నీ అడుగులో అడుగునై ఏడడుగులు నడవాలని కోరికంట
నీ తోడు నీడనై నీతోటి కలసి జీవించాలి నూరేళ్ళంట
నీ హృదయపు లయనై నీ పెదవులపై చిరునవ్వునవ్వాలనుకుంట!
కంటిది కనురెప్పల వంటిది మన అనుబంధమంట
కనురెప్పలాడకపోతే కొద్దిక్షణాలు జలజల నీళ్ళురాలతాయి కంట
కంట నలుసు పడితే కనురెప్పలు విలవిల కొట్టుకుంటాయంట!
నీ ఎదుట నా మనసుని తెరచి ఉంచినానంట
నీకై మరణించి కూడా కనులు తెరచినానంట
నీవు ఇంకా వేచి చూడమనడంలో అర్థమేలేదంట!!
నీ తోడు నీడనై నీతోటి కలసి జీవించాలి నూరేళ్ళంట
నీ హృదయపు లయనై నీ పెదవులపై చిరునవ్వునవ్వాలనుకుంట!
కంటిది కనురెప్పల వంటిది మన అనుబంధమంట
కనురెప్పలాడకపోతే కొద్దిక్షణాలు జలజల నీళ్ళురాలతాయి కంట
కంట నలుసు పడితే కనురెప్పలు విలవిల కొట్టుకుంటాయంట!
నీ ఎదుట నా మనసుని తెరచి ఉంచినానంట
నీకై మరణించి కూడా కనులు తెరచినానంట
నీవు ఇంకా వేచి చూడమనడంలో అర్థమేలేదంట!!
వినమ్రతతో.....
నా టపాలని ఇష్టంగా చదివినవారు..
అయిష్టంగా భృకుటిని ముడివేసినవారు..
ఆహా! ఓహో అని పొగిడినవారు..
వ్యాఖ్యలతో వెన్నుతట్టినవారు..
అర్థం కాక చదవక వదిలేసినవారు..
తప్పులను ఒప్పులుగా సరిచేసినవారు..
ప్రేమా పైత్యమా అని అనుకున్నవారు..
పిచ్చిరాతలు మనకేల అని తలచినవారు..
ఎవరైనా అంతా నావారు.....ఈ బ్లాగ్ మిత్రులు..
మీ అందరికీ నా అభివందనాలు...
అర్పిస్తున్నది నూరవటపాతో హరిచందనములు...
పద్మ ఆశిస్తున్నది మీ మన్ననలతో కూడిన దీవెనలు...
అయిష్టంగా భృకుటిని ముడివేసినవారు..
ఆహా! ఓహో అని పొగిడినవారు..
వ్యాఖ్యలతో వెన్నుతట్టినవారు..
అర్థం కాక చదవక వదిలేసినవారు..
తప్పులను ఒప్పులుగా సరిచేసినవారు..
ప్రేమా పైత్యమా అని అనుకున్నవారు..
పిచ్చిరాతలు మనకేల అని తలచినవారు..
ఎవరైనా అంతా నావారు.....ఈ బ్లాగ్ మిత్రులు..
మీ అందరికీ నా అభివందనాలు...
అర్పిస్తున్నది నూరవటపాతో హరిచందనములు...
పద్మ ఆశిస్తున్నది మీ మన్ననలతో కూడిన దీవెనలు...
నీ హృదిలో కవనాన్ని
ReplyDeleteకరమున కలలా ఒలకించిన
మంజుల కవితార్పిత పద్మార్పిత
నీ తోడుగ నడచిన ఈ కవితలు
నీ హృదయ లయల నాట్యములు గావా?
పెదవులు దాటిన ప్రతిమాటా
జీవన గమన సూత్రము కాదా!
కంటి పాపగ కనులలో దాగిన నీ ప్రతిబింబాన్ని
ప్రతి కన్నీటి బొట్టులో కరిగి జాలువారిన మానవతా మంత్రాన్ని.
శత కవితల వినమ్రశీలి
హరిచందన మాటకారి
కవితా స్నేహిత కు
శత టపా శుభాకాంక్షలు.
ఆహ్లాదకరమైన కవిత, వార్త. శత టపా/రేకుల పుష్పం మా పద్మార్పితకి అభినందన అర్పితం. అవునూ ఇంతకీ ఈ బ్లాగ్ మిత్రుల విభజనలో నన్నెందులో వేసావమ్మాయ్ ;) శత సహస్రం చేరాలి అతి శీఘ్రంగా....
ReplyDeleteమేలో వ్రాసుకున్న నా కవితలు ఎన్నిసార్లు?, మరో ప్రయత్నం! గుర్తుకు వచ్చాయి. నిరీక్షణకి అంతులేకపోయినా అందులోని ఆనందం ఒకటుంటుంది. నాకది బాగా విదితం.
భాస్కర్ గారు కొన్ని భావాలని వ్యక్తపరచడానికి పదాలు రానప్పుడు ఆశ్రయించే ఆంగ్ల పదం THANKS.(మీరన్న మాటలనే మలచినాను క్షమించండి).
ReplyDeleteఉషగారు....ధన్యవాదాలండి! విభజన ఏమిటీ, నా ప్రతి కవితలో మీరున్నారు. అలా నన్నొదిలి వేరైపోతారా?
కవితలంటే దూరంగా పారిపోయే నేను మీ బ్లాగును రోజుకు ఒక్కసారైనా చదువుతుంటాను, మీ పదాల్లో ఎదో ఫీల్ నన్ను లాక్కొస్తుంది ఇక్కడకు, of course i never dropped a comment :)
ReplyDeletekeep writing..
ReplyDeleteఅయ్యో..ఆలస్యంగా మచ్చిక చేసినా మరి కొన్నిటిలోనైనా నే లేనా..?
ReplyDeleteఅభినందనలు...మీరు మరిన్ని మంచి కవితలు మా కందించాలని ఆకాంక్షలు...
Congrats for 100th post..
ReplyDeleteKavita baagundi. Congrats.
ReplyDeleteపద్మార్పిత గారు,
ReplyDeleteమీరింకా ఇంకా కవితలు రాస్తూ వుండాలని కొరుకుంటూ మీ నూరవ టపాకు అభినందనలు .
"నీకై మరణించి కూడా కనులు తెరచినానంట
ReplyDeleteనీవు ఇంకా వేచి చూడమనడంలో అర్థమేలేదంట!!"
ఆర్దతతో కూడిన మీ కవిత, మనసును కదిలించింది. నేను మీ బ్లాగ్లో గతంలో వ్యాఖ్య రాసిన గుర్తు లేదు. మీ కవితాశ్వాన్ని పరుగులెత్తించండి.
శతటపోత్సవ శుభాకాంక్షలు పద్మగారు..
ReplyDeleteపదులు వందలై , వందలు వేలై ,వేలు లక్షలై ,బ్లాగ్లోకపు చరిత్రలో ''షేర్ ఖాని '' లాగ చిరస్తాయి గా నిలిచి పోవాలి. రవి అస్తమించని బ్లాగ్ సామ్రాజ్యపు మకుటం లేని మహారాణి గా వెలుగొందాలి
ReplyDeleteచదువుతుండగానే వంద... అభినందనలు.. రాస్తూనే ఉండండి...
ReplyDelete@రాఘవ్, మేధ,సునీతగార్లకి ధన్యవాదాలండి.
ReplyDelete@తృష్ణగారు అలా అంటే ఎలా....మీరు నేను వినే హిందీ పాటల్లో, ఘజల్స్ లో భాగస్వాములు కాదా, మీరు నా భావాల్లో లేనంటే ఎలా? ధన్యవాదాలు.
@సి.బి.రావ్ గారు నా బ్లాగ్ కి విచ్చేసి స్పందనలిడిన మీకు కృతజ్ఞతలు.
@రవిగారి వేడి కిరణాల వాడి ఆశీస్సులుగా మారినందుకు ధన్యవాదాలు!
@మాలకుమార్ గారికి, జ్యోతిగారి, మురళీగారికి కూడా ధన్యవాదాలండి.
అభినందనలు.
ReplyDeleteఅభినందనలు పద్మ గారు...
ReplyDeleteఇలాగే మరిన్ని టపాలతో దేదీప్యమానంగా వెలిగిపోండి...
అన్నట్టు చెప్పటం మరిచా...మీరు పెట్టే ఫోటోలు చాలా బాగుంటాయండీ..
ఓ పద్మార్పితమా!
ReplyDeleteనా ప్రియ కవితాపుష్పమా!
మా అభినందనలు అందుకోవమ్మా!
బొమ్మ చాలా సజీవంగా వుంది.
ReplyDeleteCongrats Madam.
ReplyDeletecongrats padmarpita
ReplyDeleteనీ హృదయపు లయనై నీ పెదవులపై
ReplyDeleteచిరునవ్వు నవ్వాలనుకుంట !
చాలా బాగుంది. మంచి ఇమేజెస్
స్పందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నమసుమాంజలి!
ReplyDeleteఅభినందనలు :)
ReplyDeleteనూరు రేకుల పద్మం వికసించిన రోజిది
ReplyDeleteకో కోటి అభినందనలతో సుభాశిస్సులతో
అవ్వాలొక శత సహస్ర కమలం
అందించాలి శ్వేత వర్ణాల ఇంద్ర ధనస్సుల కవితా లోకం...
అభినందనలు అమ్మయీ... :-)
మనఃపూర్వక అభినందనలు, దైనందిన జీవిత చట్రంలో మీరన్న 40 యేళ్ళ బిజీలో పడి చూడలేకపోయినందుకు క్షమాణలు కోరుతూ శత సహస్ర కవితా పద్మాలు వికసించాలని ఆశిస్తూ...
ReplyDeleteపద్మార్పిథ గారు ముందుగా అందుకొండి నా శుబాకాంక్షలు
ReplyDeleteమీరు ఇలాగే వెయ్యి తపాలు పూర్థి చెయాలని ఆశిస్థున్నను.
www.tholiadugu.blogspot.com
congrats Padmarpita garu.
ReplyDeleteపద్మర్పిత గారు. మీ కవితలన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మీ బొమ్మలు కూడా చక్కగా సెలెక్ట్ చేసి పెడ్తారు. మీకు నేను అభిమానిని. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో మీరు రాయాలని నా కోరిక. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ReplyDeletecongratulations.. Keep rocking...
ReplyDeleteCongratulations padma garu. మీ 100 వ కవిత కూడా మీకు చెప్పకుండా నా బ్లాగ్ లో save చేసేసుకున్నాను తెలుసా !
ReplyDeleteOh well congrats
ReplyDeleteకాస్త ఆలశ్యమైంది మిత్రమా ....
ReplyDeleteముకుళించకు పద్మమా ....
శుభాకాంక్షలు అందుకొనుమా
ద్విశతమ్ దిశగా
పయనించు వేగంగా ..
లొయ లొతులనైనా చూడచ్చు గాని...
ReplyDeleteఅగాధం అంతు చూడడం నిజంగా చాలా కష్టం
ఆ ధైర్యమే చెస్తూ ఉన్నా , ముందుకు సాగు తు ఉన్నా...
తొవ్వే కొద్ది లోతు పెరుగుతూ ఉంది...
(ఆడ వారి మనసులా వుంది)
సాహస యాత్ర లా ఉంది... థ్రిల్ గా వున్నది..
మీ బ్లాగ్ ని చాలా సేపు చదివాను....
ఇక ఫాలో అవుతాను...
ఇన్ని రోజులూ చాలా మిస్సయ్యాను...
నిజంగా ఆడవారి మనసులా ఉంది..
మంచి బ్లాగ్ కి - శుభాకాంక్షలు
ధన్య వాదాలు...
--సత్య..