కృష్ణమ్మ కరుణించవమ్మ!!

కృష్ణమ్మ నీకు ఇంత అలుకేలనమ్మ!
కష్టానష్టాలు పడుతున్న మీ పిల్లలమమ్మ!
కరుణాకటాక్షాలని మా పై చూపించవమ్మ!
శాంతించిన నీ కౌగిలిలో కాస్త సేదతీరనీయవమ్మ!
కరకట్ట బిడ్డలమైన మాకు కన్నీళ్ళనే మిగల్చకమ్మ!
పరవళ్ళు చూసి మురిసే మాపై ఉరవళ్ళు వద్దమ్మ!
ఆగ్రహిస్తే నీ పైనే ఆక్రోశించే అభాగ్యులమమ్మ!
ఆలంబనకై మరల నీ దరిచేరే ఆశాజీవులమ్మ!

10 comments:

  1. బాగుందండీ ... కవిత, కవితకు మించిన పద్మార్పిత అభ్యర్థన.. రెండటికీ మించినా ఆ బొమ్మ

    ReplyDelete
  2. బావుంది మీ స్పందన

    ReplyDelete
  3. mee prardhana vinipinchindhanukuntanu.

    ReplyDelete
  4. మంచి మనసుతో చేసే అభ్యర్థన తప్పక ఆలకింపబడుతుంది

    ReplyDelete
  5. hi padmarpita garu...
    meeru enduku anata gap echi rastunaru??
    mee kavitallani apadu andi elaga...
    carry on...
    keep rocking...
    u pass on a gr8 msge to ppl xprssing ur views..
    yevaru chadivina chadavaka poyenaa jst keep writing..

    ReplyDelete
  6. కృష్ణమ్మా, సాగరానికి తరలి నీ నదీనద జీవ జలాలు వ్యర్థం కాకూడదనే కదూ, ఆనకట్టలు కట్టి సార్థకత తెచ్చి మా కడుపులూ నింపుకుంటున్నాము? జీవనదివనే కదూ, పుష్కరానికొకమారు నీకు నివేదనలు. నిత్యం సంభారాలు సమర్పిస్తున్నా ఎవరి మాట విన్నావు? ఎమని అపోహ పడ్డావు? ఉప్పెనగా ముప్పు తెచ్చావు? ఇకనైనా ఆగి ఓమారు చూడు, నీది కాని ఈ నైజాన్ని విడనాడు..

    ఏనాడో నీ కొరకు వ్రాసిన కవితంటి
    http://maruvam.blogspot.com/2009/05/blog-post_30.html

    కవితలల్లుకుంటూ నువ్వూ నాతో గళం కలుపు, మానవ మనుగడకి తోడవ్వు. వింటావు కదూ ఈ విన్నపం.

    ReplyDelete
  7. కృష్ణమ్మ దయ తప్పకుండా దొరుకుతుంది. తనమీద నమ్మకం పోగొడితే ఎలా! శాంతించి కరుణ చూపించక పోతే ఎలా! సామాన్య ప్రజలకి తనే దిక్కని ఆ అమ్మకి తెలియదా! ఈ ఉపద్రవానికి మూల కారణాలు తెలుసుకోమని మనల్నే అడుగుతోంది.

    ReplyDelete
  8. కృష్ణమ్మ కరుణించినట్లుందే!
    ఏమైపోయారండి ఇన్ని రోజులు?

    ReplyDelete
  9. padmarpita.. garu.. mee..kavitalu.. abtutamga.. unnai....

    plz.. konni.. kavitalu.. naku..msg chestara...


    na id...

    venkat.konkathi@gmail.com

    ReplyDelete