ఎందుకని?

 

అనుకోకుండా ఒక మలుపులో అధ్భుతంగా అగుపడి
కాసేపాగి అంతలోనే అంతర్ధానమైపోయావు ఎందుకని?

చేయిపట్టి నడిపించి అందమైన లోకాలు ఎన్నో తిరుగాడి
నింగీనేల ఒకటైనట్లు కలిసి కనుమరుగైనావు ఎందుకని?

రాలిపోయే నక్షత్రాన్ని రాలిపోక చేరాలనుకున్నా నీ ఒడి
భాగస్వామివై అనుకోని అపరిచితుడివైపోయావు ఎందుకని?

ప్రవహించే వాగు పై తేలియాడు ఎండిన ఆకులా రాలిపడి
అయినా నీ సాన్నిహిత్యాన్నే కోరుతుంది మది ఎందుకని?

మేఘాలమాటున నక్కిన తేజోపేతమైన సూర్యకిరణాల వేడి
బానిసైన నీకు నాహృదయం దాసోహమంటుంది ఎందుకని?

నీవు లేకుండా నిన్ను చూడకుండా ఇన్ని యుగాలు గడిపి
ఇప్పుడు చివరిమజిలీలో నిన్ను చూడాలనే కోరిక ఎందుకని?

20 comments:

  1. చిత్రంలో అమ్మాయి బాగుంది. ఎందుకని అడగడం దేనికి సమాధానం తెలుసుకుని చెప్పాలి:)

    ReplyDelete
  2. ఏవిటండీ ఈ కరోనా పీరియడ్లో కూడా ఇంకా ప్రేమ ప్రశ్నలేనా?
    అయినా అడుగుతున్నది అందమైన అమ్మాయి కదా.....ఓకే

    ReplyDelete
  3. కుదురుగా లేని మనసులో భావాల ఆటుపోట్లు
    ఉబికిన కన్నీటి ధారలో కనుమరుగైన మలుపు
    రెప్ప పాటు కాలంలో అనంతానంత ప్రశ్నలు
    దిగాలు, ఉద్విగ్నత, ఆతృత, కుతుహలం అందుకనే కాబోలు

    ~శ్రీత ధరణీ

    ReplyDelete
  4. ప్రేమార్పితకు తెలియదా
    ఎందుకని అడుగుతుంది
    అది ప్రేమని...అహా హా

    ReplyDelete
  5. andamaina preama kavyamloe prasnalaku tavuledu madam

    ReplyDelete
  6. మీ కవితల్లో కధానాయికలు అందరూ ఎంతో అందంగా ఉంటారు. వాటికి తగిన పదాలను మీరు జోడిస్తారు.

    ReplyDelete
  7. prema unna manasu ive korukuntundi Padmarpitagaru.

    ReplyDelete
  8. మేఘాలమాటున నక్కిన తేజోపేతమైన సూర్యకిరణం

    ReplyDelete
  9. చక్కని భావాన్ని వెళ్ళబుచ్చినారు

    ReplyDelete
  10. manasu gati premalo padithe itlane untadi

    ReplyDelete
  11. మీ కవితలు మీ స్వరంతో వినే అవకాశం ఉందా ?

    ReplyDelete
  12. హృదయం నిండుగ ఉండగ ఇంకెందుక్ని అడగటం అన్యాయం.

    ReplyDelete
  13. అద్భుతాలు అనుకోకుండానే జరుగుతాయని మీకు తెలుసు అయినా తప్పదు అంటారు.

    ReplyDelete
  14. ప్రేమ పైత్యం కాబోలు

    ReplyDelete
  15. అందరికీ నా వందనములు.

    ReplyDelete
  16. Pattukunna prati cheyyi mana tho undali anthe, mana cheyyi adrustam chesukoni undali. Antha lucky evaridooo ee lokam lo.

    ReplyDelete