జలకన్యపై కవితాస్త్రము సంధించ నేనెంతటిదానను!
ఉషగారి కోరికను నేను ఎటుల కాదని అందును!
మరువపు సువాసనలతో నేను మరులుగొలుపలేను!
స్వీకరించుము పద్మ అర్పిస్తున్న జలపుష్పమును!
నీటిలో ఏమున్నది నీలి రంగు తప్ప అనుకున్నది ఆ మీనఉషగారి కోరికను నేను ఎటుల కాదని అందును!
మరువపు సువాసనలతో నేను మరులుగొలుపలేను!
స్వీకరించుము పద్మ అర్పిస్తున్న జలపుష్పమును!
ఒడ్డున ఉన్న నీటి బుడగపై రంగుల తళుకులు చూసి మురిసినది జాణ
తీరము చేరిన మీన ఎటుల జీవించునో ఈ ప్రపంచాన్న!
ఇసుక రేణువుల తాకిడికి పగిలిన బుడగను చూసి భోధపడినది క్షణాల్లోన
ఉషాకిరణాలతోనే దానికి అన్ని రంగుల హంగులని తెలుసుకున్నది జాణ
స్వచ్ఛమైన స్వాతిముత్యములెన్నో కదా మీనపు సామ్రాజ్యాన్న!
దూరపుకొండలు నునుపులే అని తలచినది మదిన
ఉక్కిరి బిక్కిరై సాగరము వైపునకు ఉరికినది జాణ
ముత్యమును మించిన రంగేలననుకున్నది మీన తన అంతరంగాన్న!
:-)
ReplyDeletePapam meena..... enni kastalo kadha....nice...
ReplyDeleteమీదైన రీతిలో ఒడ్డున పడ్డ చేప మనసు చక్కగా ఆవిష్కరించారు... పిచ్చి తల్లి వెనక్కి వెళ్ళి పోయింది కదా అమ్మయ్య...
ReplyDeleteఫొటో బాగుంది,కవిత మరీ మరీ బాగుంది
ReplyDeleteచాలా బాగా చెప్పారు.
ReplyDeleteకవిత చాలా బావుంది.
ReplyDeletexlnt
ReplyDeleteoh my oh my friend you are so sweet. Thank you thank you and thank you so very much!!!!!!
ReplyDeleteవర్ణాలన్నిటికీ మూలం శ్వేతం అనీ ఆ తెలుపు నుండి రంగుల ఆవిష్కరణకి మూలం ఉషాకిరణమని భలే బాగా చెప్పారు. మీకు మీరే సాటి.
నిజంగా చాలా బాగుంది పద్మార్పితగారూ.
ReplyDeleteకవిత బాగుంది....
ReplyDeleteబొమ్మ అదిరింది....
నేను మీ బ్లాగుకి కొత్త అండి
ReplyDeleteనాకు మీ బ్లాగు చాలా బాగా నచ్చింది.
అవునండి చాలా చక్కగా మీ మాటను జలకన్య నోట పలికించారు
దూరపు కొండలు నునుపు వాటికై ఆశ పడిన వారి ఆశలు బుడగ లా పగిలిపొవాల్సిందే
చాలా రోజుల తరువాత మీ కవిత చదివానండి....మనసు హాయిగా ఉంది!
ReplyDeleteబొమ్మ కవిత ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి పద్మార్పిత గారు. చాలా బాగున్నాయి.
ReplyDeleteచేతిలో ఉన్నది వదిలేసి
ReplyDeleteచెంత లేని దానికై వెంపర్లేల ?
చాలా బాగుంది.
మరువం జలపుష్పాభిషేకానికి మీరందించిన జలపుష్పం మరింత ని౦డుదనాన్నిస్తు౦ది.ధన్యవాదాలు.
ReplyDelete'తెలుపు ' లోని గొప్పతనం ఎంతబాగా వర్ణించారు. నిజంగా ఇది చాలా స్వచమైన ఆణిముత్యం. చక్కటి వర్ణనలు.
ReplyDeletesuper..!!బాగా రాసారు.
ReplyDeleteUr Exlent
ReplyDelete