వెజ్ లో నాన్ వెజ్

పుల్లట్టులోన పుట్నాల పప్పుపొడేసి నూపప్పునూనేస్తే
పుల్లైసు పుచ్చుకుని పుట్టుక్కని పైనాకిందా చీకినావు

చింతపండు బెల్లం జీలకర్రతో కలిపిదంచి చీకని చేతికిస్తే
చిన్నిసేపలట్టుకొచ్చొండని చిత్తకార్తి కుక్కోలె పైనపడ్డావు 

కందముక్క పులుసెట్టి ఏడన్నం ఆదరాబాదరగా అందిస్తే 
కల్లుముంత ఎత్తింది దించక నాటుసారా ఏసమేస్తున్నావు

సంగటిముద్ద తోటకూరపప్పుతో సల్లారకుండా నోటికందిస్తే 
సందువాసేపా ఇప్పసారా లేకుంటే సరసం చేతకాదన్నావు

పచ్చిపులుసులో ఉల్లిపచ్చిమిరపకాయలేసి పిసికి పట్టనిస్తే
పచ్చిరొయ్యల ఇగురు ఏదని పైత్యంతో కొట్టుకుంటున్నావు

అప్పడాల కర్రతో అటూఇటూ నాలుగుబాది మూలకూలేస్తే
అఫ్ఫుడే చెయ్యాల్సిందని ఇచ్చిన గంజితో గమ్ముగున్నావు 

28 comments:

  1. ఎవరికి ఎలా వడ్డించాలో తెలిసిన జాణ

    ReplyDelete
  2. kikku ichchinaru :)

    ReplyDelete
  3. పచ్చి మిర్చి మిరియం ఝంఝాటమే ఘాటు ఎక్కువ గదా
    చింత పండు పచ్చి మామిడి అయోమయమే పులుపు ఎక్కువ గదా
    తాటి బెల్లం కుండ బెల్లం తలతిక్కే తీపిపై మక్కువ గదా

    గారాలు పోయే కోమలాంగి ఆయ దినుసులతో
    వండి వార్చితే లేని పోని సాకులు చెబితే ఇలానే జరుగును గదా

    స్త్రీ పురుషులు దాంపత్య బంధంలో
    చెమరింతలు అవాకు చివాకులు సహజమే గదా
    మనసు తెలుపుకుని ఆలి అల్లుకుపోతే
    మనసు తెలుసుకుని మగడు ఓలలాడిస్తే అన్యోన్యమే గదా

    దాదాపూగ ముప్పై ఏళ్ళు ఒంటరి జీవితంలో
    తనని ఆహ్వానించటం ఓ అపురూప ఘట్టం
    అనువుగా నీవు అణకువగా తాను
    సంసార సాగరాన్ని ఈదుతు
    కష్ట సుఖాలను సరిసమానంగా బేరీజు వేసుకుంటు
    కలసి సాగిపోవటమే వారి జీవితానికి పరిపాటి గదా

    ~శ్రీత ధరణీ

    ReplyDelete
    Replies
    1. ఆంతర్యం:
      మనదని అనుకుంటే కష్టాన్నైన ఇష్టంగా భరిస్తారు
      సామదానదండన తో ఒళ్ళు హూనం అనక కాపడం తప్ప ఒరిగేదేమి లేదు సుమి.

      ఉన్న దానితో తృప్తి పడటం ఉన్నంతలో జీవించటం అలవర్చుకుంటే నేటి చిన్ని పొదుపు రేపటికి మదుపుగా ముట్టుతుంది.

      అంతే కదా పద్మ గారు.

      Delete
    2. ఈ కరోన కాలం లో నిజంగానే నిజం.. కాసింత పెరుగులో తాలింపేసుకుని కాచుకునే మజ్జిగ చారు మజాయే వేరు.

      పచ్చి పులుసులో తాలింపు దట్టించి ఉల్లి కారం దట్టించి ఆవు నెయ్యి కలిపి ఆరగిస్తే అబ్బో ఆ రుచే వేరు.

      ఏ మాటకి ఆ మాట.. నాకు వెజ్ అంటే మహా ప్రీతి
      మాయావిడకు నాన్ వెజంటే అబ్బో లొట్టలేసుకుంటుంటుంది.

      కారం తినే వారికి మమకారం ఎక్కువే వెటకారం ఎక్కువే
      ఏదేమైనపటికి నా శ్రీమతి మొట్టమొదటిగా తానే వండి వడ్డించిన బెండ వంకాయ కూర ఓ మోస్తరుగా బాగానే ఉందనుకోండి పద్మ గారు.

      సతి సమేతంగ కలం పేరులో చిన్న మార్పు గమనించి ఉంటారు. ఇది ౨౦౧౮ నుండి మార్పు చెందింది.

      ఇట్లు
      శ్రీత ధరణి (మేము)
      మరియు "చూచూలు" శరణ్య (మా చిట్టి తల్లి)

      Delete
    3. నీది అని రాసి పెట్టి ఉంటే అదేదైనా సరే.. నీకే చెందుతుంది, చివరాఖరున నీకే దక్కుతుంది.
      నీది కానిదేదైనా
      నువ్వెంత తపించిన పాలపై మీగడ మాదిరి అంటి అంటనట్టే ఉంటుంది.
      కొందరు ఆశావాదులు మరికొందరు అవకాశవాదులు.
      ఆశావాదులు "మన" అంటారు
      అవకాశవాదులు "మా" "నా" అంటారు
      అదే తేడ

      Delete
  4. ఇంతకూ వంటకాలు రావని చెప్పలేక వేసిన వేషాలు...ఈ ఈ ఈహి

    ReplyDelete
  5. ఇదేదో గోలగా ఉంది :-)

    ReplyDelete
  6. Padmaa mari anddam book chesavu
    papam ganji neellu gati-h a haa a a a

    ReplyDelete
  7. వారెహ్ వాహ్ ఏమి రుచి
    దెబ్బలూ రుచే అన్నమాట గురుడికి

    ReplyDelete
  8. ఆడవారి ఆయుధాన్ని ఆఖరికి వాడినారు

    ReplyDelete
  9. అప్పడాల కర్రతో అటూఇటూ నాలుగుబాది మూలకూలేస్తే....అచ్చ బ్రాహ్మణ వంటలు

    ReplyDelete
  10. Anonymous21 June, 2020

    This comment has been removed by the author.

    ReplyDelete
  11. Anonymous21 June, 2020

    This comment has been removed by the author.

    ReplyDelete
  12. Anonymous21 June, 2020

    //అచ్చ బ్రాహ్మణ వంటలు//

    కమ్మ ..... గా ఉంటాయాండీ .. .?

    ReplyDelete
    Replies
    1. కమ్మగా ఉండవు...వెల్లుల్లి పడదుగా ?

      Delete
  13. వెజ్జే కనబల్లే , నాన్
    వేజ్జే మరి , అప్పడాల వ్రేటులదాకా ,
    నిజ్జంగా పుల్లట్టుకు
    మజ్జారే పుల్లయిసు యమా పోటీ రా .

    ReplyDelete
  14. Full veg
    Sunday non veg

    ReplyDelete
  15. She is perfect housewife

    ReplyDelete
  16. దంచి కొట్టుడు
    నాటు కొట్టుడు

    ReplyDelete
  17. Total ga endi lo chitaka badi untaru.

    ReplyDelete
  18. ఇంతలా చితక్కొట్టుడు అన్యాయం... అసలే కరోనా బయటికి కూడా వెళ్లలేడు

    ReplyDelete
  19. పుల్లట్టు
    పుల్లైసు
    :) :)

    ReplyDelete
  20. అందరితో పేరు పేరునా ముచ్చటించాలని ఉంది
    కానీ కుదరక అందరికీ ఒకే వందనము చేస్తూ..
    సదా మీ అభిమానాన్ని కాంక్షించే- మీ పద్మార్పిత.

    ReplyDelete