మలుపులో మాయం

ఒక మలుపులో కలిసి కాసేపాగి మాయమైన జీవితమా
మరోసారి నా చేయిపట్టుకుని దివిని భువిని కలిపేయవా
ముక్కలైన నక్షత్రాన్ని అనుకోకుండానే రాలిపోతుంటాను
లేదని తెలిసి కూడా నీ నీడలో ఆశ్రయం కోరుతున్నాను!


అంత అకస్మాత్తుగా జరక్కూడనిదేం జరిగిందని జీవితమా
ఆత్మీయుడిగా హత్తుకుని అపరిచితుడివోలె అంతమైనావు
ఎండిరాలిన ఆకునై నీటిప్రవాహంలో కొట్టుకుని పోతున్నాను
అన్నీ తెలిసిన మదినెందుకు కట్టడి చేయలేకపోతున్నాను!


కొన్నిక్షణాలు కలిసి యుగాల ఎడబాటు వొసగిన జీవితమా
మేఘాల నడుమ నుండి సూర్యకిరణంలా వెలిగిపోతుంటావు
ఎదురుగా నువ్వే కనబడి చేజారుతున్నావని ఎలా చెప్పను     
వెళ్ళినప్పట్నుంచీ విశ్రాంతి లేకుండా నిన్నే వెతుకుతున్నాను!

19 comments:

  1. జీవితం కాలంతో సాగే పయనం
    జీవితం థీరిలో నయన మనోహరం
    జీవితం ప్రాక్టాకల్ గా కాస్త అయోమయం
    జీవితం భావోద్వేగాల సంగమం
    జీవితం కాలానుగుణంగా తిరగాడే చక్రం

    ప్రతి నిత్యం సరికొత్తగా అంతే సంభ్రమాశ్చయాలు
    ప్రతి నిత్యం మనసు లోతులో కలిగే రాగద్వేషాలు
    ప్రతి నిత్యం నీతో నీకే సవాలు విసిరే స్ఫర్ధ
    అను నిత్యం రగిలే మానసిక ఒత్తిడి వరుస
    ప్రతి మలుపు మునుపోక గమ్యం అనక మారేను
    కాల గమనాన గుప్పెడు గుండె నిండ ఆశల ఊట
    ~శ్రీ

    ReplyDelete
  2. mee raase kavitalanu chadivite anipistundi meeru premanu panchadanike tappa premanu pondadaniki puttaledani. tappuga bhavinchakandi idi kevalamu na abhiprayam matrame. prati kavitaloe yedo teliyani vyadhanu ponduparachi bhaavalanu rastaru. ivi chadavadaniki baguntay kani anubhavinche variki bhayankara narakam anipistundi anukuntanu.

    ReplyDelete
  3. ఏ మలుపులో అయినా తోడు ఉండే వాళ్ళు అవసరం. ఇలా తడవకు ఒకసారి మాయం అయిపోయే వాళ్ళు డేంజర్...ఏమంటారు

    ReplyDelete
  4. మీరు జీవితాన్ని ప్రశ్నిస్తూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న తీరు బాగున్నది.

    ReplyDelete
  5. జీవితంలో ఏం సాధించాలి అనుకున్నా పట్టుదల చాలా అవసరం. పట్టుదల సన్నగిల్లినప్పుడు కలిగే భావాలకు ప్రతిరూపం మీ పోస్ట్. చిత్రం చూడ ముచ్చటగొల్పుతుంది.

    ReplyDelete
  6. పాత ప్రేమ వ్యహారం కొత్త బొమ్మతో పెట్టినట్లు ఉన్నారు.

    ReplyDelete
  7. తృటిలో తప్పింది ప్రమాదం.
    మలుపులో మాయం అయిపోయాడు
    చివరివరకూ ఉంటే కష్టం సుమా

    ReplyDelete
  8. so beautiful and lovely madam

    ReplyDelete
  9. వలపు మలుపులో మాయం అయ్యిందా ? అయ్యో పాపం

    ReplyDelete
  10. wow still prema viraham lo busy

    ReplyDelete
  11. jeevitamloe adi tappadu
    jeevitam jeevinchadam kosam

    ReplyDelete
  12. స్త్రీ మనోభావాలు చక్కగా వ్రాసారు.

    ReplyDelete
  13. పర్యావరణ దినోత్సవం కవిత రాయలేదు మీరు

    ReplyDelete

  14. కవిత చిత్రం పోటీ పడుతున్నాయి.

    ReplyDelete
  15. ప్రోత్సహితున్న హితులందరి క్షేమం కోరుతూ ...పద్మార్పిత వందనములు.

    ReplyDelete
  16. ఏంటీ వైరాగ్యోపాఖ్యానం??

    ReplyDelete
  17. చాలా బాగుంది.

    ReplyDelete