నిబ్బరమా నీవెక్కడ!!?

నిర్వేదాన్ని జీర్ణించుకుని సన్యాసినిగా మారిపోయి 

నిర్జీవత్వాన్ని ఒంటినిండా వస్త్రంగా చుట్టేసుకున్నా
మైనంలా కరిగే మనస్తత్వం ఎప్పుడూ మారకుంది!

వ్యక్తం చేయలేని అంతర్గత భావాలు పదాలైపోయి
గంభీరత్వాన్ని ఆవేదనాస్త్రాలతో తూట్లుచేసుకున్నా
బహిరంగం కాని లావా లోలోపల ఉప్పొంగుతుంది! 

నిర్భాగ్యపు ఆశ్రయంలేని ఆశయాలు చెదరిపోయి
వేధించే కోరికలకు మంటపెట్టి బూడిద చేసుకున్నా
ఎద సర్దుకోక ఈసురోమని తననితాను తిట్టుకుంది! 

వలసొచ్చిన అభయాస్తాలు పక్షవాతంతో పడిపోయి
సవ్యంగా ఏంజరగవని తెలిసేలాచేసి ఏమీ చెప్పకున్నా
ఆశ చావని ఊపిరి తనమదిని తానే తడుముతుంది! 

రూపుదిద్దుకున్న శిల్పం నేలకొరిగె ఉలి విరిగిపోయి
క్రిందపడ్డ శిలకు చెదలుపట్టె రాయికి పట్టవనుకున్నా 
నిబ్బరంగా ఉన్న మంచుపర్వతం లోన కరిగిపోతుంది! 

30 comments:

  1. ఈ నిరాశా నిస్పూర్తి నీకేల?
    ఆనందంగా ఉండు నువ్వు అబల కాదు సమల.

    ReplyDelete
  2. Happy Dasara to you and your family andi.

    ReplyDelete
  3. నిబ్బరానికి నిర్వచనం మీరు
    అలంటిది మీ వాక్యాలు వ్రాసి
    ఇలా నీరసపడ్డం బాలేదండీ.

    ReplyDelete
  4. మైనమై కరిగి పోయే జీవితాన మంచితనం వెలుగు వంటిది
    మోడుబారిన కొమ్మ శిశిరాన చివురులే తొడిగే వసంతాన
    ఆశ నిరాశ నడుమ నిరాడంబరత తోడ్పాటు
    నిటూర్పుల సెగలపై నిబ్బరతే మాపకం

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  5. అనుభవసిరుల మూట

    ReplyDelete
  6. మీరు అడగవలసిన ప్రశ్న కాదు

    ReplyDelete
  7. నీరుకార్చే వాక్యాలు ఎందుకు?
    నిరాశ మనిషిని ఎప్పుడూ సంతోషంగా ఉండనివ్వదు
    డశరా పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుంటుంబానికి

    ReplyDelete
  8. వలసొచ్చిన అభయాస్తాలు పక్షవాతంతో పడిపోయి ఇలా కొత్త ప్రయోగం చేయడం మీ తరువాతే...
    చాలా మంచి కవితను అందించారు.

    ReplyDelete
  9. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు

    దిగులుపడి హైరానా పడకెప్పుడు

    నిన్ను వీడడు మరువడు నీవాడు

    నీకు తోడు నీడా నీ జతగాడు..

    ReplyDelete
  10. కనబడితే మీరు పంచండి ha ha ha ha ha

    ReplyDelete
  11. నీలోనే దాగి ఉన్నది చూసుకో..
    very nice padma

    ReplyDelete
  12. Meeku gunde nibbaram tho avasaram ledu.

    ReplyDelete
  13. నిర్భాగ్యపు ఆశ్రయంలేని ఆశయాలు..nirasa vaddu.

    ReplyDelete
  14. మీ అభ్యుదయ భావాలే కాకుండా మిమ్మల్ని మరో కోణంలో ఆవిష్కరించినట్లు ఉంది బ్లాగ్చూస్తుంటే చదివి తెలుసుకోవలసినవి మరెంతో ఉంది.

    ReplyDelete
  15. వలసొచ్చిన అభయాస్తాలు పక్షవాతంతో పడిపోయాయి...అద్భుతం మీ భావాలు.

    ReplyDelete
  16. ముందుకు వేసిన అడుగు నిరుత్సాహంతో వెనక్కు వేయకండీ. పదండి ముందుకు పై పైకి

    ReplyDelete
  17. prati line fantastic narration.
    very nice...keep it up.

    ReplyDelete
  18. గుండె నిబ్బరమే అవసరం అనుకుంటే ఎక్కడైనా దొరుకుతుంది కానీ దానితోపాటు మనసు మనం చేసే పనులను కూడా నిర్దేశించే శక్తి అవసరం ఎంతో అవసరం అనుకుంటాను.
    మంచిపోస్ట్ నూతన పదజాలంతో ఆవిష్కరించారు.

    ReplyDelete
  19. Nibbaram Manan kaliginchukovali antaru adi vetigithe marketlo dorukadu 😀😃

    ReplyDelete
  20. Meeru rasinavi andariki connect avutayi. Nice madam.

    ReplyDelete
  21. అడుగు ముందుకు వేసి ఆకాశం వైపు చూడండి...అక్కడేమైనా దాకుంది ఏమో :)

    ReplyDelete
  22. నిర్వేదాన్ని జీర్ణించుకుని సన్యాసినిగా మారిపో-ఇదేమి వింతనో ఏమో?

    ReplyDelete
  23. మీ అందరి అభిమాన స్పందనలే నా ఈ అక్షర ఆకృతులకు స్పూర్తి, మీరు చదివి సరిచేస్తారన్న గుండె నిబ్బరం. అందరికీ పరమార్పిత శతకోటివందనములు _/\_

    ReplyDelete
  24. వలసొచ్చిన అభయాస్తాలు పక్షవాతంతో పడిపోయి...గంభీరమైన అభివ్యక్తం.

    ReplyDelete
  25. నిలువెత్తు నిబ్బరానికి నిదర్శనం

    ReplyDelete
  26. ఏమి ఈ విస్ఫోటనా వాక్యాలు...

    ReplyDelete