ఎవరికి చెప్పాలి?

మిత్రులే కదా అని పదిమందితో చర్చించకు.
నీ ప్రేమను గూర్చి నలుగురితో మాట్లాడకు..

వాళ్ళు నిన్ను హేళన చేస్తారేమో!!!


సూర్యచంద్రులకి నీ వేదనను వివరించకు
పరిష్కారం కొరకై వాళ్ళని ప్రాధేయపడకు..

విశ్వమంతా వారై విసిగి వేసారినారేమో!!!


చీకటికి నీ గోడుని వెళ్ళబుచ్చకు

అంధకారమేదో దారి చూపుతుందనుకోకు..
రేయికి తన వెలుగే తనకి కరువైందేమో!!!

సాగర కెరటాలని పలకరించకు

ఆలోచనా తరంగాలలో విహరించకు..

సుడిగుండాల్లో నిన్ను చుట్టేస్తాడేమో!!!


ఆకాశంవైపు ఆశగా చూడకు

ప్రేమలో సహాయ పడమని కోరకు..

చిరాకుతో నిన్ను ఉరిమి చూస్తాడేమో!!!


చెలియ కంటపడిన వేళ మౌనం వహించకు
మౌనంతో తనని వేధించకు..
నిజమైన ప్రేమైతే నీకే దక్కుతుందేమో!!!

16 comments:

  1. మిత్రమా దీనిని సాధారణ బ్లాగులా చూడకు.
    వచ్చినా చెత్త కామెంట్ వెయ్యకు..
    మంచి కామెంట్ అయితే పదికాలాలుపాటు దాచుకోవచ్చేమో!!! :-P

    ReplyDelete
  2. పద్మార్పితగారు.... ఎవరు ఎవరికి ఏమని చెప్పినా... నాకు మాత్రం నచ్చేసింది.

    ReplyDelete
  3. kalar ful blog!
    mii kavitalu baagunnvi.

    ReplyDelete
  4. ఎక్కడో మీ కవిత్వంలో చిన్న చిన్న గ్యాప్ లు వుంటున్నాయి. మీ భావాలలో వున్న వేగం మాటల్లోకి రావడం లేదు. కాస్త communication skills అలవర్చుకోవాలేమోఅన్పిస్తోంది.

    ReplyDelete
  5. ఎక్కడో మీ కవిత్వంలో చిన్న చిన్న గ్యాప్ లు వుంటున్నాయి. మీ భావాలలో వున్న వేగం మాటల్లోకి రావడం లేదు. కాస్త communication skills అలవర్చుకోవాలేమోఅన్పిస్తోంది.

    ReplyDelete
  6. ఇంకొంచం చిక్కదనం కుదిరితే చక్కదనం అమిరేదేమో పద్మార్పిత?

    ReplyDelete
  7. దారం మిస్ అయిన ముత్యాల హారంలా ఉంది. పైన కొందరు చెప్పిన విషయమే నేను కొంచెం కవితాత్మకంగా చెప్పాను. అంతే తేడా!

    ReplyDelete
  8. సృజన గారి కామెంట్ కి డిటో

    ReplyDelete
  9. మొదటి పేరా నిజమే.....అర్ధం చేసుకోపోగా ,హేళనకు గురయ్యే ప్రమాదమేంతో ...

    ReplyDelete
  10. బాగుంది....
    నేను 'ఎవ్వరికీ చెప్పను'(http://viraamam.blogspot.com/2007/08/blog-post.html) అని భీష్మించుకుంటే, మీరు 'ఎవరికి చెప్పాలి?' అని ప్రశ్నిస్తున్నారన్న మాట!!

    ReplyDelete
  11. Dear Padma garu chala bagundi nesthama keep it up
    Best of luck frnd
    Harish

    ReplyDelete
  12. @ పానీపూరీలో కాస్త ఘాటెక్కువైనా పసందుగా ఉన్నది.... ధన్యవాదాలు!
    @ సృజన,శిరీషశ్రీ,హరేకృష్ణ,చిన్ని,విహారి,హరీష్ గార్ల అభిమానానికి కృతజ్ఞతలు!
    @ సిరాకిపుత్రగారు గ్యాపులు రాకుండా మిమ్ము మెప్పించడానికి ప్రయత్నిస్తానండి!
    @ ఉషగారు ఈసారి మీకు చిక్కనైన పాలతో చక్కనైన కాఫీ(మీ అంత బాగా కుదరక పోవచ్చు)రెడీ!
    @ మహేష్ గారు బంగారు తీగతో ముత్యాలహారాన్ని గుప్పే అంత గొప్పదాన్ని కాను...
    కాని పట్టు దారంతో గట్టి హారం నేయ యత్నిస్తాననండి!
    *** స్పూర్తిదాయకమైన సూచనలకై సదా ఎదురు చూస్తుంటాను....
    పద్మార్పిత

    ReplyDelete
  13. మొదటి స్టాంజా అద్భుతం. చాలా సందర్భాలలో నిజం అది. అందులోనూ అమ్మాయిలకి ఆ బాధ ఎక్కువ.

    @సూర్య చంద్రులు,

    పాపం కదా ;-)

    మీ బ్లాగుని ఇంతకు ముందు చూసినట్లు గుర్తు లేదు. కానీ చాలా సార్లు విన్నాను. ముఖ్యంగా బొమ్మల గురించి. అద్భుతం అమోఘం అని మోసం చెయ్యను కానీ, నేను విన్నంతైతే నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. బొమ్మలు మాత్రం beyond my feelings.

    http://thinkquisistor.blogspot.com/2009/05/blog-post.html

    ReplyDelete
  14. Where did u get those pics? Net r drawn?

    Any ways nice selection/ drawn :-)

    ReplyDelete
  15. గీతాచార్య గారూ!!! నా బ్లాగ్ కి విచ్చేసి, మెచ్చినందుకు ధన్యవాదాలండి.
    బొమ్మలు కొన్ని వేసినవి మరికొన్ని నెట్ నుండి కలెక్ట్ చేసినవి. సాధ్యమైనంత వరకు వేయడానికే ప్రయత్నిస్తాను.Basically painting is my main hobby...once again thanks for your compliment!!!

    ReplyDelete