మెదడును మొద్దుబార్చి కాలాన్ని సాగదీసి
అలసిన శరీరాన్ని అప్పుడైనా సేద తీర్చక
ఎన్నో రాత్రులను చిరాగ్గా తరిమేస్తుంటాను!
కొన్ని ఆలోచనలకు భావాలతో సంధి కూర్చి
మనసును మౌనంగా ఉండమని మాయచేసి
అలిగి అసహ్యించుకున్న నాతోనేను మాట్లాడక
ఎన్నో జవాబులేని ప్రశ్నలకు మూలమౌతాను!
కొన్ని కోరికలకు జరుగుబాటుతో జతకమ్మని
సర్దుబాట్లతో ఆశలకి ముడికట్టి సంభోగింపజేసి
అసలు గర్భమే దాల్చని ఆశయాన్ని కదపక
ఎన్నో అసత్య బాసలతో నీడని సంస్కరిస్తాను!
కొన్ని రహస్య భిన్న రాచకార్యాలతో రంకుచేర్చి
గుట్టుగున్న గుండెకు మసిపూసి మాయ చేసి
అంతరంగాన్ని అడ్డంగానరికి ప్రతిబింబం చూడక
ఎన్నో ఉదయాలకు ఊహలద్ది ఊపిరి పోస్తాను!
కదిలే కాలానికణుగుణంగా
ReplyDeleteపరిస్థితుల ప్రభావానికి లోనై
ఊపిరులు సలపక లోలోనే కార్చిచ్చు
తెలిసి తెలియని భావోద్వేగం
రోజులు బాగుగా ఉన్నా ఏవో క్లేషాలు
రోజులు బాలేనపుడు కూడా సంధిగ్దత ఆవేశాలు
దూర తీరాల పయనం జీవితం
బంధానికి ముడివేసే కడలి తరంగం
జన్మ దుర్లభం బంధం బలగం
~శ్రీ
చివురించే ఆశలు న్యూ నార్మల్ సంకేతాలు
కోవిడ్ విజృంభణను ధీటుగా ఎదుర్కునే సవాళ్ళు
ఊపిరులూది వ్యాధినరికట్టే వేళ
ప్రతినిత్యం హరినామ స్మరణ
జరుగుబాటు వెసులుబాటు తత్తరపాటు
భూమిపై అందరిలోను కలవరపాటు
జన్మకు సార్థకత మంచిలోనే ఉంది
ప్రేరణ స్ఫూర్తి ఆత్మస్థైర్యమే వెనెముక
ఎంతటి మహమ్మారైనా ఏదో ఒకనాడు సమసిపోవును
గుండె ధైర్యాన్ని వీడకూడదెవరైనా అంత మంచే జరుగును
హరినామ స్మరణ సర్వజన హితకరం
వందే తమ్ భగవతం గోవింద గరుడారూఢం
lotaina bhavalato ratri anta kusti padinatlu spashtam avutundi mee E kavita chaduvuthunte.
ReplyDeleteVery attractive art picture.
చిత్రంలో చిన్నది ధైర్యవంతురాలని ఆమె చూపు చెబుతున్నది.
ReplyDeleteమీ కవితలోని కధానాయకురాలు అంతకు మించిన ధీరురాలు కదా :)
ఎన్నో జవాబులేని ప్రశ్నలు సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు...అవి లేనిది జీవితం లేదని అంటారు అనుభవగ్నులు.
ReplyDeleteరోజూ ఉదయాన్నే మేలుకుంటున్నాము అంటేనే కొత్త ఊపిరి పోసుకున్నట్లు కదండీ.
ReplyDeleteకవిత మరియు చిత్రము రెండూ పోటీ పడుతున్నాయి.
Wow...you made it.
ReplyDeleteఎన్నో జవాబులేని ప్రశ్నలకు మూలమౌతాను...మీరు ఇలా వ్రాసి మరింత నచ్చేసారు.
ReplyDeleteNice blog with amazing paintings and beautiful feelings
ReplyDeleteరహస్య భిన్న రాచకార్యాలు ఏమిటో సెలవియ్యండి.ha ha ha ah
ReplyDeleteFeel bagundi
ReplyDeletePic kuda
చాలా బాగుంది
ReplyDeleteరోజూ కొత్త ఊపిరి పోసుకుంటున్నాం
జీవితం చాలా చిన్నది. ఒకసారి పోయిన ప్రాణం మళ్ళి తిరిగిరాదు. ఉన్నప్పుడు అందరితో కలిసిమెలసి ఉండాలి. పోయేటప్పుడు వెంట ఏమీ తెసుకుని పోము మనం.
ReplyDeleteఅద్భుత పదజాలంతో మెప్పించారు.
ReplyDeleteannee ekkado putti
ReplyDeleteikkada antam aipotuntayi
logics problems leni life undadu.
కొన్ని రహస్య భిన్న రాచకార్యాలతో రంకుచేర్చి
ReplyDeleteగుట్టుగున్న గుండెకు మసిపూసి మాయ చేసి
awesome wordings andi..kudoos
గుట్టుగున్న గుండెకు మసిపూసి మాయ మీరే నా చేసింది?
ReplyDeleteఇది అందరికీ సాధ్యం కాని పని కదండీ...
VERY NICE
ReplyDeleteఅక్షరాలకు కొత్తఊపిరి పోసినట్లు ఉంది.
ReplyDeleteసర్దుబాట్లతో ఆశలకి ముడికట్టి సంభోగింపజేసి
ReplyDeleteఅసలు గర్భమే దాల్చని ఆశయాన్ని కదపక
ఎన్నో అసత్య బాసలతో నీడని సంస్కరిస్తాను
పద్మర్పిత పదాలు ఎక్కడికో తీసుకుని వెళతాయి
chaalaa nachchindi
ReplyDeleteinchuminchu naa bhaavaalea.
అందరికీ పద్మార్పిత అభివందనములు_/\_
ReplyDeleteకొత్త పదాలతో అద్భుతమైన నిర్వచనం చెప్పారు.
ReplyDeleteఎలా ఉన్నారు?
ReplyDeleteఅంతా క్షేమమేనా?