మనసు ముక్కలు

ముక్కలై మిగిలిన మనిద్దరమూ తక్కువేంకాదు
విరిగిన సూర్యకిరణంలో వేడీ తేమా లేకపోలేదు
అల్లిన మాలతోపాటు తెగినదారం పోగుమిగిలుంది
గోడపై రాస్తూ వర్షానికి కొట్టుకుపోతాయనుకోలేదు
వేరై బ్రతుకుతున్న ఇద్దరిలో ఇంకా ఆశచావలేదు!

ముక్కలు అయ్యింది మనసులే మనుషులంకాదు     
విరిగిన కలలని ప్రోగుచేసుకుని జీవించిక తప్పదు
సర్దుబాటు వాగ్దానాలతో కాలంగడపడమే మిగిలింది
హృదయానికి ఊపిరి ఉన్నంత వరకూ ఏదీ ఆగదు
విడివడిన గుండెలు కలవకపోతే ప్రేమకి అర్థమేలేదు!

ముక్కలకీ మనసుంది ఆలోచిస్తే మార్గందొరక్కపోదు
సమాధి చేరే వరకు సమయం ఉంది మించిపోలేదు
ఎప్పటికీ మనమొక్కటే అనే విత్తు మొక్కైమొలచింది
చెట్టు చిగురించి పువ్వులూ ఫలాలు ఇవ్వకమానదు
వేరైతేనేం ఆశాజీవులం బ్రతకడానికిదేం తక్కువకాదు!  

39 comments:

  1. చాలా రోజులకు చూస్తున్నాను మీ బ్లాగు. విడివడి ముక్కలైన ఇద్దరూ తక్కువేం కాదు. మీలో ఇంకా పట్టుసడలని ఆత్మవిశ్వాసం చూస్తున్నాను.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. https://loveguruv2020.blogspot.com/2020/05/blog-post.html

    మీ కవిత బాగా నచ్చి కాపీ చేశానండీ, మరేమీ అనుకోకండి !

    ReplyDelete
  4. వేదన: వేదిస్తుంది దహిస్తుంది నలగొడుతుంది
    అయినా..
    మనసు: మమతను సమతను సుస్వాగతమంటుంది
    బహుశ ఆ ముక్కలై మిగిలిన మనసుకు ద్వేషించటం తెలియదు కామోసు
    బహుశ ఆ తునా తునకలైన మదికి దెప్పి పొడవటం రాదు కామోసు
    తనలోని భావాలను యదెచ్ఛగా వెళ్ళబుచ్చే స్వేచ్ఛా ఉన్నా గాని
    మౌన దీక్షలో అవ్యక్తంగా ఆక్రోశిస్తుందేమో
    తనవారంటు కొట్టుకున్న గుండె తల్లడిల్లి తటపటాయిస్తు కొట్టు మిట్టాడుతుందేమో
    జాలి ఆర్ద్రత సానుభూతి కొరవాడిన చోట మనసే అద్దమై పెళుసుబారి శత సహస్ర ఖండాలై వీగి విరిగి మౌన ముద్ర దాల్చేనేమో

    ~శ్రీ

    ReplyDelete
    Replies
    1. ఎలా ఉన్నావు? మనసు మమతలు మదనపడ్డం ప్రతీఒక్కరి జీవితంలోను తప్పనిసరి. వాటినుండి బయటపడే ప్రయత్నం అది కూడా మంచికే అనే విధంగా ఆశతో బ్రతకాలి. ఆశీర్వాదములు శ్రీధర్-హరినాధ్

      Delete
    2. నేను బాగున్నాను సర్.. పద్మ గారి కవిత థీమ్ లో అదే పంథా లో వ్యాఖ్యానించాను సర్.. కోవిడ్ కలకలం తో అతలాకుతలం అవుతున్న జన సంద్రం తో కాస్తంత దిగాలుగా ఉంది. ఉన్న పళాన లాక్ డౌన్ ఎత్తివేస్తే ఆ వైరస్ ప్రభావం మొత్తం భారతావనిపై ఉండబోతోందని అంటున్నారు.. అదే లాక్ డౌన్ ను కొనసాగిస్తే జీవన శైలి, ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉందంటున్నారు.. లాక్ డౌన్ సడలిస్తే నిన్నటి గ్రీన్ కాస్త ఆరెంజ్ నుండి రెడ్ కు మారవచ్చు లేదా రెడ్ నుండి ఆరెంజ్ నుండి గ్రీన్ కూ మారవచ్చు..పైగా వైద్యులకు పోలిసు వ్యవస్థకు వెసులుబాటు ఉంటుంది. ఏదేమైనా చిన్న యంత్రంలో పెద్ద సామగ్రి ఇరుక్కుని ఆ యంత్రమే ఛిద్రమయ్యే వీలును ముందుగానే పసిగట్టి ఆ సామగ్రిని ఆ యంత్రానికి సరిపడ సరఫర చేస్తే అటు యంత్రానికీ ముప్పు ఉండదు, ఇటు సామగ్రి మనం అనుకున్న పరిమాణంతో మనకు దక్కుతుంది. అలానే మన ప్రభుత్వాలు, జనాలు కూడా ఆచితూచి అడుగులు వేస్తు దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలని అనుకుంటున్నాను. వీటన్నిటికంటే కోవిడ్ టీక తయారి జాప్యం లేకుండ తయారైతే ఇక ఏ ఇబ్బంది ఉండదు. వందే మాతరం.

      డిస్క్లైమర్: పైన తెలిపింది అభిప్రాయం మాత్రమే.సగటున సమాజంలో కోవిడ్ చూపుతున్న ప్రభావం వలన జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని సమాలోచనలో వచ్చిన సూచన మాత్రమే. ఇందువలన మంచిగాని చెడుగాని జరిగితే దానికి నేను బాధ్యుణ్ణి కాను. ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకుని వాటిని సక్రమంగా అమలు చేసే వీలు ఉంటుంది. అయా ప్రభుత్వాలు వాటి పరిధి మేరకు జనహితానికై సమగ్ర కృషితో ముందుకు సాగి కరోనా ను పూర్తిగా మట్టుబెట్టి మరల సస్య శ్యామల భారతావనిని చూడగలమనే ఆశాభావం.

      ~ధరణి

      Delete
    3. We welcome Partial CoViD Lockdown in India with ROG (Red-Orange-Green) Zones.
      We are against India becoming CoViD ROG (Hindi word for Illness) Zone

      #CoViD_Termination_Steps
      #Economy_Booster_Steps
      #Anticipating_CoronaFree_India_Very_Soon
      #StaySafe_StayHealthy
      #CoViDVaccine_NeedOfTheHour

      12.05.2020

      Delete
    4. మనలో నిరాశతో, నిరాశాపూరిత దృక్పథంతో ఉండేందుకు దారితీయగల దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను కొద్దిమంది మాత్రమే తప్పించుకోగలుగుతున్నాం. కష్టాలున్నా ఆశావాదాన్ని పెంపొందించుకోవడంవల్ల ప్రయోజనం ఉందని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి.
      ఒక ఆశావాది పరాజయాన్ని చవిచూస్తే ఎలా భావిస్తాడు? ఆయన ఆ పరాజయాన్ని శాశ్వతమైనదిగా పరిగణించడు. అంటే ఆయన వాస్తవాన్ని పట్టించుకోడని దానర్థంకాదు. బదులుగా, ఆయన దానిని గుర్తించి, విషయాన్ని పరిశీలిస్తాడు. ఆ తర్వాత పరిస్థితులు అనుమతించినంతవరకు, పరిస్థితిని మార్చడానికి లేదా మెరుగుపర్చడానికి చర్యతీసుకుంటాడు.
      అయితే, నిరాశావాది తాను కష్టాలను అనుభవించాల్సి వస్తున్నందుకు తరచూ తననుతాను నిందించుకుంటాడు. కష్టాలు శాశ్వతమైనవని, తన బుద్ధిహీనత, అసమర్థతవల్ల లేదా తాను ఆకర్షణీయంగా లేనందువల్ల వాటిని ఎదుర్కొంటున్నాని అనుకుంటాడు. అందువల్ల తాను నెగ్గుకురాలేననే ఉద్దేశంతో ఆయన ఆశలు వదులుకుంటాడు.

      ఆశావాదం మన ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుంది. ఆశావాదులు ఒత్తిడిని చక్కగా ఎదుర్కొనగలరు. వారు మానసిక కృంగుదలకు లోనయ్యే అవకాశం కూడా తక్కువ.

      అయితే, సమస్యలు పెరుగుతూ పోతున్నట్లు అనిపించే లోకంలో ఆశావాదులుగా ఉండడం అంత సులభమేమీ కాదు. కాబట్టి, ఆశావహ దృక్పథంతో ఆలోచించడం కష్టంగా ఉన్నట్లు చాలామందికి అనిపించడంలో ఆశ్చర్యంలేదు.
      Happy to be share my views.

      Delete
    5. ధన్యవాదాలు అశోక్ గారు. మీరు చెప్పింది కూడా సబబే. ఎందుకంటే నేడు మనం చూస్తున్న ఈ కోవిడ్ మహమ్మారి వంటి ఉపద్రవాలెన్నో తట్టుకుని కాలానికి ధీటుగా నిలిచినవారు ఈ సమాజాన లేకపోలేరు. మనిషిలో గల ఆశావాహ దృక్కోణం ఏనాడు మరుగున పడకూడదు. టైమ్ ఇజ్ దీ ఓన్లి ఫ్యాక్టర్ దట్ డిసైడ్స్ ఎవరిథింగ్.. ఎనిథింగ్ దట్ హ్యాపెన్ ఆర్ ఇజ్ హ్యాపెనింగ్ ఆర్ అబౌట్ టూ హ్యాపెన్ మస్ట్ ఆండ్ శుడ్ గెట్ ఇట్ సెల్ఫ్ ఇన్ దీ క్రానికల్ ఆఫ్ టైమ్. ఆఖరుకి శ్రీకృష్ణార్జున సంవాదములో సైతం కాలం యొక్క విశిష్టతను తెలియజేశారు.. ఏక కాలం లో ఒకే వాక్యం ఏదైనా ఉందా అని అంటే.. "ఇప్పుడు ఉన్న కాలం మరలి రాదు" అని చెప్పారట.. దిస్ ఇజ్ ఆల్ బట్ ఏ సింపల్ ప్లే ఆఫ్ టైమ్..!

      Delete
    6. Well said and very nice of you dear.

      Delete
  5. manishi anevadu asha jeevi padmagaru
    anta manchi jarugutundi anukokapothe bratakadam kashtam
    chakkati post mariyu chitramu.

    ReplyDelete
  6. చాలా మంచి ప్రేరణతో కూడిన ఆశాభావాని అందించారు. ఇలాగే కొనసాగితే సంతోషంతో ఉండగలుగుతాము లేదంటే అంతా వ్యధలు వేదనలే కదా!

    ReplyDelete
  7. వడ్డాది పాపయ్యగారి పెయింటింగ్ కి మీ పదాలు సరిపోయినాయి.

    ReplyDelete
  8. “ఆశావహ దృక్కోణం లేదా దృక్పథం, అనుకూల ఫలితాల కోసం ఎదురుచూసే వైఖరి”

    ReplyDelete
  9. ఆశావాదం అనేది ఒక నిర్దిష్ట వైఖరి. ఇది భవిష్యత్ పరిస్థితులు ఉత్తమంగా పనిచేస్తాయనే నమ్మకాన్ని పెంచి ఆనందాన్ని ఇస్తుంది.
    ఆశావాదాన్ని వర్సెస్ నిరాశావాదాన్ని వివరించడానికి ఉదాహారణగా నీటితో నిండిన గాజుగ్లాసులో ఒక ఆశావాది గాజును సగం నిండినట్లు చూస్తే నిరాశావాది గాజును సగం ఖాళీగా చూస్తాడు.ఆశావాదం మరియు నిరాశావాదంలో వైవిధ్యం కొంతవరకు వారసత్వంగా మరికొంత జరుగుతున్న పరిస్థితుల పరభావంగా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది కుటుంబ పరిసర వాతావరణాలతో కూడా ముడిపడి ఉంటుంది. సహాయ పర్యావరణ కారకాల ద్వారా ప్రభావితమై కొందరు ఆశావాదంతో ముందుకు సాగుతూ ఆరోగ్య ఆనందాలతో బ్రతికేస్తారు.
    ఆశావాదం అనేది జీవించడానికి అత్యవసరమని చెప్పుకోవచ్చు.

    ReplyDelete
  10. We need a reminder that things will get better — that's enough to live better and happily.
    Painting is good.

    ReplyDelete
  11. Instead of worrying about what you cannot control, shift your energy to what you can create it is better dear.

    ReplyDelete
  12. పులి లేడిపిల్లను వెంటాడుతుంటే బ్రతుకు మీద ఆశను వదులుకోకుండా క్రూరజంతువుకు దొరక్కుండా గుండెలు అవిసిపోయేలా ఎగిరిదూకుతూ శాయశక్తులా తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది లేడిపిల్ల. సృష్టిలో ఏ ప్రాణీ ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించదు. కొన్నిసార్లు ఓడిపోతాయేమోగాని, లొంగిపోవు. చచ్చిపోవాలని ఏ ఆశావాదంతో బ్రతికే ప్రాణీ కోరుకోదు-ఒక్క మనిషి తప్ప. జీవితంలో ఘోరంగా ఓడిపోయినప్పుడు తీవ్ర నిరాశకు లోనైనప్పుడు చనిపోవాలని ఆలోచించేది మనిషి ఒక్కడే! ఆ దశలో మనిషి ఆశ్రయించవలసింది ఆశావాదాన్ని. గెలిచి తీరాలన్న కోరిక గుండెల్లో నిరంతరం కణకణలాడుతూ ఉండటమే ఆశావాదానికి నిర్వచనం. మంచి పోస్ట్ వ్రాసి మెప్పించావు అర్పితా.-హరినాధ్

    ReplyDelete
  13. జరిగేది అంతా మంచికే

    ReplyDelete
  14. Even the darkest night will end and the sun will rise. Be positive

    ReplyDelete
  15. ఎన్ని గుండెలు మీకు ఇన్నిసార్లు ముక్కలవడానికి ?

    ReplyDelete
  16. ప్రేమబంధాలు తెగిపోయినప్పుడు మానసిక క్షోభ తీవ్రాతితీవ్రంగావుంటుంది.
    నిరాశా నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు. ముందుగానే మానసికంగా బంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూవస్తే ఏ సమస్యావుండదు. మనం కొన్నిసార్లు ఎంత కాపాడుకుందాం అనుకున్నా నిలవని వాటితోనే అస్లైన సమస్యలు ఎదురౌతాయి. చక్కని చర్చనీయాశం ఆలోచించవలసిన విషయము ఇదీ.

    ReplyDelete
    Replies
    1. ఆశ నిరాశల నడుమ లోలకంలా జీవితం
      నవ్వు ఏడుపుల నడుమ మిళిత రాగంలా జీవితం
      కన్నీటికి పన్నీటికి కరుగుతు ఓరుగుతు జీవితం
      రెప్పపాటు కాలంలో అనంతకోటి భావాల ఝరి జీవితం

      Delete
  17. mukalani badram chesi atikinchokovachu :)

    ReplyDelete
  18. ప్రేమ పొందడమే జీవితమా?
    నిన్నునీవు ప్రేమించుకోలేవా?
    మరణం ఆపని నీ యశమే
    నిరతం అదే నీ గెలుపు...

    గెలవకపోతేనేం భయమా?
    ఓటమి చూడనిది జయమా?
    మట్టిని తాకిన విత్తనమే
    మానై పొందును చేతనము..

    ReplyDelete
  19. మనిషి విశ్వాసం నిరాశకు గురైనప్పుడు
    మనిషికి లభించేది కేవలం ఆశ మాత్రమే

    ReplyDelete
  20. ముక్కలు అయ్యింది మనసులే మనుషులంకాదు..ultimate

    ReplyDelete
  21. Even the darkest night will end and the sun will rise.
    Very nice Optimism post.

    ReplyDelete
  22. విడివడిన గుండెలు కలవకపోతే ప్రేమకి అర్థమేలేదు

    ReplyDelete
  23. కవిత అసాంతం స్పూర్తితో నిండినది.

    ReplyDelete
  24. chakkani chitram
    chikkani bhaavam

    ReplyDelete
  25. లోకం అంతా నిరాశ మీ దారిలోనే ఉంది మేడం

    ReplyDelete
  26. రెండు పాత్రలు పోషించారా?

    ReplyDelete
  27. "మనసు ముక్కలు అయినా ప్రతీ ముక్కా ఒక కధ చెబుతుంది
    మనకు నచ్చిన కధను నచ్చని కధను వినవలసిందే అనుకుంటా"
    అందరి అభిమాన స్పందనలకు ఆర్పిత అభివందనములు _/\_

    ReplyDelete
  28. మనసు ముక్కలు అయితే అతుక్కుంటుంది గుర్తుండిపోతుంది.

    ReplyDelete
  29. మాటల మందారలు మనసుసును చుట్టూకున్నట్టు ఉంది

    ReplyDelete
  30. This comment has been removed by the author.

    ReplyDelete