ఆవేదనో, ఆనందమో తెలియదు...
నీవు నా కనుల ముందుంటే.
విరహానికి విలువగానో, లేక...
కలయికకి కానుకయేమో తెలియదు!
***
బాధవంటి భారమేమో తెలియదు...
ఎదుటపడి చెప్పాలనుకుంటే.
బిడియమో మొహమాటమో, లేక...
అలుసైపోతానన్న భయమో తెలియదు!
***
మధురమో, మైకమో తెలియదు...
గుండె నిండిన అనుభూతి నీవుంటే.
ఈ వలపు వ్యధనో వగరో, లేక...
మత్తో, చిత్తైన మనసుకిదేం తెలియదు!
***
మరువలేకనో, నీకు నచ్చలేదో తెలియదు..
అసలు విషయం అడగాలనుకుంటే.
అవునంటావో కాదంటావో, లేక...
తెలీని భానిసత్వమే బాగుందో తెలియదు!
నీవు నా కనుల ముందుంటే.
విరహానికి విలువగానో, లేక...
కలయికకి కానుకయేమో తెలియదు!
***
బాధవంటి భారమేమో తెలియదు...
ఎదుటపడి చెప్పాలనుకుంటే.
బిడియమో మొహమాటమో, లేక...
అలుసైపోతానన్న భయమో తెలియదు!
***
మధురమో, మైకమో తెలియదు...
గుండె నిండిన అనుభూతి నీవుంటే.
ఈ వలపు వ్యధనో వగరో, లేక...
మత్తో, చిత్తైన మనసుకిదేం తెలియదు!
***
మరువలేకనో, నీకు నచ్చలేదో తెలియదు..
అసలు విషయం అడగాలనుకుంటే.
అవునంటావో కాదంటావో, లేక...
తెలీని భానిసత్వమే బాగుందో తెలియదు!
అయ్యో ఏం తెలియని అమాయకురాలు!
ReplyDeleteఅదే అర్థం చేసుకోరూ...
Delete2 innocence :)
ReplyDeleteYes...
DeleteKavita super.
ReplyDeletePainting inka bagundi.
thank you sir
Delete
ReplyDeleteతెలియదు విరహము కనులన
తెలియదు కలయిక బిడియము తెలియదు గదరా
తెలియదు మధురము మైకము
తెలియదు అనుభూతి నప్పు తెలియదు గదరా :)
చీర్స్
జిలేబి
నాకు తెలియదు
Deleteతెలియదు...తెలియదులే :-)
అంతే ప్రేమ మైకం మత్తులో ఏది ఏమిటో తెలియదు :-)
ReplyDeleteఅదేనండి నేను చెప్పింది
Deleteకలువ కన్నుల్లో భావాలన్ని ఒలిగాయి
ReplyDeleteఒలిగిన భావాలన్ని పదాలుగా ఒదిగాయి
ఒదిగిన పదాలన్ని కావ్యమాలికలయ్యాయి
పద్మ గారు.. కవితను మించి చిత్రం.. చిత్రాన్ని మించి కవిత అదరహో..
~శ్రీ~
శ్రీధర్ భూక్యా
మీ అందమైన వ్యాఖ్యలకి వందనాలన్నాయి _/\_
Deleteతెలియదు అంటూనే అన్నీ చెప్పేసారు
ReplyDeleteఇది ఖచ్చితంగా అదే. అంటే ప్రేమే
తెలిసి చెప్పినా
Deleteతెలియక చెప్పినా మీరు అదే అని ధృవపరిచారుగా :-)
ప్రేమలో పడితే అంతే మరి...
ReplyDeleteఏమిటో అస్సలు ఏం తెలియదు
తెలిసినా తెలియనట్లు నటిస్తుంది
ప్రేమలో ఇంత అనుభవమా :-)
Deleteమధురమో, మైకమో తెలియదు...మీ రసరమ్య కవితలు చదువుతుంటే
ReplyDelete:-) హుమ్మ్...ఇదేదో బాగుంది
Deleteమత్తులో చిత్తైన మనసుకు ఇదేం తెలియదు
ReplyDeleteచిత్రం బ్యూటిఫుల్
థ్యాంక్యూ
Deleteతెలియనితనమొకటి అన్నీ తెలుపుతున్న విడ్డూరం బహు పసందు
ReplyDeleteచాన్నాళ్ళకి మీ నుండి ప్రశంస కనువిందు...థ్యాంక్యూ
Deleteతెలీని భానిసత్వమే బాగుంది. Nice
ReplyDeletethank you Janardhangaru
Deleteప్రేమ మైకం అంతే
ReplyDeleteప్రేరణాత్మక మజిలి.. మైమరపులతో కంటతడి.. అంతరంగాలతో తేటతెల్లం.. ((అమ్ము.. మీరు చెప్పిన దానిని ఖండికలుగా విడగొట్టాను))
Deleteఅంతే అనుకుంటాను :-)
Deleteనా మనసు ఆహ్లాదంగా ఉన్నా, అల్లకల్లోలంగా ఉన్నా వస్తాయి కవితలు ఓక్కోసారి లుతవిక కూడాను.
ReplyDeleteకవిత: కనులకే వినిపించే తతంగం..
తవిక: తనువు వికసించే కవనరాగం..
కనబడదు భావం.. వినపడదు మాట.. తపన మాత్రం కవిత.. ప్రేరణాత్మక మహిమాన్వితమగునేమో కదిలే కాలానికి సాక్షిగా.. పదాల కూర్పులో జ్ఞాపకాల వీచిక.. సుస్వర సుమధుర కావ్య గుళిక..!
~శ్రీ~
మీరు ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండండి.
Deleteఅవునంటావో కాదంటావో, లేక...
ReplyDeleteతెలీని భానిసత్వమే బాగుందో ...
ఇదేదో బాగుందే మరీ ...
అదేదో చెప్పేశెయ్ మరి ...
"అవునంటావో కాదంటావో అనే సందేహం తో.. ఎలా చెప్పనమ్మ.." అనే హోళి లో ఉదయికిరణ్ పాటను.. "ఇదేదో బాగుందే చెలి..ఇదే ప్రేమనుకుంటే సరి" అనే మిర్చి లో ప్రభాస్ పాటతో మిక్స్ చేశారా ఎన్ ఎమ్ ఆర్ సర్.. మీ కామెంట్ కి ఆ పాటలు గుర్తుకోచ్చాయి.. సరదాగా వ్యాఖ్యానించాను.. తప్పనిపిస్తే మన్నికుణుమ్ సర్..
Deleteమీ సందేహం లో స(గ)o దేహం కరక్టే.
Deleteహోలీ పాట మీరు కలిపాక ...
ఇదింకా బాగుందే అనిపించింది.
అయ్యో! అంత మాటన్నారేంటి శ్రీధర్ గారు! ...
మీరన్నదాంట్లో సరదా తప్ప మరేముంది!?
నా పై వ్యాఖ్య కూడా సరదాతో కూడిందే కదా! ...
యు ఆర్ వెల్కమ్ సర్ ...
:)
వయసులో పెద్దవారు తమరు.. నా రాతలతో ఎవరి మనసు కలత చెందకూడదని అలా నేను అంటాను సర్.. థ్యాంక్యూ సర్.. మీ కవితలు చూస్తు ఉంటా అప్పుడప్పుడు.. ఆలోచనాత్మకంగా ఉంటాయి..
Deleteశ్రీరాధాగోవింద
~శ్రీ~
గరుడగమన శ్రీరమణ
కలత నిదురలో కనురెప్పల అలికిడులు వింటు
Deleteకరగని నిశిధిలో కాంతి కిరణమై వెలుగు ప్రసరిస్తు
కవిత పదాలలో ఓనమాలలో దాగిన భావమై నిలుస్తు
గాలివానను తనలో దాచిన ప్రకృతిలా మారిపోతు
కాలానికి కలానికి ఎదురు నిలుస్తు
ఒక్కొక్క బంధాన్ని కలువుకుంటు సెలయేటి జలపాతంగా నిలుస్తు
కరిగే కన్నీటి వెనక లోకాన్ని చూపించే కాంతినవుతు
నిలువున కాలుతునైనా పదుగురి కి వెలుగు చూపుతు
దివికి భువికి వారధిలా మానవత్వాన్ని చాటుతు కలకాలమిలా ప్రకృతిలో లీనమవుతు...
~శ్రీధర్ భూక్యా~
భేష్ భేష్...కానివ్వండి శ్రీధర్ భుక్యాగారు
Deleteగేయాలు కవితలు కమెంట్లు రాసేస్తున్నారా
ఔను మరి ఒక్కో పాలి ఘాట్ రోడ్ వస్తది.. నత్త నడకన పయనం.. మరో మారు యూ టర్న్ లు, హేయిర్ పిన్ బెండ్లు.. కొన్ని చోట్ల రోడ్ అండర్ రిపేర్ టేక్ డైవర్షన్ లు మరి కాస్త దూరానా న్యారో లేన్లు స్పీడ్ బ్రేకర్లు.. గోతులు గతుకులతో రహదారికి ఊడినా తోలు.. ఐనా తప్పదు కట్టాలి టోలు..
Deleteయేగారుమనుక లువాభా కరానకా లురాక్షఅ
తిప్పి ప్పితి పేజిలు ఇటుకటు యేటాకిటుఅ
రాసే ముందు సిర పాళి పెన్ను
బర్రా బర్రా రాతలకి విరిగేను వెన్ను
అది కతల్ కైతల్ పుస్తకం కాది ఎక్కాలు రాసేటి లెక్కల స్క్వేర్ రూల్ బుక్..
అక్షరాలవే భావాలను మార్చి కవితకు ఇవ్వదలిచాను మరి బ్రాండ్ న్యూ లుక్..
(పదప్రయోగం సరదాగా.. ఎవరి మనసు గాయపర్చటానికి కాదు)
మీరౌతే నాలుగు లైన్లతోనే అండపిండబ్రహ్మాండాల సారం తెలిపేస్తారు ఆకాంక్ష గారు.. ఏదో మా లులు (ఉడుత) భక్తిగా ఇలా..!
మీకేమండీ బ్రహ్మాండంగా రాస్తారు "బహుభాషా ప్రవీణులు" అయితిరి
Deleteధన్యులమ్ ఆకాంక్ష గారు
Delete_/\_
@nmrao bandigaru..చెప్పాలంటే భయమేస్తుంది.
DeleteJust kidding..thanks a lot for your comments sir.
మీకు తెలియక పోవడం ఏమిటి పద్మగారు.
ReplyDeleteఅన్నీ అందరికీ తెలియాలని లేదు కదా :-)
Deleteచిత్రంలోని భామ చూడ ముచ్చటగున్నది
ReplyDeleteమీ కవిత ఎప్పటివోలే మనసు దోచినది..
మీ కమెంట్ చదివి మనసు గెంతులేసింది. థ్యాంక్యూ
DeleteLovely mam
ReplyDeletethank you
Deleteమొత్తానికి తెలీయదు అంటూ తప్పించుకోవాలని పెద్ద ప్లాన్ వేసినట్లుంది ఈసారి మీ కవితా నాయిక పద్మగారు.
ReplyDeleteసంధ్యగారూ....మీరే ఇలా అంటే ఎలా చెప్పండి:-)
Deleteమీకే తెలియదు
ReplyDeleteనాకేం తెలుసు :)
same to same :-)
Deleteయాహూ...యురేకా
ReplyDeleteఅప్పుడెప్పుడో రాస్తే
ఇప్పుడు పోస్ట్ అయ్యింది
ఫ్యాస్ బ్లాగ్ లో నా పోస్ట్ :-)
హావగ.. ఆచోజ్..
Deleteనాకు తెలుగునే సరిగ్గా రాదు, ఇదేం అర్థమౌతుంది చెప్పండి.:-)
Deleteఆ పదాలకు అర్దం ఇదండి ఆకాంక్ష గారు..
Deleteహావగ: ఔనా
ఆచోజ్ : మంచిదేగా
మదిలో ఏవో అలజడులు
Deleteఅలజడులలో ఏవో ఆలోచనలు
ఆలోచనలతో కలం పట్టి
కాగితముపై సిరతో భావగీతికలు
ఆ భావాలు కాగితముపై సిరా చుక్కలై
తలో దిక్కుకి హడలిపోగా
ఆ కాగితానా నా మదిలొ మెదిలిన రూపమోకటి
రూపు దిద్దుకుంది.. కన్నులకే ఆశ్చర్యానందాలు
ఊహల్లో దాగిన ఆ సమ్మోహన రూపమిలా కాగితానా(?)
ఆలోచిస్తు అనాలోచితంగా తడబాటుకి సిరా ఒలిగి
నా షర్టంతా 'ఇంకోవర్ణ'మై 'ఇంకే'మి తోచక నిదురలో సర్రున జా(రి పోతిని)రు కుంటిని 'కల'త నిదురలో
సంఘర్షణను మరిచిపోవటానికే నా ఈ హాస్య తవిక
అభినందనలు ఆకాంక్షగారు
Deleteవలపు వసంతంలో అప్పుడప్పుడూ సందిగ్ధంతో దగ్ధమౌతున్న మనస్సు పడే ఆరాటాన్ని అక్షరాల్లో బంధిస్తే ఇంత అందంగా ఉంటుందా? అవునేమో! పద్మార్పిత, ప్రేమైక హృదయంతో కీ-బోర్డును స్పృశిస్తే బహుశా అందానికే అందం రాకమానదు అనుకుంటాను.
ReplyDeleteకవితలో, కల(ళ్ళ)ల్లో ఆరాధించే ప్రేమతత్వాలో తెలియదు కానీ హేమంతంలో పున్నమి వెన్నెల్ని పులుముకొని ప్రవహించే ప్రశాంత కెరటంలా ఎందరో హృదయాలను తాకే సుహృదాక్షరాలు మీ భావాలు. కవితతో పోటీపడే చిత్రం – చిత్రానికి వన్నెతెచ్చే కవిత.... నిజంగా అర్పిత అభిరుచులు అక్షరాలు మాహా మారీచులను సైతం మనిషిగా మారుస్తాయి అనడంలో వైచిత్ర్యం లేదు.
సలాం!! మేడం.....
మీరు చెప్పిన వాక్యాలకి తిరుగులేదు
Deleteబై ది బై....థ్యాంకులే థ్యాంకులు మీకు ఫ్యాన్స్ బ్లాగ్ గారు. ఆలస్యంగా అయినా అచ్చువేసారు
అభిమాని బ్లాగ్ గారు....ఇంతలా పొగిడితే ఉబ్బిపోతాను :-)thanks a lot.
Deleteవారే వాహ్
ReplyDeleteషూట్ చెయ్యలేదు ఈసారి ఎందుకో తెలియదు ;-)
Deleteతెలియడంకన్నా బానిసత్వమే బాగుంది
ReplyDeletethank you
DeletePadma very nice raa
ReplyDeleteThank you Sir ji
Deleteకోటి కోర్కెల పద్మాల కొలని లోని
ReplyDeleteనీళ్ళలో మునిగితివి మోకాళ్ళ దాక ,
మథురమో మైకమో యిది మనసుకేల
తెలియలేదమ్మ? పద్మాక్షి! తెలుపవమ్మ .
రాజారావుగారు మీరేమో ఇంతందంగా పద్యాలు వ్రాస్తే నేనేం తెలుపలేను రెండు చేతులు జోడించి నమస్కరించడం తప్ప. _/\_
Deleteఅరిటాకు చాటునా కదళి మొక్క మాటున
ReplyDeleteనడుస్తు ఉంటే నన్నేవరో పిలిచారు
వెనక తిరిగా ఎవరో బుర్రమీసాలోడు
నికాన్ డీ ఫాటి డి ఎసెల్లార్ కెమెరట్టుకు క్లిక్ మన్నాడు ఏవిటని అడిగేలోపు
ట్రైపాడ్ తో సహా పరుగెత్తాలని చూసి కాలు జారి
చేనులో దిగబడిపోయాడు కుండ బోర్లించిన గడ్డిబోమ్మలా
ఇంతకీ ఆ దిష్టిబొమ్మ ఎవరండీ :-)
Deleteతూచ్ తూచ్ అలాంటివి చెప్పకూడదు పద్మ గారు.. :)
Deleteహాహా.. బురదంతా కడగటానికి గంటన్నర పట్టింది.. డియస్యలార్ మట్టిముద్దయ్యింది.. ఇంకా డౌటా పద్మగారు.. :-) :-p
Deleteప్లాటు బాగుంది , భావం బాగుంది భాష బాగుంది ప్రకటన కూడా చాలా బాగుంది , మాయావి లేదా దొంగోడు అంటే మీ ఉక్రోషం చల్లారదు కాబోలు , ఏకంగా హంతకుడు అనేశారు , అయినా చాలా బాగుంది . కుడోస్
ReplyDeleteరిప్లై అక్కడే ఇచ్చానండి :-)
Deleteచదువుతుంటే...గుండె నిండిన అనుభూతిలో అస్సలు ఏం తెలియలేదు
ReplyDeleteఆస్వాధించండి మరి...థ్యాంక్యూ
Deleteనేను పైన పెట్టిన కామెంట్ మరిచా ... అన్న కవితకి సంబంధించినది , పొరబాటుగా ఇక్కడ పెట్టాను , అయితే అందులోని ప్రశంశ ఈ కవితకి మరింత ఎక్కువగా సరిపోతుంది , చంద్రుడి కైనా మచ్చ ఉంది , కానీ ఈ కవితకి అసలు మచ్చ అనేదే లేదు
ReplyDeleteమీరు మెప్పుతో...నా మోము మచ్చలేని చంద్రబింబమాయె :-) థ్యాంక్యూ
Deleteఆవేదనో,ఆనందమో తెలియదు
ReplyDeleteనీవు నా కనుల ముందుంటే.
ఎదుటపడి చెప్పాలనుకుంటే.
బిడియమో మొహమాటమో
అలుసైపోతానన్న భయమో తెలియదు
మహీ...పోయమా లేక ఫీలో తెలియదు :-)
Deleteఅధ్భుతహాః
ReplyDeleteథాంక్యూ
Deleteఇది లవ్వా జివ్వా?
ReplyDeleteఇంకా నయం కొవ్వా? అనలేదు
Deleteగిట్ల తెలియదని సెప్పి పరేషాన్ జేస్తవేంది పద్దమ్మో
ReplyDeleteఫోటో కిరాకుంది.
నన్ను మీరు చేస్తున్నది గదే...పరేషాన్
Deleteఆవేదనో, ఆనందమో, ఆవేశమో తెలియదు ఒకోసారి నీ కవితలు చదువుతుంటే-హరినాధ్
ReplyDeleteఅన్నీ కలగలిపిన భావాలండి_/\_
Deleteమరో మంచి కవిత
ReplyDeleteమాకు మాత్రం తెలుసా ఏంటి?
ReplyDelete