అచ్చతెలుగు వారు సైతం ఆంగ్లాక్షరాలని అందలం ఎక్కిస్తుంటే
అలిగిన 56 తెలుగు అక్షరాలు బోరుమనలేక గొల్లుమన్నాయి
అమ్మలాంటి కమ్మదనం ఉన్న అక్షరాలు మాటల్లో అన్నాయి..
ఆంగ్లములోని A B C D లకేం ఆడుతూ పాడుతూ పలికేస్తారు
అక్షరాభ్యాసం నాడు అచ్చులు దిద్దించడానికి ఆలోచిస్తున్నారు!
అ నుండి అం అః అచ్చుల్ని అని చూడు ఆప్యాయత అనిపించేను
క, ఖ, గ, ఘ కంఠస్తం పడితే ఉదరభాగపు కండరాలే కదలాడేను
చ, ఛ, జ, ఝ లని పలికితే ఛాతీ భాగమే కదిలి రొమ్ము విరిచేను
ట, ఠ, డ, ఢ లు ఉచ్ఛరించి చూడు స్వరపేటిక కదిలి ఆడిపాడేను
ప, ఫ, బ, భ లను పసందుగా పలికితే పెదాలు కలిసి తేనెలూరేను
తనువంతా తడిమేటి తెలుగులోని తీపి ఆంగ్లభాషకి ఏదీ అనడిగితే
ఆల్ఫాబెట్స్ అన్నీ ఏకమై తెలుగు అక్షరాల్ని ఆహా అని కీర్తించాయి!
అలిగిన 56 తెలుగు అక్షరాలు బోరుమనలేక గొల్లుమన్నాయి
అమ్మలాంటి కమ్మదనం ఉన్న అక్షరాలు మాటల్లో అన్నాయి..
ఆంగ్లములోని A B C D లకేం ఆడుతూ పాడుతూ పలికేస్తారు
అక్షరాభ్యాసం నాడు అచ్చులు దిద్దించడానికి ఆలోచిస్తున్నారు!
అ నుండి అం అః అచ్చుల్ని అని చూడు ఆప్యాయత అనిపించేను
క, ఖ, గ, ఘ కంఠస్తం పడితే ఉదరభాగపు కండరాలే కదలాడేను
చ, ఛ, జ, ఝ లని పలికితే ఛాతీ భాగమే కదిలి రొమ్ము విరిచేను
ట, ఠ, డ, ఢ లు ఉచ్ఛరించి చూడు స్వరపేటిక కదిలి ఆడిపాడేను
ప, ఫ, బ, భ లను పసందుగా పలికితే పెదాలు కలిసి తేనెలూరేను
తనువంతా తడిమేటి తెలుగులోని తీపి ఆంగ్లభాషకి ఏదీ అనడిగితే
ఆల్ఫాబెట్స్ అన్నీ ఏకమై తెలుగు అక్షరాల్ని ఆహా అని కీర్తించాయి!
అక్షరాల్లోనే కాదు చిత్రంలోను తెలుగుదనం ఉట్టిపడుతుంది.
ReplyDeleteభవ్యం మీ భాషాభిమానం.
Wonderfull lines regarding telugu language.
ReplyDeleteఅదిరిందమ్మో అర్పితా..అదిరింది:)
ReplyDeleteతెలుగు భాషలోని తీయదనం అధ్భుతంగా చెప్పారు
ReplyDeleteహతవిధి.. భాషా పయనం ఎటో మరెటో.. అక్షరాలన్ని శరాలై ఘాతమైనా తేనేలోలుకు తేలుగు వెలిగేను కదా..
ReplyDeleteపద్మగారు.. తెలుగులోనే రాసేస్తున్నాను లక్షణంగా.. ఇహా కోపోద్రికమై ఉట్టి ఎక్క వద్దని చెప్పండి కవితాక్షర ఇంగ్లీషావళికి..
అర్దం కాలేదు కదా.. మరో మారు చూడండి..
తెలవారటానికి కావాలి వెలుగు..
మరో ఆరు గంటలు మిగులు..
గంట గంటకి ఠంగ్ ఠంగ్ మని చప్పుడేలా..
కనుకే కునుకు తీస్తా ఇగా మస్తుగా..
కూణ్ కన్నా కుఁ రచకో కేని మాలమ్ ఛేని..
కసన్ కతో కూఁ చీ కేన్ బోలాయే వాళో కత్త ఛ
తెలుగు రాదంటే అక్షరాలు తూటాలుగా మారతాయేమో
ReplyDeleteఅసలు అర్థం కాదిది.. సరదాగా రాస్తున్నా.. పద్మగారికి క్షమాపణలతో..
ReplyDeleteఅక్ష రస్వ రలయ: అక్ష: కన్ను రస్వ: హ్రస్వ దీర్ఘాలలో ఒకటి రలయ: రాలేనా.. (గ్రావిటికి అట్రాక్ట్ అయ్యి కిందికి వచ్చేది.. (రావటం కుదరదా అని కాదు))
కన్నులనుండి తెలిసి తెలియనంత చినుకులు జారేనా..
శీర్షిక అసలు అర్థం: అక్షరం పలికే స్వరగతి లయగతుల తీరు తెన్ను
~శ్రీ~
భాషా కుణ్సి వతోయి సేమా ఏక్కజ్ తీరేర్ అర్దం ఆవచ.. అచ్చుల్ హల్లుల్.. హ్రస్వ దీర్ఘాల్ సే కత్రా రతోయి కవితా ఎర్ భావం కన్నాయి తేడా జాయేని..!
ReplyDeleteభాషా ఏదైనా అన్నిటిలో ఒకే రకంగా అర్దం వస్తుంది.. అచ్చులు హల్లులు.. హ్రస్వ దీర్ఘాలు ఎన్ని ఉన్నా కవిత యొక్క భావం తేడా అవ్వదు..!
Deleteఅదే కదా మన తెలుగు భాషలో ఉన్న మాధుర్యం
ReplyDeleteతెలుగు భాష పై నీకు ఉన్న అభిమానమే నీ చేత ఇన్ని అధ్భుతమైన కవితలు వ్రాయించి మాకు అహ్లాదాన్ని ఇచ్చింది. అభినందనలు అర్పిత-హరినాథ్
ReplyDeleteఅక్షరాలు ఉఛ్ఛరిస్తే తనువు కదలాడింది
ReplyDeleteమీ కవిత హృదయాన్ని తాకింది పద్మగారు
తియతీయని తెలుగుభాష
ReplyDeleteమన అందరి మాతృభాష
తెలుగు తల్లి అక్షర స్వర లయను వినిపించారు, అభినందనలు పద్మాజీ..
ReplyDeleteగళం విప్పిన అక్షరాలు
ReplyDeleteపద్మార్పిత కలం వెంట జాలువారిన తేనెపలుకులు
I too love telugu
ReplyDeleteతెలుగు భాష గురించి గొప్పగా చెప్పింది మీరే అప్పుడు ఇప్పుడు కూడా..
ReplyDeleteతేట తెలుగు
ReplyDeleteఅచ్చులు
ReplyDeleteహల్లులు
అందంగా ఉన్నాయి మీ రాతల్లో
ఆల్ఫాబెట్స్ అన్నీ ఏకమై తెలుగు అక్షరాల్ని ఆహా అని కీర్తించాయి..ఆహా ఆహా
ReplyDeleteతెలుగు వెలుగులన్నమాట..
ReplyDeleteతెలుగు భాష ఔన్నత్యాన్ని, అక్షరాల్ల్లోని వ్యాయామాన్ని చక్కగా వివరించిన కవిత... తెలుగు తల్లికి అక్షరానీరాజనం ... అద్భుతం! బొమ్మలో కూడా తెలుగుదనం ఉట్టిపడుతోంది.. సలాం! మేడం....
ReplyDelete
ReplyDeleteతనువును తడిమేటి తెలుగు
అనువుగ అమరగ జిలేబి ఆంగ్లము యేలన్
చనువుగ అ ఆ ఇ ఈలను
పుణికిన చెలువపు తెలుంగు పూచున్ గదవే :)
చీర్స్
జిలేబి
తెలుగు భాష అభిమానులకు, ఆరాధించే వారికీ, ఆశ్వాధకులకు అభివందనం._/\_
ReplyDeleteఅక్షరాప్యాయతలు అందించిన అందరికీ ధన్యవాదములు.
తెలుగు భాష తేనేలొలుకనే నానుడి లా..
Deleteఅచ్చులతో అచ్చంగా పదాలకు గుణింతాల్లా..
హల్లులలో దరిచేరే హంగుల్లా..
ఆరాధనైనా భాషాభిమానమే ఎల్లలు దాటే..
ఆస్వాదించే పలుకుల కన్నా భావం కలగలిపే కవితే మిన్నా..
మాటలు రాని వేళా పాటగా కూర్చని వేళా..
కథే కవితాయే.. కవితాక్షరి ఝరిలో..
అమ్మో అమ్మో తెలుగు అక్షరాలు అవయవాలు అన్నింటినీ ఊపితే మీ కవిత మా గుండెని కదిలించిందండోయ్..
ReplyDeleteనా పేరులోనే తెలుగు ఉందని గమనించారా మరి ;-)
ReplyDelete