది
గట్లనే మనషుల నడుమ ఆప్యాయత సల్లంగుండాలే..
గివి రోండు మనషికి దిల్ దిమాగ్ అన్నట్టు..
ఔ.. ఈడ ఒక్క ఇషయం యాద్ మరవకూడదు..
పైసల్ జేబుల ఉండాల.. దిమాగ్ ల కాది.. అని మస్తు గా కైతల సెప్పినారు..
ఏంటండి...భాషా శైలి మార్చి మరీ :-)
Deleteవరంగల్ బాగా గుర్తుకోస్తుంది పద్మ గారు.. అందుకే ఇలా తెలంగాణ యాసలో కామెంట్ చేశాను.. మీ కవిత సాంతం ఎప్పటిలానే ఆలోచనాత్మకంగా సహేతుకంగా ఉంది పద్మ గారు..
Delete~శ్రీ~
పిసా నరజుఁ కేని రేతాయేని (డబ్బులు లేకుండా ఎవరు ఉండలేరు).. పిసా సదాయి రేణు అన్ దలేమా హర్దే సదాయి సేన కర్ను (డబ్బులు కూడా ఉండాలి అలానే అందరికి మనసులో గుర్తుండాలి)..పిసాతీజ్ చాల్రీచ సారో దనియ (డబ్బుతోనే నడుస్తోంది మొత్తం లోకం).. చార్ మనక్యా మా భళన్ రేణు.. (నలుగురితో కలిసి మెలసి ఉండాలి) .. పిసా ఆవచ అన్ జావచ పణన్ మనక్యా హాటో ఆయేని.. (డబ్బులు వస్తాయి వెళ్తాయి కాని మనిషి తిరిగి రాలేడు) జేతి బంచన్ ర జత్రా దాడ్ హుఁష్యారితి రేణు.. (అందుకే బ్రతికి ఉన్నని రోజులు ఆనందంగా ఉండాలి)
Delete~శ్రీ~
భాష కూడా మార్చాను పద్మగారు.. ఈ ఒక్కసారికి మాత్రమే..
Deleteమీకు చాలా భాషల ప్రావీణ్యం ఉంది వాటితో నేను వాదులాడి గెలవలేనుగా :-) థ్యాంక్యూ.
Deleteజీవితం లో ప్రతి ఘడియ గెలుపు ఓటమిల నిఘంటువు
Deletelife: enriched file of incidents' library ⇐
←
Deleteవ్యాహ్ వాజీ..పైసా మే పరమాత్మా హా హా!
ReplyDeleteమై యహీ సమజ్ థీ హూ జీ
DeleteNo...
ReplyDeleteNot agreeing with you.
Its your wish...:-)
DeleteHalf true and half false.
ReplyDeleteMay be :-)
Deleteఇంతకీ మీరు పైసల్లో ప్యార్ ఉంటుంది
ReplyDeleteప్యార్ లో పైసలు ఉండవు అంటారా :-)
ఉంటుందో లేదో తెలియదు కానీ పైసలతో ప్యార్ ని కొనుక్కోవచ్చు అనుకుంటున్నాను...అది స్వచ్చమైనదా నకిలీదా అని అడక్కండి.
DeleteVery nice
ReplyDeleteexcellent picture.
thank you.
Deleteమనీ లేకుండా మొహబత్ లేదు మ్యారేజ్ నహీ మాడంజీ.
ReplyDeleteఅవును నిజమే ప్రస్తుతం డబ్బులు లేకపోతే ఏదీ లేదన్నదే నా భావం.
Deleteపైసల్లో పరమాత్మ వాటి వెనుకే ప్రేమ పరుగులమ్మో..ఇది నిజమమ్మో
ReplyDeleteనిజమని నాకు తెలిసిన లోకం తెలిపింది. అదే నేను మీతో పంచుకున్నది.
Deleteప్రేమ లేదు దోమా జాంతానహీ అంతా పైసా హై అంటావా.
ReplyDeleteప్రేమ దోమలకన్నా పైసలు ఉంటేనే ప్రపంచం అనుకుంటాను.
DeletePadma this is not correct. Being a lovely lady you cant write like this.
ReplyDeleteOfcourse you may be right on your way. This is my opinion Janardhanji.
Deletepyasallo pyaar hai correct
ReplyDelete:-)thanks for voting.
Deleteపద్మార్పితా ఎంతమాట
ReplyDeleteప్రేమకే అర్పితమైన మీరు
పైసలతో ప్రేమని పోల్చ తగునా.
నేను ఒప్పుకోను అంటే ఒప్పుకోను అంతే.
ఆకాంక గారు నేను వచ్చేశా
Deleteహల్లో....సతీష్గారు ఏమైనారు ఎటుల ఉన్నారు. సర్వం కుశలమేనా?????
Deleteఅంతా కుశలమే.... ఒక ముఖ్యమైన పని వల్ల... ఇన్నాళ్లూ కుదరలేదు
Deleteహ్యాపీ హ్యాపీ...నేను అప్పుడప్పుడూ డుమ్మాకొడుతున్నాను స్కూళ్ళకి శెలవులు కదా అందుకని :-)
Deleteఆకాంక్ష గారు.. మీ వ్యాఖ్యలకి సినిమాలు గుర్తుకొస్తున్నాయి.. వంశి గారి ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు లో పాపం పొట్టి ప్రసాద్ అలియాస్ కొండవలస లక్ష్మణ గారు పలికిన *నేనొప్పుకోను.. ఐతే ఓకే" గుర్తుకు వచ్చింది..
Deleteఆకాంక్షజీ...నేను రాసినదే ఒప్పు అని ఎలా అనమంటాను చెప్పండి. ఎవరి అభిప్రాయం వారిది కదా :-)
Deleteపద్మగారు అన్నదాంట్లో తప్పేముంది. నిజమే... నువ్వు లేకపోతే నేను బతకలేను.. ఇదీ ఈ రోజుల్లో సినిమాలకే సరిపోతుంది. పర్సు బరువుగా ఉన్న అబ్బాయిలనే ప్రేమ ఇస్తున్న (సారీ నటిస్తున్న) రోజులివి. అక్కడక్కడా నిజమైన ప్రేమలూ ఉన్నాయి లెండి. పిండి కొద్దీ రొట్టె...అలాగే పైసా కొద్దీ ప్రేమ. డబ్బు లేక పోతే పొసగడం లేదు.ఏం చేద్దాం. ట్రెండ్ మారింది. నేను బాగా చూసుకుంటాను అంటే కుదరదు.నిన్నూ రోజూ పారడైజ్‌కి లేదా మినిమమ్ ఐమాక్స్‌కి తీసుకెళ్తాను అంటేనే పడుతున్న రోజులివి.కాదంటారా ? చెప్పండి. అటు..ఇటు.. రెండు వైపులా ధన మిదం ప్రేమ. నాది ప్రేమ వివాహం...కాబట్టే ప్రేమలో మార్పులు నాకు బాగా తెలుస్తాయండోయ్.... పద్మగారు.. చించేసారు పొండి.
ReplyDeleteచించేసారు అంటే అర్ధం ఏమిటి ?
Deleteచాన్నాళ్ళకి సతీష్ కొత్తురిగారు.
Deleteసతీష్ గారు....ముందస్తూ మీ చాన్నాళ్ళ విసిట్ కి వందనము. మీరు మీ సొంత ప్రాజెక్ట్ విషయంలో బిజీగా ఉండి కూడా ఇలా మీ రాక మాకు బహు అనందదాయకము.
Deleteఏది రైట్ ఏది రాంగో తెలియదు కానీ నాకు కనబడిన/వినపడిన ప్రేమలు మాత్రం కమర్షియల్. Once again thanks for sparing your time in my blog.
పరమాత్ముడిని దర్శించాలంటే పైసా కావాలి కానీ ప్రేమించాలంటే మాత్రం ధ్యానించాలి. ప్రేమించి పెళ్ళిచేసుకున్నాం అంటారు కానీ దర్శించి పెళ్ళిచేసుకున్నాం అని ఎవరూ అనరు. ఆకర్షించుకుని పెళ్ళిచేసుకోవడానికీ ప్రేమించి పెళ్ళిచేసుకోవడానికీ చాలా తేడా ఉంది. ఒక్కసారిగా ఎలా ప్రేమించేస్తారు అని నాకనిపిస్తుంది.మాది పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా ఇంకా ప్రేమించుకోలేదు. ఒకరినొకరం ఆకర్షించుకుంటూనే ఉన్నాం. నా అభిప్రాయం ప్రకారం వివాహంలో పైసా ఉంటుంది(ఉండాలి) కానీ ప్రేమ ఉండే అవకాశం లేదు. ప్రేమ అంటే ఒక నిర్వచనమే దొరకనపుడు ప్రేమ ఉంది అని ఎలా చెప్పగలుగుతాము.
ReplyDeleteమీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక నిజం చెబుతాను నీహారిక కృష్ణమూర్తిగారు.. విలక్షణంగా ధనం చూడని ప్రేమ ఉంది అది అమ్మ వాత్సల్యత.. కాదనగలరా ఎవరైనా..
Deleteమొదటి సారి కామెంట్ పెట్టాను.. మరోలా భావించకండి..!
అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ గురించి టాపిక్ కాదండీ...ధనం ఉంటేనే ప్రేమ అని పద్మగారన్నారు. ప్రేమ అంటే ఏమిటి అని నేనడుగుతున్నా !
Deleteవంశవృక్షం సినిమాలో సోమయాజులు కోడలితో ...నదికి నువ్వు చెంబు తీసుకెళితే చెంబుడు నీళ్ళే వస్తాయి అని అంటారు.ఆ డైలాగ్ ఆ ఎపిసోడ్ నాకు బాగా గుర్తుండిపోయింది. మనం ఇతరులకు ఏమిచ్చామో అదే మనకు తప్పకుండా తిరిగివస్తుంది. డబ్బు కావాలంటే డబ్బు ఇవ్వాలి,ప్రేమ కావాలంటే ప్రేమ ఇవ్వాలి.డబ్బు ఇచ్చాను కదా ప్రేమ ఇవ్వు అంటే కుదరదు.
Deleteధనంతో కొనలేని వాటిలో ప్రేమ కూడా ఉంటుందనేది నా ప్రగాఢ విశ్వాసం.. ఎందుకంటే దనం తో కొన్నవి వస్తువుల కిందికి వస్తాయి.. ప్రేమ అనేది వస్తువు కానే కాదు.. అంచేత దేని విలువ దానికీ ఉందని అంటాన్నేను..
Deleteఇహ మీ రెండో కామెంట్ కి:
మీరు చెప్పింది అక్షరాలా నిజం నీహారిక మ్యాడమ్..
జీవితమంటే ఇచ్చి పుచ్చుకోవటమే.. మంచిని పంచితే మంచి.. చెడుని పంచితే చెడు.. మంచి చెడుల నడుమ మనిషి మానవత్వాన్ని ఔనత్యాన్ని మరువకూడదు.
ఒక్కొక్కసారి నా కమెంట్ కి పొంతన కుదరక పొవచ్చు అలా మీకు అనిపిస్తే మన్నించండి..
థ్యాంక్యు మ్యాడమ్..
పై పెచ్చు ఎవరి అభిప్రాయం వారిది..
Deleteనీహారికగారు...మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చాలా చక్కగా చెప్పారు.
Deleteమీరే అన్నారు పరమాత్ముని దర్శించాలంటే పైసా కావాలని, ప్రేమించాలంటే దర్శించక తప్పదు అని నేను అనుకుంటాను. ప్రాణం పోతే పిండం పెట్టాలన్నా పీనుగు లేవాలన్నా పైసలే కావల్సినప్పుడు ప్రేమించుకోవడానికి పైసలు అక్కర్లేదని ఏవిధంగా అనుకోమంటారు చెప్పండి. ఇక ప్రేమకి నిర్వచనం చెప్పాలంటే దానిపై నిర్ధిష్టమైన అభిప్రాయం అనుభవం కావాలి/రావాలి అవి నాకు లేవు.
ఇక పైసల గురించి అంటారా రోజూ పద్మార్పిత ఏంటి పబ్లిక్ మొత్తం పైసల గురించే పని/ప్రాకులాట కూడాను. ఆ పైసలతో అన్నీ కొనుక్కున్నట్లే ప్రేమని కూడా కొనుక్కోవచ్చునని లోకాన్ని చూసి తెలుసుకున్నాను. కొనుక్కున్న ప్రేమ అస్లీదో నక్లీదో తెలియదు/ చెప్పలేను(ఆకలి వేసినప్పుడు తినడానికి ఉంటే చాలు అనుకుంటాము అంతేకాని పంచబక్ష పరమాన్నాలు కావాలని కోరుకోము అలాగే కొనుక్కున్న ప్రేమ నిజమో కాదో కావాలి అనుకున్నప్పుడు దొరుకుతుంది కదా పైసలతో అని నా భావం.
నేను రాసేవి కేవలం నా భావాలు, తప్పులో ఒప్పులో మీ అందరితో పంచుకుంటున్న నేను ధన్యురాలిని. పొరపాట్లు ఉంటే మన్నించండి._/\_
ఎవరికి వారినే నిర్ణయించుకోమని చెబుతున్నారు తెలివిగా.
Delete
ReplyDeleteదర్శన ప్రేమల మేలౌ
స్పర్శల భేదము జిలేబి చక్కగ జెప్పెన్
హర్షాతిరేక మయ్యెను
ఘర్షణ జేసెడి లలామ గడుసరి సుమ్మీ!
చీర్స్
జిలేబి
తినగ తినగ తీయ్యగుండున్..
Deleteఅతిగా తిన్నా అజీర్తిమగున్..
ఎచ్చోట తిన్నా జిగట పాకమగున్..
జిలేబి రసగుల్ల రసమలై గులాబ్ జామూన్..
క్షమాపణలతో
ఎవరి మనసును బాధ పెట్టే మనస్తత్వం కాదు నాది. అపుడపుడు సరదాగా వ్యాఖ్యానిస్తాను.. ఎమనుకోకండి..
Deleteమీ నామమే కాదు
Deleteమీరు రాసెడి నాలుగక్షరాలు
మీలాగే స్వీటు స్వీటుగుండు
థ్యాంక్యూ జిలేబీజీ....
ఆస్తులు ఉన్నాయో లేవో చూసి ఆకర్షించబడ్డమే నేటితరం ప్రేమతత్వం అని చెప్పింట్లు గోచరిస్తుంది నువ్వు వ్రాసింది చదివితే. అయినా ప్రేమకి నిర్వచనం ఇదంటూ ఇప్పటీ ఎవ్వరూ సరైనరీతిలో చెప్పలేదు.
ReplyDeleteనాకు తెలిసీ ప్రేమ ఒక్కటే కాదు ప్రస్తుతం పైసలే అందరికీ ప్రాణం అదే అదే కావాలి అందరికీ-హరినాథ్.
మీరు అనుభవజ్ఞులు
Deleteమీ మాటలు వాస్తవం...ధన్యవాదాలు.
సగం వాస్తవం మిగిలింది స్వవిషయం.
ReplyDeleteఎవరి అభిప్రాయం వారిది అంటారా
DeleteNo Padma...
ReplyDeleteYours is wrong statement.
wrong or right its my opinion jee :-)
Deleteచిత్రంలో అక్షరాల్లో ఏదో కొరవడినట్లు అనిపిస్తుంది.
ReplyDelete"ఆనందం" కొరవడిందని అనుకుంటున్నా సుబ్బారావు సర్.. డబ్బుతో వస్తువులను మాత్రమే కొనగలం.. మనషులు సైతం కుళ్ళు కుతంత్రానికి ఎదురు చెప్పలేక మౌనముద్ర దాల్చుతున్న ఈ రోజుల్లో.. సంతోషమే గగనమాయే.. పలకరింపే మరిచిపోయే.. !
Deleteపరిపూర్ణంగా అన్నీ అందరి వలనా కానప్పుడు అర్పిత మాత్రం ఎలా చేయగలదు చెప్పండి :-)
Deleteడబ్బు జబ్బు లేని ప్రేమ లేదంటారా....
ReplyDeleteపుష్కలంగా ఉంది విష్వక్సేన వినోద్ గారు..
Deleteరాధాకృష్ణుల నడుమ ఉన్న ప్రేమ అద్వితీయం..
ఏ మందిరమైన రాధ చెంతన కృష్ణుడు లేకుండా గానీ రాధాకృష్ణ అనే పేరు వినబడకుండ ఉండదు.
పైకానికి మించిన ప్రేమ రాధాకృష్ణుల వారిది..
మనషుల్లో ఐతే అమ్మ వాత్సల్యత ముందు ఏది సాటి రాదు
~శ్రీ~
డబ్బు జబ్బు ప్రేమ ఏమో కానీ ప్రేమని పైసలుంటే పుష్కలంగా (pure or impure) కొనుక్కోవచ్చు అనుకుంటాను.
Deleteపద్మా అయితే పైసలు ఉన్నవాళ్ళు మాత్రమే ప్రేమకి అర్హులు అంతావా :)
ReplyDeleteఅలాగని కాదు కానీ పైసలు లేకుండా ప్రేమ మాత్రం పొట్ట నింపదు అంటానండి.:-)
DeleteIt is individual personal opinion n experience.
ReplyDeleteYes you are right.
Deleteఅందుకే నో ప్యార్..
ReplyDeleteపైసలు ఉంటే చాలు
అయితే ఎంజాయ్ :-)
Deleteఅన్నీ పైసలతో కొనుక్కోవచ్చు అనుకుంటాము కానీ అనుకున్నప్పుడు అవసరానికి అన్నీ దొరకవు.
ReplyDeleteఅన్నీ దొరకవు నిజమే
Deleteకావాలనుకున్న వాటిలో కొన్నైనా కొనుక్కోవచ్చునేమో.
అసలు ప్రేమకి నిర్వచనం తెలియని వారి చేతిలో పైసలు ఉన్నా గులకరాళ్ళు ఉన్నట్లే. అయినా మీరు ప్రేమని పైసలతో కొనగలమని వ్రాయడం వింతగా ఉందండి.
ReplyDeleteప్రేమ లేనివారు పిచ్చోళ్ళు అంటారా. వారిచేతిలో పైసలు ఉంటే గులకరాళ్ళ వలె విసిరేస్తారా... ఇది ఇంకో కోణం కామోసు :-) థ్యాంక్యూ.
Deleteపైసల్లేకుంటే ప్యార్ నహీ
ReplyDeleteపసందు పలుకులు సెప్పినావ్
మీలెక్కనే అనుకుంటున్నా :-)
Deleteఅప్పుడప్పుడూ ప్రేమ సర్వం అంటూ ఇప్పుడు పైసలు ఉంటే ప్రేమ అంటే ఎలా నేస్తం☺
ReplyDeleteఎప్పుడూ ఒకటే మాట అంటే నచ్చదని :-)
Deleteకొంచెం గందరగోళం
ReplyDeleteకొంచెం కంప్యూజ్..
వర్డ్స్ లోనా
Deleteలైఫ్ లోనా సర్ :-)
ప్రేమ ఎంత మధురం
ReplyDeleteమీ కవిత అంత కఠినం...ఊరికే ఉడికించాను
నన్ను ఆటపట్టించబోతున్నారా నెక్ట్స్? :-)
Deletetrues with humorous way.
ReplyDelete:-) thank you.
Deleteప్రేమ దోమా మనకెందుకు
ReplyDeleteఅవసరని తగిన పైసలు చాలు
మీరు వ్రాస్తూ ఉంటేనే మాకు చాలు.
ఇంత నిడారంబరమా నందినిగారు :-)
Delete