ఇలా జరిగితే

అర్థరాత్రి అయ్యిందని తెలియజెప్పే కారుచీకట్లో
నక్షత్రాల వెలుతురులో ఎన్నెన్నోసార్లు నిద్రలేచి
నుదుట పట్టిన చెమట తుడుచుకుని గుటవేసి
కంటిపాపను కసురుకుని కునుకు వేయమంటే
నిద్ర అత్యవసర సమావేశమై సమీకరించింది!!

అలా ఎప్పుడో వచ్చి వదిలి వెళ్ళిన జ్ఞాపకాలే
నిర్వీక్షణంగా మారి కూడా ఎంతగానో వేధించి
సమాధానం దొరకని సందేహాలుగా ఆరాలుతీసి
అవి ఆనవాళ్ళైనా మిగలని సంతోష శకలాలంటే
నమ్మి నిండుగ నవ్వడం దౌర్భాగ్యమౌతుంది!!

అంతర్లీన సతతహరితారణ్యానికి నిప్పెట్టినప్పుడే
మనసుతోపాటు ఒళ్ళూ చిచ్చుతో కాలిమండినా
విరుచుకుపడక మ్రానులా నిలబడి చిగురువేసి
మంటల ముందు వెర్రి తాండవమాడి నర్తిస్తుంటే
కాలమే కళ్ళుతిరిగి బైర్లుకమ్మి మూర్చపోయింది!! 


19 comments:

  1. ఏమో ఏమో ఇది
    నిదుర రాకున్నది

    చలిగిలి చీకటి గది
    పలవరిస్తు ఉంది మది

    కారు మబ్బు సన్నిధి
    తుంపర్లతో ఓలలాడిస్తది

    ఏమార్చి తడబాట్ల కొలది
    మనసే భావాల పెన్నిధి

    ~శ్రీత ధరణీ

    ReplyDelete
    Replies
    1. उनकी अदायें दिन में ठण्डक जगाये
      उनकी अदायें रात भर गर्मी फैलाये
      उनकी अदायें पल पल अपनी ही याद दिलाये
      उनकी अदायें मुझसे ही व्याक व्याक कहलाये
      क्या कहें हुज़ूर बेपनाह जिन्दगी में उदासीनता की आलम उसके रूठने पर मन मन में ना रह पाये
      उनकी अदायें कीचड में लपलपाती भैंस की तरह चारों ओर मक्खियाँ भिनभिनाये
      उनकी अदायें
      #घम्सी #ट्रीम्ला #अण्टा #व्यंग्य

      Delete
    2. క్షేమ కుశల ఆశీర్వచనాలతో-హరినాధ్

      Delete
    3. సర్ హరినాథ్ గారు.. ఎలా ఉన్నారు.. క్షేమమనే తలుస్తున్నా.. ఎల్లవేళల మీ వంటి పెద్దవారి చల్లని ఆశిస్సులే శ్రీరామ రక్ష.. జై శ్రీమన్నారాయణ

      Delete
  2. లోతట్టు భావగంభీరత కనబడుతుంది కవితలో, చిత్రం కూడా తగినట్లుగా ఉంది.

    ReplyDelete
  3. ఈ కవితలో గంభీరమైన పదాలు అలతిగా వాడి తాత్వికవిరక్తి వ్యక్తీకరించారు, ఎందుకు మీరు ఇంత వైరాగ్యాన్ని ఎంచుకున్నట్లు? చిత్రము బాగున్నా అందులో వేదన కనబడుతుంది.

    ReplyDelete
  4. ఏది ఎలా జరగాలని ఉంటే అదే జరుగుతుంది మేడం.

    ReplyDelete
  5. bomma bhavam rendu bagunnayi

    ReplyDelete
  6. నమ్మి నిండుగ నవ్వడం దౌర్భాగ్యమౌతుంది..correct

    ReplyDelete
  7. అంతర్లీన సతతహరితారణ్యానికి నిప్పెట్టినప్పుడు..ఇలా అందంగా మీరే వ్రాయగలరు.

    ReplyDelete
  8. అంతరగానికి నిప్పుపెట్టి మనకు మనం బాధపడ్డం అవివేకం అనిపించుకోదు. ఎటువంటి కష్టాన్ని అయినా ఎదురుకునే మనో ధైర్యం ఉంటే ఇటువంటి వేదనలకు మన దగ్గర తావు ఉండదు. Think positive

    ReplyDelete
  9. telugu bhashaku andam mee blog.
    Really amazing paintings and literature we can see in this blog.

    ReplyDelete
  10. గంభీర వాక్యాలతో పద్యాన్ని అలరించినప్పటికీ తెలియని బెంబేలు ఏదో దాచిన ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించింది. ఆశీర్వచనాలతో-హరినాధ్

    ReplyDelete
  11. అద్భుతమైన భావసముద్రం ...

    ReplyDelete
  12. కష్టతరమైనప్పటికీ కవితలో నిగూఢ అర్థం దాచి వ్రాసిన పదాల పట్ల మక్కువ కలిగేలా చేసి రంజింపచేసినారు.

    ReplyDelete
  13. లోతు బావి నీటి ఊటలా

    నీలి సంద్రపు అలలా

    మేఘంరాల్చిన చినుకిలా

    భూమిలోంచి విత్తు మొలిచినట్లు

    ఉప్పెనలా ఉప్పొంగే పదాల

    భావాలు ఎన్నేన్నో..

    ReplyDelete
  14. ధన్యవాదములు_/\_

    ReplyDelete
  15. కాలాన్ని భావచక్రంలో బంధించారు. శభాష్

    ReplyDelete