ఆశాలింగనం

అర్థరూపాయికి ఆరుబయట కాచే ఎండను 
ఆరురూపాయలకు ఆకాశం నుండి వానను
అతిచౌకగా అంగడి నుండి తెస్తావన్న ఆశని
ఆదిలోనే అణచివేయలేకపోయాను ఎందుకో!

సూర్యకిరణాల కాంతిని వడగళ్ళిచ్చే వానను
పరిమళ పుష్పాల సుమధురమైన జల్లులను
పరవశింపజేసే ప్రతీ ఋతువు తనై రావాలని
కోరడం సొమ్ములేని ఖాతాని తెలియలేదెందుకో!

వడపోత ఎండ నుండి సేదతీర్చే చల్లనినీడను
నూలుపోగుల తెల్లదుప్పటి పరచిన పరుపును
ప్రణయ సుధాభరిత తుది ఊపిరి తానవ్వాలని
బజారులో బేరమాడ్డం గుడ్డోడికి చత్వారమనుకో!

ఆరిన కన్నీటిలో మొండిగ మొలకేసిన విత్తును
కాపాడితే చిగురించి పెరిగి అందించిన ఫలాలను
ఎవరో తింటారని తక్కెట్లో తులాభారం వేయడం  
అస్తిపంజరాన్ని ఆబగా చుంబించే ఆత్మ అనుకో! 

20 comments:

  1. కిరాణా కొట్టులో ప్రపంచాన్నే దాచారు... అస్తిత్వాన్ని మాత్రం అస్తికల్లో దాచారన్నమాట

    ReplyDelete
  2. జీవితం మూడునాళ్ళ ముచ్చట.

    ReplyDelete
  3. చిత్రం అసభ్యకరంతో కూడి ఉంది. ఎందుకు పెట్టారు?

    ReplyDelete
  4. Most difficult to understand

    ReplyDelete
  5. కనుజారే కన్నీటి బిందువులలో.. భావుకత నిండిన ఆనవాలు
    తనవారి కై ఎదురు చూసే వేళలో.. నిటూర్పు సెగల ఆనవాలు
    ప్రకృతిలో మమేకమయ్యే వేళలో.. ఆందోళన మిగిల్చిన ఆనవాలు

    ఏటవాలు చూపుల్లో దాచిన దాగని భావోద్విగ్న మనోగతాలు
    అనితరసాధ్య మనుకునే మనోబలానికి రాగద్వేషాల కదలికలు
    అవలీలగా సాగే జీవితాన సైతం అలుపెరుగని భావావేశాలు
    మన వారి నుండి మనకే తెలియని ఆక్రందన సన్నివేశాలు

    నర్మగర్భంగా మాటలాడే కొరవడిన మానవత్వాలు
    మనలో ప్రతినిత్యం భావుకత కొరవడే క్షణభంగురాలు

    కనురెప్పలు కంటిపాపకే కవచాలు కాని లోకాన్ని ఇమడ్చగల కన్నులు తనకు తానుగా కంటిరెప్పలను చూడలేవుగా
    లోకాన శబ్దాలను అలవోకగా ఆలకించే కర్ణాలు తనలోని వేదన తెలుపగల భాషను సైతం వినలేవుగా
    ఘ్రాణ శక్తిను సొంతం చేసుకున్న ముక్కు సైతం మనలోని మంచి-చెడులను పసిగట్టలేవుగా
    రుచులను ఆస్వాదించే జిహ్వతో మనసుని కోసి పారేసే కటువు మాటలు సైతం లొడలొడ వాగేయగలదుగా

    క్యాల్షియం అస్తిపంజరంలో దృడంగా ఇతర అవయవాలు ఎలా ఐతే కలివిడిగా ఉంటూ ఎదిగి మెల్లమెల్లగా జీర్ణించుకుపోతాయో
    కాలానుగుణంగా వచ్చే మార్పులకు లోబడి సాగించే జీవితంలో అపుడపుడు చెమరింతల చిరుజల్లులే కాక ఆనందభాష్పాలు పెల్లుబీకుతాయో
    నిన్నటికి నేటికి రేపటికి గల వ్యత్యాసానికి పొంతన లేని పదాల కూర్పుతో అక్షర హారాలు అల్లుకుపోతాయో
    వాటి వాటి దృష్ట్య మనలోని ఆశ, కోరిక, నిస్సహాయత ఉద్విగ్నత లనే ఇన్‌స్టంట్ ఎమోషన్ ల ప్రేరిత ఈ జీవితం

    ~శ్రీ

    ReplyDelete
    Replies
    1. కొన్ని క్షణాలు
      అనితరసాధ్యాలు
      కొన్ని క్షణాలు
      మధురమైన జ్ఞాపకాలు

      వెల్లువలా ఉప్పొంగే క్షణాలతో
      తన్మయత్వం నిండే భావుకతలు

      Delete
  6. మరీ ఇంత అర్థమై కానట్లు రాస్తే ఎలా మాడం

    ReplyDelete
  7. "అంధుడికి చత్వారము"
    చమత్కారమైన చురక :)

    ReplyDelete
  8. seasons ni super market lo ammesi vastaru. bahu telivaina dodda manasu medi.

    ReplyDelete
  9. వారినాయమ్మో...అస్తిపంజరం ఆత్మతో లగాయిత్తు :)

    ReplyDelete
  10. మీరు జగమెరిగిన మాంత్రికులు అనిపిస్తుంది.

    ReplyDelete
  11. rayali anukunte konchem sulabhataraminavi raayandi padmagaru

    ReplyDelete
  12. ప్రతీ పద పంక్తిలో జీవితాన్ని ఎంతో దగ్గరగా చూసి అనుభవించిన సారాంశం కనబడుతుంది. అభినందనలు మీకు తల్లీ

    ReplyDelete
  13. very much confused what to comment.

    ReplyDelete
  14. ollu jaladarimpu
    corona chusi kadu
    kissing to skelton chusi
    oh..no no no dishum dishum

    ReplyDelete
  15. అందరికీ వందనములు _/\_

    ReplyDelete
  16. భారమైన పోస్ట్

    ReplyDelete
  17. ఏమో కొన్నాళ్ళకు రుతువులను సైతం అమ్ముకునే పరిస్థితులు వస్తాయి అనుకుంటాను. లోతుగా ఉన్న భావంతో వ్రాసిన కవిత బాగుంది.

    ReplyDelete
  18. చాలా లోతుగా ఆలోచించి వ్రాసినట్లున్నారు.

    ReplyDelete
  19. Very dramatic way of expressions these are.

    ReplyDelete