మనిషి చాలా చిత్రవిచిత్ర మిళిత స్వభావి..
రాయితో శిల్పం చెక్కి ఇసుక సౌధాలే కట్టి
లోహాపు ఆభరణాలు చేసి నిధిగా దాచుకొని
ఆకు అలముల నుండి ఔషధాలు ఎన్నో తీసి
వ్యసనాలను అలవాటు చేసుకుని ఆనందపడి
అద్దంలో తనని తాను చూసుకుని మురుస్తూ
సాటిమనిషి కూడా మనిషని మరుస్తున్నారు!
మనిషి మనిషికేమాత్రం అర్థంకాని వింతజీవి..
తాను మంచవ్వాలని ఎదుటివారిపై నేరం నెట్టి
తన కోరికలు తీరడానికి ఎదుటివాళ్ళను చెడ్డని
సంతోషాపేక్ష వేటలో వేరొకరిని బాధకు గురిచేసి
లేని వాటికై కష్టాలు కోరితెచ్చుకుని హైరానాపడి
తెలిసీ తన పతనానికి తానే పునాదులు తీస్తూ
మనుషులు మరమనుషుల్లా మారుతున్నారు!
Yes what you written is 100% right.
ReplyDeleteమనిషి స్వార్థపరుడు ఎప్పుడో అయిపోయాడు.
ReplyDeleteYes
ReplyDeleteసత్యం అక్షరాల్లో అగుపిస్తుంది.
ReplyDeleteఏం చేసినా మారడు మనిషి
ReplyDeleteమనిషి తత్వం మీ మాటల్లో బాగుంది
ReplyDeleteమీ చిత్రలేఖన ప్రపంచానికి నేను ఫిదా
I will never change :)
ReplyDeleteమనిషి తత్వం గురించి బాగావ్రాసారు .
ReplyDeleteమనిషిని వారి మనస్తత్వాన్ని చడవడం ఎవరితరం చెప్పండి. మాహా మహులకే అది సాధ్యం కాలేదు. మనం ఎంతని.
ReplyDeleteప్చ్.. మనిషి మేధస్సు కే కృతిమాన్ని మనిషే కనిబెట్టి పేటెంటు పొందటానికి ఆపసోపాలు పడుతు ఫజ్జి లాజిక్ తో బూలియన్ అల్గారిథం, ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్, ఆగుమెంటెడ్ బ్రెయిన్ వేవ్, వర్టువరల్ టెలిపోర్టేషన్, ఆర్టీఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ లతో, స్మాట్రానిక్స్ వరకు వచ్చి పరిశోధిస్తు ఉన్నపటికీ.. సదరు మనిషి మరో మనిషి గుణగణాలను, భావోద్వేగాలను, మానసిక స్థితిని, రాగద్వేషాలను కంటబెట్టటం సులువుగాలేదు. ఏదేమైనా ఎవరి భావాలు వారివి. తత్వ బోధకు తాత్వికతకు, తర్కానికి, ఆలోచన విధానానికి ప్రతి మనిషి యునిక్ సోషల్ బీయింగ్.. బట్ కోవిడ్ ౧౯ మూలానా ఎవరికి వారే సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ కుటుంబానికి, కుటుంబ సభ్యులకు కేటాయిస్తు నేటికి దాదాపుగా ఏడు నెలలు. (కోవిడ్ నామ ఉగాది గా శార్వరి ప్చ్ ప్చ్ మార్చ్ ౨౨~౨౫, ౨౦౨౦ ౼ ఎఫెక్టీవ్ వ్యాక్సిన్ వచ్చే దాక). అప్పటి దాక ఎక్కడి మనషులక్కడే జిప్ జ్యాప్ దప్పళం పిడత.
ReplyDeleteమనిషి
ReplyDeleteమేదస్సు
మనసు
మనుగడ
అంతా మెకానికల్
Manishulu kshanam oka chittamai maruthoo untaaru. manam daniki anugunam maraka tappani paristhitulu Padmarpita,,,mee aalochanalu kotta pandhaalo sagutuntayi.
ReplyDeleteReality ki daggara undi.
ReplyDeleteమార్పు సహజం అంది మనిషిలో అధికమే ఉంది. స్వార్థం లేని మనిషి మనుగడను సాగించలేడు. ఆలోచనాత్మక కవితను వ్రాసారు.
ReplyDeleteసంతోషాపేక్ష వేటలో వేరొకరిని బాధకు గురిచేసి
ReplyDeleteTrue and good words
మనుషులు మారిపోయిన బంధాలు వీడిపోయినా వారు వీడిన జ్ఞాపకాలు పదిలంగా మనతోనే ఉంటాయి.
ReplyDeleteఇక మని అంటారా ఈ యాంత్రిక జీవితంలో మెకానికల్ లైఫ్ తప్పనిసరి కద.
అందరి అభిమానానికి నా అభివందనములు.
ReplyDeleteమనిషంతే మనశ్శాంతి గా ఉండడు
ReplyDelete