కాదు కూడదనే రాముడున్న కాలంలో...
కట్టుబట్టలు కూడా కొనివ్వక ఉండమంటే
ఉండను ఉండలేనని సీతంటే మాత్రం తప్పేంటి
రాయల్ ఫ్యామిలీ రావణుడే నచ్చెనని అంటే
బరితెగించిన ఆడది అంటూ తగని నిందలేంటి!
వేణుగానం విని మాధవా మోహించినానంటే
పదహారువేల అతిసుందర ప్రియసఖులలో...
ఆమె స్థానం ప్రేమలో తప్ప పైకంలో లేదంటే
నువ్వు కాకపోతే నీలాంటి వారు నలుగురని
తనని మెచ్చిన వారిని రాధ వెతుక్కుంటానంటే
మోహించిన మోసగత్తె అంటూ బిరుదు ఎందుకని!
వరించి వివాహమాడినోడి స్టైల్ చూసి సంబరమంటే
మీసాలగెడ్డాల మగతనమే చూపి మందుమత్తులో..
కొట్టింది కాక సవతిని వెంటపెట్టుకొచ్చే శివుడుంటే
చీకిచిరిగిన సంసారానికి అతుకులేసినా అతకదని
విడిపోయి వేరొకరితో వెళ్ళి కాపురం ఉంటాననంటే
వెలయాలిగా మారినావంటూ వెకిలి మాటలేంటి!?
కొంచం-అతిగా నే ఉంది :)
ReplyDeleteచీర్స్
జిలేబి
ఇంకా ఈరోజుల్లో రూల్స్ & రెస్టిక్షన్స్ ఎక్కడ??
ReplyDeleteఎవరి ఇష్టం వారిది. చిత్రం చూడ ముచ్చటగుంది.
ఎవరి దారి వారు చూసుకోవాలి అంటారా!?
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteమొట్టమొదటి సారి అర్దం కాలేదు పద్మ గారు..
ReplyDeleteజీవిత గమనమనేది మన చేతుల్లో ఉందనుకుంటాం
కాలం తో పాటు ప్రాణం సాగుతోందని అనుకుంటాం
కాలమే గోప్ప ఇందులో తప్పెంటి
కాలగర్భాన చేరిన వేళ చరిత్ర తారుమారవును
ఘడియలన్ని తెరచాటు చేరి జ్ఞాపకమై మిగులును
కాలం తో పాటు ప్రాణం సాగుతోందని అనుకుంటాం
కాలమే గోప్ప ఇందులో తప్పెంటి
నిన్నటి కాలం నేడు ఎందుకు లేదు
నిన్నటి నీతీ నేడు ఎందుకు చెల్లదు
మనషులమని నేడు మరిచిపోతే
కాలం తో పాటు ప్రాణం సాగుతోందని అనుకుంటాం
కాలమే గోప్ప ఇందులో తప్పెంటి
తరతరాలకు తెలియాల్సిన నిజాలన్ని
తరతమ భేదాలు దాటుతు
కడు జీవిత గమనానా తరాస పడితే
కాలం తో పాటు ప్రాణం సాగుతోందని అనుకుంటాం
కాలమే గోప్ప ఇందులో తప్పెంటి
పరిచయాలు పరాభవాలకు దారి తీయటం సులువా
కాలానికి ఎడబాటుకి మాత్రం పొంతన ఉండొచ్చునా
కలానికి సిరకి స్నేహం లేకుంటే కవితగా పదాలు మలచునా
మీ కవిత చదివాకా నాకు వ్యాఖ్యానం ఇదే తట్టింది
తప్పొప్పులుంటే మన్నింప ప్రార్థన
కాలం తో పాటు ప్రాణం సాగుతోందని అనుకుంటాం
కాలమే గోప్ప ఇందులో తప్పెంటి
First Stanza: Sri Rama Rama Raameti Rame Raame Manorame Sahasra Naama Tatulyam Raama Naama Varaanane
DeleteSecond Stanza: Raadha Ramana Vaasudeva Raadhika Manohara Brindaavana Vihaara Venugaanalolaa
Third Stanza: Shivam Shankaram Devam Paarvateesham Trinetram Vande Murahara Mahadeva
తప్పేంటి ఏంటి ఏంటి అంటే ఏం చెప్పమంటారు
ReplyDeleteఅలా అడిగారూ బావుంది.... అందుకే మీరు నాకు నచ్చేసారు.... అవును తప్పేంటి? చెప్మా...
ReplyDeleteరాయల్ ఫ్యామిలీ రావణుడే నచ్చెనని అంటే
ReplyDeleteబరితెగించిన ఆడది అంటూ తగని నిందలేంటి?
తప్పా తప్పున్నరనా.....చేస్తే గీస్తే మగాడు చేయాలి అంతే కానీ ఆడవాళ్ళు సహనానికి ప్రతిరూపమాయె
ReplyDeleteమరొక మార్గంలో పయనించడం కొత్త ఒరవడికి నాంది. ఒకరికొకరు అర్థమై కొనసాగితే సరేసరి లేకుంటే మొదటికే మోసం. చిత్రం అమోఘం
ReplyDeleteNew thoughts for new trend.
ReplyDeleteExcellent painting.
చీకిచిరిగిన సంసారానికి అతుకులేసినా అతకదని..ఇలాంటి సమస్యలు ఎదురైతే సర్దుకుపొమ్మని చెబుతారు పెద్దలు.
ReplyDeleteతప్పు అంటే ఊకుంటావా ఏంది? :)
ReplyDeleteఈసారి రాముడు, కృష్టుడు మరియు శివుడు మీ కలం చేతికి చిక్కినట్లున్నారు. తప్పో రైటో నిర్ణయం వారికే వదిలేస్తే సరి ;-)
ReplyDeleteతప్పేంటి అని నిలదీసి అడిగితే చెప్పలేం. కానీ తప్పొప్పులు మనం నిర్ణయించుకున్నవి.
ReplyDeleteమీలో అంతర్లీనంగా ఇది చేస్తే తప్పు అనుకోబట్టే మిమ్మల్ని మీరు
ప్రశ్నించుకుంటూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నట్లు తోస్తుంది. మనకి ఒప్పు
అనిపించింది ఎదుటివారికి తప్పుగా తోస్తుంది. అంత మాత్రానికి చేస్తే
ఏమౌతుంది, ఎందుకు చేయకూడదు అని ప్రశ్నించడం వలనభిన్నమైన జవాబులు
దొర్లుతాయి.
బహుశా నేటి లోకం తీరునుబట్టి మీ ఆలోచనలు పరుగెడుతున్నట్లు ఉంది. ఏదైనా
అవసరానికి అనుగుణంగా ఆచరించే పద్ధతులు మారిపోతుంటాయి. వాటి పర్యవసానం మంచో
చెడో అనుభవించవలసిందే.
ఆమె స్థానం ప్రేమలో తప్ప పైకంలో లేదంటే..డబ్బుతోటిదే లోకం అంటే తప్పే కదా మరి.
ReplyDelete@చిత్రం .....
ReplyDeleteఎవ్వతె వీవు భీతహరిణేక్షణ ! యొంటి చరించె , దింతయున్
లవ్వున జిక్కి ప్రేమ ప్రవరాఖ్యుని జేరు నిరీక్షణా ? లతల్
పువ్వులు చుట్టు ముట్టినవి , పోడుములున్ మనసూపిరాడనీ
వెవ్విధి నోర్తువో ? ప్రియుడికేడకొ జెంపయినట్లు దోచెటిన్ .
Venkat Rajaraogaaru meaning please
ReplyDeleteతప్పుగా అనుకోవద్దు.
Deleteతెలుగు పై మమకారం.
నమస్కారము
రాజారావుగారూ...అబ్బబ్బా ఎంత సౌమ్యంగా అడిగినారండి.
Deleteఇంతకీ ఎవరో తెలిసెనా ఆ భీతహరిణి కాదు చలాకీలేడీ :-)
ఏతీరుగ మమ్ము దయచూచెదరో పద్మార్పితగారు.
ReplyDeleteనేటితరం వారికి
ReplyDeleteతప్పేలేదుగా--
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది పాట హిట్టు
ReplyDeleteమీరు చెప్పిన మాటలు నూరుసాతం రైటు
తప్పులేదు ఒప్పుకాదు
ReplyDeleteమీరు చెప్పినాక తప్పు అయినా ఒప్పే అనక తప్పదు పద్మా
ReplyDeleteపద్మార్పితగారు తప్పో ఒప్పో మధ్యలో పాపం పురాణపురుషులు నలిగిపోతున్నారు. మీకు భలే బ్రహ్మాండమైన ఆలోచనలు వస్తాయి ఉండుండి.
ReplyDeleteMs Sandhya sorry for my intrusion. Ranganayakamma has scientifically explained in RamaayaNa vishavruksham novel all these..She is just using simple beautiful language and re-writing famous people like Chalam or JK or UGK or many more..basically...she is a copy cat. She never stands for argument. Because, there is no point here. Understanding any philosophy is not eazy. Each generation understands it accordingly with the society advancement of that society with time. So these understandings are very relative. But main essence of HUMANITY never changes in STORY LINE at any time in the Human History. Finally we all meet at only point that is HUMANITY. Evolution of ultimate humanity makes that society as HUMAN. Till then we will hear these kind of confused voices at every generation. I strongly feel that she needs some orientation. It is nothing but half knowledge. Even mine too for that matter. Thanks for your attention
Deleteకష్టమే ఇలాంటి క్లిష్టమైన వాటికి జవాబు చెప్పడం. అయినా మేము అంటే మాత్రం మీరు ఒప్పుకుంటారా ఏంటి?
ReplyDeleteLife's Simple Rules:
ReplyDelete1. Be Grateful to God,
2. Have Gratitude towards Parents,
3. Never Breach Trust, Be Faithful, True and Loyal to Friends
బాగాప్రశ్నించారు
ReplyDeleteతప్పన్నవారు ఎవరు
I DONT SAY IT IS WRONG. I NEVER ACCEPT IT TOO :) Point is SHE HALF KNOWLEDGE HALF TRUTH AND CONFUSED.
DeleteWhat you said it's right.
ReplyDeleteNice photo and narration.
వెలుగులు ప్రసరించే సూర్యుణ్ణి
ReplyDeleteదప్పిక తీర్చే నిర్ఝరిని
లోకాన్ని పరిచయం చేసే తల్లిదండ్రులను
సఖ్యతను సమకూర్చే స్నేహితులను మరువకూడదు
Intellectual write up Padmarpita garu..
ReplyDeleteWhat is Intellectual here uncle kcube :) Sorry not kidding
DeleteWhat is Intellectual here uncle kcube :) Sorry not kidding
Deleteఅతి ముఖ్యమైన పనుల్లో బిజీ అయిపోయి పద్మార్పిత గారి కవితలకు కాస్త దూరమయ్యాను కానీ.. ఆవిడ కవితలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నానండోయ్. ఆవిడలో నచ్చిన క్వాలిటీ ఏంటంట.. ఈ బోల్డ్‌నెస్. బోల్డ్‌నెస్ అనే మాటలో తప్పులు వెదకొద్దు ప్లీజ్. మన దౌర్భాగ్యం ఎంటంటే స్త్రీ స్వేచ్ఛదా తన అభిప్రాయాలు చెప్తే.. ముక్కున వేలేసుకోవడం. బట్ ఎందుకో నాకిష్టం. హాట్సాఫ్ పద్మ. ఈ కాలం సీతలు ఎలా ఉండాలో చెప్పినందుకు.నేను మరో నెలలో పూర్తి అందుబాటులోకి వస్తాను. ఏమనుకోకండి. మీ బ్లాగు చూడడం లేదనుకోవద్దు. మీ ప్రతీ పోస్టూ పరిశీలిస్తున్నా. ఒకదాన్ని మించి ఒకటి. ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్నా.. సాహిత్య పరంగా..ఉత్కృష్టమైనవి... నాకు బాగా పేరొచ్చేది. వివరాలు త్వరలోనే చెప్తాను.. బట్ మీ లాంటి సాహిత్య కాముకుల అక్షరామృతాన్ని ఎప్పటికీ వదులుకోనూ.. సూపర్బ్ కవిత.
ReplyDeleteనేను మీ దారిలో అప్పుడప్పుడూ మిసింగ్
Deleteమొత్తానికి మీరు అన్నీ చూస్తున్నారు
నేను ఒకేమారు అన్నీ చదువుతున్నాను
ఎంతైనా మనిద్దరం ఒకే బాటలో :-) :-)
తప్పు కానప్పుడు అడగడం ఎందుకని తప్పేంటని?
ReplyDeleteజాప్యం చేయక మరోటి రాయండి
ReplyDeleteఎంత కాదు కూడదన్నా.. ఆకులన్ని చెట్టుకు సొంతం కాలేవుగదా.. పచ్చగ ఉన్ననాళ్ళు మాత్రమే సేవ చేస్తాయవి.. వానకు తడిచి ఎండకు ఎండి నిస్సహాయంగా వేలాడితే అక్కున చేర్చుకోవటానికి భూమి మాత్రమే మిగులుతుంది చివరాఖరునా.. బహుశ జీవితం కూడా ఇంతేనేమో..
ReplyDeleteబంధం బంధమంటు ప్రాకులాడితే ఏ బంధము శాస్వతం కాదని.. భూమియే శాస్వతమని కడసారి కాటిలో కాష్టమే దుప్పటయ్యి కార్చిచ్చు నిలువెల్లా దహించగా గుప్పెడు బూడిదే కామోసు ఈ జీవితం కూడా.. హరే రామాచ్యుతగోవింద.. అమంగళం ప్రతిహతమౌగాకా..
పద్మ గారు.. అనాలోచితంగా కాస్త కటువుగా వ్యాఖ్యానించాను.. తప్పైతే క్షంతవ్యుణ్ణి
~శ్రీ~
గరుడగమన శ్రీరమణ
Fantastic dear friend.
ReplyDeleteతప్పేంటి? అని నా అలోచనలు నన్ను ప్రశ్నిస్తే
ReplyDeleteవాటికి మీ అమూల్యమైన సమయ కేటాయించి
చక్కటి భావస్పందన వ్యాఖ్యలను అందించిన
ఆత్మీయులు అందరికీ అభివందమనములు_/\_
...మీ పద్మార్పిత
మీ భావ వెల్లువలో ప్రశ్నలు దొర్లుతుండాలి, అవి పదికాలాల పాటు మీరు మాకు పంచాలి.
ReplyDeleteతప్పు ఒప్పులు నిర్ణయించడానికి
ReplyDeleteమీరెవరు నేను ఎవరు చెప్పండి!?
మీకు ఒప్పైనది నాకు తప్పు కావొచ్చు
అంతా పై వాడి చిత్తమూ కావొచ్చు :-)
పద్మ ప్రియగారు
ReplyDeleteమీకు అప్పుడూ చెప్పా ఇప్పుడూ మీరు ఎప్పుడూ కూడా వక్ర భాష్యం వక్ర సంభాషణ తప్ప నిజాయితీ చర్చకు దిగే సాహసం మీకు లేదు మీరు కేవలం ఒక అందమైన అక్షరాల వికార భావన తప్పా, నేర్చుకోడానికి నెర్పించడానికి అందని ఒక అహంకార అతిశయం. లోపాలు మాత్రమే మాట్లాడతారు తప్ప సుగుణాలు మాట్లాదే జాతి పేరు అసుర జాతి. అది ఎప్పుడూ ఉంది అన్ని కాలాలోను ఉంది. ఇప్పుడు మీరు గొప్పగా లేదా కొత్తగా చెప్పేది ఏదీ కూడా లేదు. మీ బలహీనతలు చాల గొప్పగా ఊహించుకుంటూ మీలాంటి వాళ్ళ పొందు కోరుకునే పాత్రలు ఆనాడూ ఉన్నాయి ఈనాడు ఉన్నాయి ఏనాడూ కూడా ఉంటాయి. కాబట్టి నవ్వుకుంటూ విజ్ఞానాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగి పోవడం తప్ప చెయ్యగలిగింది పొంద గలిగింది నాలాంటి వాళ్ళకు ఏమీ ఉండదు. కాక పొతే మానవత్వానికే ఏనాడయినా పెద్ద పీట మిగతా వికారాలకి కాదూ అనేది మీరు ఎంత తొందరగా గ్రహిస్తే అంత తొందరగా మీ సందేహాలు మీకు నివృత్తి అవుతాయి. అంతే !!