నిద్ర దేహీ..

అడుక్కుంటున్నా..ఆరుగంటలు నిద్రను దానం చేస్తారా?
ఆశ్చర్యపోకండి..నిజంగానే నిద్రను దేహీఅని అడుగుతున్నా 
కుదిరితే ఆరుగంటలు లేదంటే కనీసం అరగంటైనా సరే..
అరగంటా గంటా అడుక్కుంటే కలిపి ఆరుగంటల పైనే కదా!    

అడగంది అమ్మైనా పెట్టదంటారని..అడుగుతున్నా ఇస్తారా?   
కళ్ళు ఎన్నిగంటలు మూసుకున్నా ఆలోచన్లని అణచుకున్నా
గతం వర్తమానంతో కలబడి భవిష్యత్తుతో బేరం కుదరక..  
శరీరం పక్కపై అటూఇటూ దొర్లి పొర్లినా నిద్రపట్టి చస్తే కదా! 

అప్పుడెప్పుడో హాయిగా నిద్రపోయా..మరోసారి నిద్రపోనిస్తారా?   
నిద్ర నావైపు కన్నెత్తి చూడకున్నా కౌగిలించుకోమని అంటున్నా  
మీ దగ్గర మిగిలిన చిన్నా చితకా నిద్రని కాస్త బిచ్చం వేస్తే..
మెదలక మదితలుపులు మూసి ఆదమరచి నిదురపోతా కదా! 

అందరూ నిద్ర ఆరోగ్యసూత్రమని చేప్పేవారే..అది ఇవ్వలేరా?
నిశిరాతిరితో రమించి అలసిపోయి వెన్నెల్లో వెల్లకిలా పడిఉన్నా   
రానని మారాం చేస్తున్న కునుకుని ఒప్పించి నాపైకి తోస్తే..
నా వ్యధలవేటుకు బలైన నిద్రతో సంభోగమే చేసి తరిస్తా కదా!

93 comments:

  1. Duty lo nidra?
    So beautiful Painting

    ReplyDelete
  2. నిద్ర లేమి ఎంత భారమో తెలిసినా ఇవ్వలేని దౌర్భాగ్యం. మీరు పైకెళ్ళి వేరెక్కడైనా ప్రయత్నించాలి.

    ReplyDelete
    Replies
    1. ఓహ్..మీరు కూడా నాలా నిద్రను దేహీ అని అడుక్కుంటారా?

      Delete
  3. మేము కూడా మీవలెనే నిద్ర కరువై కొట్టుకుంటున్నాము. మీకు గుప్పెడు భిక్ష దొరికినచో మాకు చిటికెడు విదిలించవలెనని విన్నపములు. హ హ హా

    ReplyDelete
    Replies
    1. అడుక్కునే వానికి బుడబుక్కలోడు తోడు అంటారు ఇదేనేమో:)

      Delete

  4. నిద్ర రా లేదా? జిలేబి పద్యాలను చదవండి :) ఠా అంటూ నిద్ర తన్నుకొచ్చేస్తుంది లవ్వాడుతూ :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి పద్యాలు చదువుతుంటే
      ఒళ్ళంతా జిల్లు జిల్లుమంటది..
      చదివేకొద్దీ మరింతగా చదవాలనిపిస్తది
      చదువుకుంటూపోతే అంతం ఎక్కడుంది
      ఇక నిద్రకు లవ్వుతో పనేముంది చెప్పండి!? :)

      Delete
  5. మీరిట్లా నిద్రతో సంభోగం చేసేస్తా అని భయపెడితే నిద్ర మాత్రం నిర్భయంగా రాత్రిళ్ళు సంచరించగలదా?!

    ReplyDelete
    Replies
    1. నిద్ర కూడా నాలా నిర్భయురాలే...
      నాలాగే అదీ తోడికోసం వెతుక్కుంటూ నా దరికి వస్తుందేమోనని ఆశ.

      Delete
  6. మాకు మాత్రం బెడ్ ఎక్కగానే నిద్రాదేవి తన్నుకొస్తుంది.

    ReplyDelete
    Replies
    1. మీరు యమలక్కీ అండీ

      Delete
  7. చాలా కాలం అయ్యింది మీ పంధా కవితలు వ్రాసి.ఆలొచనా విధానం మారినప్పటికీ చిత్రం బాగుంది సుమ్మ్\ఆ మంచి

    ReplyDelete
    Replies
    1. మనిషి ఎల్లకాలం ఒకేలా ఆలోచించడు కదండీ!

      Delete
  8. Nice beautiful Painting

    ReplyDelete
  9. ఎన్నో ఎన్నెన్నో నిదురలేని రాత్రులు గడిపిన వైనం ఈ ధేహీ అంటూ అర్ధించడం..అవునానండీ

    ReplyDelete
    Replies
    1. ఇది మరీ బాగుంది...ఏదైనా అనుభవిస్తేనే రాయగలం అంటారా?

      Delete
  10. కునుకుచేపలంటూ గతంలో వివిధ ఆంధ్రజ్యోతి సాహిత్యపేజీలో లబ్దప్రతిష్టులైన కవిగారి కవిత ..నిద్రపైనే వెలుగుచూసింది.

    మీ కవిత మాత్రం స్పష్టమైన భావస్ఫూర్తితో హృదయాలను వశీకృతంచేసుకుని ప్రశంసలను గెలుచుకుంది

    ReplyDelete
    Replies
    1. మీ పొగడ్త నాకు యమ స్పూర్తినిచ్చేసింది. థ్యాంక్యూ.

      Delete
  11. గతం వర్తమానంతో కలబడి భవిష్యత్తుతో బేరం కుదరక..అమోఘం.

    ReplyDelete
    Replies
    1. భవిష్యత్తుతో బేరం కుదిరితే భేష్...పండగే పండుగ

      Delete
  12. రానని మారాం చేస్తున్న కునుకుని ఒప్పించడం ఎవరి తరమూ కాదు.

    ReplyDelete
    Replies
    1. అది రానన్నదనే అడుక్కుంటున్నది ఎవరైనా ఉన్నవారు చెబితే వింటుందేమోనని :)

      Delete
  13. కునుకు రాని కన్నులు కలత చెంది కన్నీరవగా
    కనులా నీరే చెంపను తాకేవేళ ఆవిరవగా
    మదిలో మెదిలే భావాలన్ని లోలోపలే మౌనం దాల్చగా
    ఆలోచనలన్ని అగమ్యగోచరమై హడలిన మనసు ఏమారగా
    నిదుర మరచిన కన్నులు అలసిన వేళ అయోమయమేగా

    ~శ్రీ

    ReplyDelete
    Replies
    1. కలకలం
      జనారణ్యంలో మునుపెన్నడులేని కల్లోలం
      దగ్గు జలుబు జ్వరం
      కలిగేను ఏదో ఒక రోజు కనికరం
      శానిటైజర్ మ్యాస్క్ పరిశుభ్రత
      తగ్గించేను వ్యాది ప్రబలత
      ఆయురారోగ్యాలతో వర్దిల్లాలి అందరం
      భయం వలదు కలసికట్టుగా పోరాడితే ఆయుర్ధాయం

      #CoViD

      Delete
    2. Nidura Ledhu
      Kunuku Ledhu
      Manassanthi e Ledhu
      Kunukuleka Kallu Saitham Mantapoyenu
      CoViD Scare, CoViD based Famine Under making Scare*,
      Prapanchamantata Vyaapti Chendina Ee "Pitta Koncham Kootha Ghanam"
      kaastha
      Bediri Chella Cheduraina Maanavaalini Vadilellali Aayuraarogyaalatho
      *assumption only

      Delete
    3. నిదుర మరచిన కన్నులు అలసిన వేళ అయోమయమేగా...నిజమేగా!

      కలవరపడనేల
      కలతచెందనేల
      కలవకుండానే..
      ఎవరికివారే కర్ఫ్యూకి
      కట్టుబడి శుభ్రంగుంటే
      కరోనా రాదు చెంతకు
      చింత వలదు మనకు!

      **Andaroo baagundaali
      Andaroo baaguntaamu**

      Delete
  14. Nidralemi gurinchi lets discuss :)

    ReplyDelete
    Replies
    1. Why discussion??
      Beware of Corona
      And maintain distance :)

      Delete
  15. నిద్ర బిచ్చం వేసాను
    నిద్ర పొండి హాయిగా

    ReplyDelete
    Replies
    1. మీరొక్కరే కనికరించి కునుకునిచ్చారు.

      Delete
  16. నీలాల కన్నుల్లో మెలమెల్లగా .. నిదుర రావమ్మా రావే ..
    నిండార రావే ... నెలవంక చలువల్లు వెదజల్లగా ..
    నిదుర రావమ్మ రావే ... నెమ్మదిగా రావే ...

    ReplyDelete
    Replies
    1. జోలపాట ఎంత మధురమో
      నిదుర అంత కఠినం :) :)

      Delete
  17. ఆలోచనల్లో మునిగి తేలుతుంటే ఎంత కావాలనుకున్న నిద్ర పట్టదు.

    ReplyDelete
    Replies
    1. అందుకే ఆలోచించక హాయిగా నిదురపోవలె :)

      Delete
  18. nidranu melkolpina vidhanam bagundandi

    ReplyDelete
    Replies
    1. naaku niduranu prasadinchamante mealkolpadam eamiti :)

      Delete
  19. అడుక్కుంటే దొరికేది అయితే దేశంలో అడుక్కునేవాళ్ళే ఎక్కువ కనబడతారు పద్మార్పితా.

    ReplyDelete
    Replies
    1. అదే కదా ఇప్పుడు అడుక్కునే వాళ్ళే అధికమయ్యారని తెలిసింది. అందులో మీరూ నేనూ కూడా :)

      Delete
  20. వ్యధలవేటుకు బలైన నిద్రతో సంభోగమే చేసి...outstanding

    ReplyDelete
    Replies
    1. ఏమో...అలాగైనా నిద్ర వస్తుందని ఆశ.

      Delete
  21. నాయనా పద్మార్పితవారూ..ఇంకా నిద్రకోసం పోరాడుతున్నావా తల్లీ..
    నిదుర రాకపోవటం వలనమిగిలిన సమయాన్ని సద్వినియోగంచేసుకుని మీరుమాకో అమృతతుల్యమైన కవితనందిస్తారని ..నేనైతే ఎదురుచూస్తున్నా..
    ఎందుకంటే..బ్లాగుల్లో మంచి కవిత అంటే మీ కలం నుండి రావాల్సిందే..అంత..విశిష్టమైన కవితాభావంశైలి మీది..కరుణించండి.మీరు.స్త్రీలో పురుషులో నాకు అనవసరం..కానీ మంచి కవిత్వం మాత్రం మీ సత్త్వం!!

    ReplyDelete
    Replies
    1. అయ్యా మీరెవరూ..నిద్రపట్టక నా ఆలోచనలు పరిపరివిధముల ప్రయాణించగా..దాని పర్యవసానమేగా నా ఈ భావాలు వాటి అక్షర రూపాలు..
      మీ అందరి అభిమాన స్పందనలు నాకు ఎంతో ఉత్సాహం అదే నా తోడూ నీడా..మీరు చదువుతూ ఉండంది నేను రాసేస్తూ ఉంటాను...నన్ను అమ్మాయ్ అనండి చాలు...ఎందుకంటే నేను అచ్చంగా అమ్మాయినే అందునా పద్మార్పితను ధన్యవాదాలు.

      Delete
  22. నిద్రతో సంభోగం ఏమిటి నా తలకాయ?ప్రతి అడ్డగాడిదా శెభాష్ శెభాష్ అంటుంటే స్వయంతృప్తి పెరిగిపోయిందా ఏంటి!

    ReplyDelete
    Replies
    1. తలకాయని ఎందుకు పాపం మధ్యలోకి తెస్తారు..
      సంభోగం అంటే కేవలం సెక్స్ అనే ఎందుకు అనుకోవాలి? నిద్రపట్టాలేగాని దాన్ని అంతర్లీనంగా ఆలింగనం చేసుకుని హాయిగా నిదురపోతాను అంటున్నాను అనుకోవచ్చుగా..
      శభాష్ అన్నవాళ్ళని అడ్డగాడిదలు అంటే పాపం వాళ్ళు ఛీ అన్నవాళ్ళు ఛింపాజీ ముఖాలు అంటే బాగుండదు కదండీ!
      ఎవరి తృప్తి వారిది..అందరికీ అన్నీ నచ్చవుగా!

      Delete
    2. నిద్రంటూ పట్టాక ఇంక అంతర్లీనాలూ ఆలింగనాలూ అవసరమా?ఏదో ఒకటి రాసెయ్యాలి, ఏదో ఒకలా తప్పుల్ని సమర్ధించుకోవాలని కాకపోతే!

      Delete
  23. నిద్రనైనా కాకపోతిని

    ReplyDelete
    Replies
    1. మాటలు నేర్చారు!!

      Delete
    2. ఈయన (విష్వక్సేనుడు) సెటైర్ వేయడంలో దిట్ట..ఎందుకో ఆలస్యంగా వచ్చారు.

      Delete
    3. @ విష్వక్సేనుడు వినోద్ జీ..అబ్బా ఆశ దోస అప్పడం☺️

      @ సూర్యగారు..వినోద్గారికి మాటలు కొదవనా😀

      @ నీహారికగారూ..మీకు తెలియని విష్వక్సేనులవారా!!!😊

      Delete
  24. నిద్రించడం ఒక భోగం. నిద్ర పట్టడం ఒక యోగం. కునుకు పట్టక పోవడం ఒక రోగం.

    ReplyDelete
    Replies
    1. నిజమ...ఇది ఒక రోగమే

      Delete
  25. పడుకున్న వెంటనే నిద్ర బాగా రావాలంటే పుస్తక పఠనం బాగా సహకరిస్తుంది ట్రై చెయ్యండీ.

    ReplyDelete
    Replies
    1. పుస్తకం పట్టుకుంటే నిద్రపట్టేది స్కూల్లో సంగతి😂

      Delete
  26. ప్రపంచంలో అందరికంటే గొప్ప అదృష్టవంతుడు ఎవరంటే ఎక్కడ పడుకున్నా గాఢంగా నిద్రపోగలిగినవాడే. ఆధునిక యుగంలో నిద్ర కూడా బంగారమైపోయింది. నిదంక లేమితో బాధపడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. లేనివాడు యాచించినా భిక్ష వెయ్యలేడు.

    ReplyDelete
    Replies
    1. సింపుల్ గా నిజం చెప్పి చేతులెత్తేశారు.

      Delete
  27. మీ నిద్రకు మీరెవరో తెలియనట్టుంది
    అది మీతో ఆడుకుంటుంది
    మీకు నిద్ర శాపమైనట్టుంది
    అందుకే అది మిమ్ము చూసి నవ్వుతుంది
    మీరు ఇదే విధంగా అడుక్కుంటే
    మీ బ్రతుకు దుర్లభం అవుతుంది..

    ReplyDelete
    Replies
    1. అయ్యబాబోయ్ అలా శపించేస్తే ఎలాగండి.

      Delete
  28. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం..నిద్రించడానికి నాలుగు గంటల ముందు వ్యాయామం చేయడం వల్ల కూడా చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.

    ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు ఎన్నో అధ్యయనాల్లో తేలింది. అయితే చాలా మంది ఏదో కారణంతో నిద్ర రావడం లేదని భావిస్తుంటారుగానీ.. నిద్రలేమితో బాధపడుతున్నట్లుగా గుర్తించలేరు. ఎందుకంటే ఈ సమస్య ఒక్కో వ్యక్తిని బట్టి ఒక్కో రకంగా ఉంటుంది. కొందరిలో ఎంతగా ప్రయత్నించినా, ఎంతగా అలసిపోయినా సరిగా నిద్ర రాకపోవడం, మగత నిద్ర, పడుకున్నా కూడా మాటిమాటికీ లేవడం, శరీరం పూర్తిగా విశ్రాంత స్థితిలో ఉన్నా మెదడులో ఏవో ఆలోచనలు కొనసాగుతుండడం. నీది ఖచ్చితంగా అతిగా ఆలోచించడమే.

    ఏమీ ఆలోచించకపోతే అడుక్కోవలసిన అవసరం రాదు నిద్రను.

    ReplyDelete
    Replies
    1. గురువుగారూ.. మీరు ఇప్పుడు కూడా పాఠ్యాంశాన్ని భోధిస్తున్నట్లే ఉంది.

      Delete
  29. చాలా బాగారాస్తారు మీరు

    ReplyDelete
  30. శాస్వితంగా నిద్రపోయేలా ఉంది లోకం
    ఎటుచూసినా కరోనా వైరస్ ప్రజ్వలింపులే
    జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు

    ReplyDelete
    Replies
    1. అదో మనమో ఎవరో ఒకరు ఒడిపోవాలిగా..

      Delete
  31. మేము కూడా అడుక్కునే పరిస్థితి ఇప్పుడు కరోనా కలవర పెడుతుంటే నిద్ర కరువైంది.

    ReplyDelete
    Replies
    1. అందరూ అడుక్కుంటే ఎలాగండీ.

      Delete
  32. నిద్ర పట్టిన వారు అదృష్టవంతులు
    ఎందుకు పట్టలేదో తెలుసుకున్న వారు జ్ఞానులు.

    ReplyDelete
    Replies
    1. దురదృష్టవంతుల్లో ముందు
      జ్ఞానుల్లో చిట్టచివరా ఉన్నది నేనే

      Delete
  33. హైక్లాస్ యాచించడం అంటారు.

    ReplyDelete
  34. Sleepless nights are terrible dear.

    ReplyDelete
  35. ఎంతందంగా అడుక్కున్నారు

    ReplyDelete
    Replies
    1. అడుక్కోవడం కూడా ఒక కళ.

      Delete
  36. Excellent narration

    ReplyDelete