ఏదోక ముల్లు..

నేను గడియారంలో సెకండుల ముల్లును అవుతాను
గంటముల్లై నువ్వు తిరుగు సమయానుసారం కలుద్దాం
గోడగడియార జంటముల్లులై కౌగిలించుకుని విడిపోతూ
బ్యాటరీ అయ్యేంతవరకూ కాలంలా కదిలి కాపురంచేద్దాం!
నీవు ఒక్కడుగు వేస్తే అరవై అడుగులు నేవేసి వస్తాను
వెనకెనుకపడి వ్యామోహపు వెంపర్లాటలో హద్దుదాటేద్దాం
అలా అన్నింటినీ ఆస్వాదిస్తూ ఒకరినొకరు ముద్దాడుతూ
ప్రేమ పలకరింపులతో పరుపూ పానుపులమై పవళిద్దాం!
నువ్వు పెద్దముల్లు సెకన్లముల్లున్నా లేకున్నా ఒకటేను
అందుకే నిముషాల గంటలముల్లుల మధ్య ముడివేద్దాం
అప్పుడప్పుడూ కలిసే బంధమేలని నన్ను నిమురుతూ
ఆప్యాయంగా హత్తుకోగానే రెండు ఎదలకు పెళ్ళి చేద్దాం!
నాతో నువ్వుంటే చిన్నాపెద్ద ముల్లేదైనా సర్దుకుంటాను
క్షణక్షణం సాగుతూ కాలాన్ని నిముషాలుగా మార్చేద్దాం
కలిసినప్పుడు అలసి కలసిరాని కాలానికి ఎదురీదుతూ
విలువదేముంది ఉన్నంత కాలం ఒకరిలో ఒకరై జీవిద్దాం!

16 comments:

  1. పోటాపోటిగా సాగే "ముళ్ళ" కాపురం కారాదు మనస్పర్ధల అగాధం
    హోరాహోరిగా సాగే "ముళ్ళ" కాపురం కారాదు అసంతులిత వ్యవహారం

    గుండెకు గుచ్చుకుని నొచ్చుకునే సమయపు ఒక్కో ఘడియ కారాదు అటకెక్కి హేళన పర్వం
    గడియారమంటి ఇంటిన తారాడే భేషజాల్లేని "ముళ్ళు" కావాలి అవే ఆనందానికి పరవళ్ళు

    ReplyDelete
    Replies
    1. గడియారం తెలిపే నీతి..
      కాలానుగుణంగా జీవితాన మార్పులు చేర్పులు సహజం..
      మనిషి జీవితాన కష్ట సుఖాలు, ఆనంద విషాదాలు, లోటుపాట్లు సర్దుబాట్లు సహజం.. కష్ట సుఖాలనేవి గంటల ముల్లు కు ప్రతీక.. ఏదో ఒక సారి కదలిక ఉంటుంది.. ఆనంద విషాదాలు నిమిషాల ముల్లుకు ప్రతీక.. అపుడపుడు కదలికలిస్తు తాను కూడా భాగమేనని సూచిస్తుంటుంది.. లోటుపాట్లు సర్దుబాట్లు సెకను ముల్లుకు ప్రతీక.. ఎల్లపుడు కదులుతు లోటుపాట్లను సర్దుకుంటు సాగిపోవాలి గాని ఏరోజు కృంగ కూడదని సూచిస్తుంటుంది.. ఐనా కాని ఈ మూడిటిని వాటి వాటి గుణగణాలను బట్టి జీవితమనే గడియారం లో భాగమని గుర్తించాలని ప్రతీక..!

      ~శ్రీత ధరణి

      Delete
  2. Madam amazing thoughts you have.
    Gadiyaram mullula kapuram we can't even imaging, hats of to you.

    ReplyDelete
  3. గడియారంలో చిన్న ముల్లు పెద్ద ముల్లు కలిసి కాపురం చెయ్యడం సమ్మతమే అంటారు సెకన్లు ముల్లు కాపురానికి పనికి రాదంటారా?
    గోడగడియారం బాగుంది.

    ReplyDelete
  4. సమయానికి తగినట్లు కలిసి కాపురం...బాగు బాగు

    ReplyDelete
  5. మీ ఆలోచించిన తీరుకు ఫిదా నేను.

    ReplyDelete
  6. Excellent
    Time maintaining LOVE

    ReplyDelete
  7. గడియారముతో పోల్చిన విధానం బాగుంది
    కాపురం ఎలా ఉంటుందో తెలియదు :)

    ReplyDelete
  8. గడియారంలో ముళ్ళు జీవితము ఒకటి కాదు.గడియారం లోనిమూడు ముళ్ళు డిసిప్లిన్కు చిహ్నం. ఏదో చెప్పాలి అనుకుని ఇంకేదో వ్రాసినట్లు ఉన్నారు. చిత్రములోని గడియారము చూడముచ్చటగా ఉంది.

    ReplyDelete
  9. E vidhamga time chusi romance chesukune jantalu ipudu chalane unayi.

    ReplyDelete
  10. మీకు చిత్ర విచిత్రమైన ఆలోచనలు బాగా వస్తాయి.

    ReplyDelete
  11. అభిమానులకు వందనము.

    ReplyDelete
  12. Well maintaining...TIME

    ReplyDelete
  13. గడియారంలో ముల్లు
    నువ్వు నేను అవుదామని
    కొత్తపంధాలో బాగుంది మీ కవిత.

    ReplyDelete