తలపు మరపులో..

నిన్ను తలచుకోక పరధ్యానంగా ఉండాలన్న ప్రయాసలో
అసహనంగా అరచేతిలోని మొబైల్లో ఏవేవో నొక్కుతూ..
అప్పుడెప్పుడో పంపిన పాత మెసేజీలను చెరిపేయబోయి
పదేపదే చదువుతూ జవాబు మార్చాల్సింది అనుకుంటా!

అలసిన మనసుకు మెదడుకు సేదకూర్చే ప్రయత్నంలో
అన్యమనస్కంగా అరికాళ్ళు అరిగిపోయేలా తచ్చాడుతూ..
ఎప్పుడెప్పుడో తిరిగిన ప్రదేశాల్ని తలుస్తాను మరువబోయి
చకచకా అన్నింటినీ చూసొచ్చి ఇకపై తలవకూడదనుకుంటా!

భరించలేనట్టి ఎడబాటు అగాధాన్ని పూడ్చివేసే ప్రక్రియలో
అంచెలంచెలుగా ఆలోచిస్తూ దాటే ఉపాయం వెతుకుతూ..
ఇంకెప్పుడూ మనసివ్వనంటా పుచ్చుకున్న మనసివ్వబోయి
మరలమరల మాట్లాడుదువులేని మనసుని మభ్యపెడుతుంటా!

సున్నితపొరే అడ్డుగోడాయె నీకు నాకు మధ్యన్న ప్రలోభంలో
అకస్మాత్తుగా ఏ నిర్ణయానికి రాకూడని సమాధానపడుతూ..
అప్పటికప్పుడు నాతో నేను మాట్లాడేస్తా నీతో మాట్లాడబోయి
మెల్ల మెల్లగా కరిగిన మబ్బులా కురిసి కిలకిలా నవ్వేస్తుంటా!

23 comments:

  1. చెరిపివేయాలని అనుకునే తలపులు మరింత గాఢంగా హత్తుకుంటాయి...బాగున్నాయి మీ భావాలు.

    ReplyDelete
  2. అక్షరాల మధురిమలు
    భావాల సరిగమలు

    మనసులో గమకాలు
    హృదయ రాగ తమకాలు

    మొబైల్ చాట్ హిస్టరి
    భావోద్వేగాల మిస్టరి

    జ్ఞాపకాల దొంతెరల చిరుజల్లు
    మోవిపై దరహాసాల తేనేజల్లు

    ~శ్రీత ధరణీ

    ReplyDelete
  3. ప్రేమ అంటేనే ఇంత..అందుకే ప్రేమ దోమ జాంతా నహీ

    ReplyDelete
  4. తలపుల్లో ఉన్నవారిని మరచిపోవాలి అనుకోవడం తప్పు కదండీ. మీరు వ్రాసే ప్రతీ వాక్యంలో ఏదో తెలియని మత్తు వేదన దాగిఉంటుంది.

    ReplyDelete
  5. నిన్ను తలచి మైమరిచా చిత్రమే అది విచిత్రమే అని పాడుకోండి అయితే :)
    Very nice picture andi.

    ReplyDelete
  6. మీరు రాసే వాక్యాలన్నీ మనసుని తాకుతాయి
    బొమ్మలు కూడా తగినట్లు పెడతారు.

    ReplyDelete
  7. ఎలా వస్తాయి ఇన్ని పదాలు ?

    ReplyDelete
  8. భలేగా వ్రాసి బిగిస్తారు మనసుని.

    ReplyDelete
  9. ఏమో ఏమో ఇది?
    మీకు ఏదో అయినది.

    ReplyDelete
  10. సున్నితమైన వాక్యాలు మనసు పొరల్లోకి చొచ్చుకునేలా...

    ReplyDelete
  11. మరపు కూడా అదృష్టం మేడం
    అది అందరికీ లాభించదు...

    ReplyDelete
  12. Soooooooooooooo...beautiful

    ReplyDelete
  13. భావం బొమ్మ
    రెండు జతకూడిన
    రెండు కళ్ళు.....

    ReplyDelete
  14. Simple and sweet feelings.

    ReplyDelete
  15. సున్నితపొరే అడ్డుగోడాయె నీకు నాకు మధ్యన

    ఎన్నెన్ని వర్ణాలో అన్ని భావాలు మీలో.....

    ReplyDelete
  16. మధుర భావాల సుమమాల మీ కవితాక్షరాలు

    ReplyDelete
  17. మరపులేని మీ అభిమానానికి
    పద్మ వందనాలు అర్పిత_/\_

    ReplyDelete
  18. బాధను దాస్తూ కాదు... బాధను అధికమించి నవ్వుండోయ్

    ReplyDelete