అవి బ్రహ్మ సృష్టికర్తగా కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు......
మొదటి రోజు శుభసూచకంగా గోవుని సృష్టించి, నీకు అరవై ఏళ్ళ ఆయువుని ప్రసాదిస్తున్నాను. ఎండని వానని చూడక కష్టపడి రైతుకి అండగా వుండి అవసరానికి అతని ఆకలిని నీ క్షీరముతో తీర్చు అని సెలవిచ్చాడు.
ఆవు అయ్యా! ఇలా గొడ్డు చాకిరీ చేస్తూ అరవై ఏళ్ళు బ్రతకాల? నాకు ఇరవై ఏళ్ళు చాలు భగవంతుడా, మిగిలిన నలభై ఏళ్ళని నీవే తీసుకోమని మనవి చేసుకున్నది. బ్రహ్మ సరే అన్నారు.
రెండవరోజు శునకాన్ని సృష్టించాడు, దానికి ఇరవై ఏళ్ళ ఆయువుని ప్రసాదించి నీవు ఇంటి ద్వారానికి కాపలా కాస్తు వచ్చే పోయేవారిని చూసి మొరగమని సలహా ఇచ్చారు.
కుక్క, మహాప్రభో! ఈ కాపలా ఉద్యోగం ఇరవై ఏళ్ళెందుకు పదేళ్ళకి కుదించమని మొరపెట్టుకుని మిగిలిన పదేళ్ళు తిరిగి ఇచ్చేసింది. బ్రహ్మ సై అన్నారు.
మూడవరోజు మర్కటాన్ని మహా మోజుతో మలచి నీకు ఇరవై ఏళ్ళ ఆయువుని ఇస్తాను నీ కోతి చేష్టలతో అందరినీ అలరించమన్నాడు ఆ బ్రహ్మ.
కోతి తన కోతిబుర్రతో ఆలోచించి, అయ్యా నాపై మీకు ఇంత అభిమానము వద్దు కాని నాకు కూడా కుక్కకి ఇచ్చినంత ఆయువునే ప్రసాదించండి. మిగిలిన పదేళ్ళు నేను కూడా మీకే ఇచ్చేస్తున్నానంది. బ్రహ్మ వలదు అనలేక ఔను అన్నారు.
నాల్గవరోజు నవ్వుతూ నరుడిని రూపొందించాడు. ఈసారి నరుడి నోట "నో" అనిపించుకోరాదని, నరుడా నీవు ఏపని చేయకు హాయిగా తిని, ఆటలాడుకుని ఆనందించి నిద్రించు, నీకు ఇరవై ఏళ్ళు ఆయువుని ప్రసాదిస్తున్నాను పండగ చేసుకో! అని అలసి కాస్త విశ్రాంతికై ఒరిగిన వేళ......మానవుడు మాహా మేధావి, బ్రహ్మాజీ! ఒక విన్నపము ఈ జీవితానికి ఇరవై ఏళ్ళు ఏం సరిపోతాయి చెప్పండి? తమరు కాస్త పెద్దమనసుతో నా ఇరవైకి గోవుగారి నలభై, శునకానివి పది, కోతివి పది కలిపితే మొత్తం ఎనభై ఏళ్ళు మీ పేరు చెప్పుకుని బ్రతికేస్తాను అన్నాడు. బ్రహ్మగారు మానవుని మర్యాదకి మెలికలు తిరిగి తధాస్తు అన్నారు.
అదండీ అప్పటి నుండి మానవుడు.....మొదటి తన ఇరవై ఏళ్ళు ఏపని చేయకుండా తిని తొంగుని తరువాత నలభై ఏళ్ళు గొడ్డు చాకిరీ చేసి పదేళ్ళ తన కోతి చేష్టలతో మనవళ్ళని మనవరాళ్ళని నవ్వించి మిగిలిన పదేళ్ళు ఇంటికి కాపలా కాస్తున్నాడన్నమాట!
(ఇది సరదాగా నవ్వుకోవడానికి చేసిన ప్రయత్నమే కాని ఎవ్వరినీ భాధ పెట్టాలని మాత్రం కాదని మనవండి... చిత్తగించవలెను)
బావుంది... మర్కటం తరువాత శునక జననం అనుకోవాలేమో, ఆర్డర్ ప్రకారం చూస్తే!
ReplyDeletewonderful imagination
ReplyDeleteఎంత బావుందో....భలే రాసారండీ .
ReplyDeletegood one
ReplyDeleteఅప్పుడప్పుడూ ఇలా ఎవరైనా గుర్తుచేయ్యకపోతే ఎలా ? మనమేవరమో మర్చిపోతాం. Any way .అభినందనలు.
ReplyDeleteసరే మరి నేను విన్న కథ [నా స్వంతం కాదని గమనిక]. మనిషి, గాడిద, కుక్క, కోతి - ఈ నాలుగింటినీ సృష్టించాక, ఒక్కొక్కరికీ నలభై ఏళ్ల ఆయుస్సు ఇస్తే, మిగిలివి ఇరవై చాలు అని వెనక్కి ఇచ్చేసిన మొత్తం అరవై ఆశపోతు మనిషి యథాతథమ్గా తీసుకున్నాడట [ఆత్రం లో]. కనుకు నలభై సం. చక్కని జీవితం [దేముడు నిర్వచించినది], మిగిలిన ఇరవై బరువు భాధ్యతల గాడిద చాకిరి, తర్వాత సంపాదించిన ఆస్తిపాస్తులకి కుక్క కాపల, చివరి ఇరవై జవసత్వాలుడిగి ఇంద్రియ గ్రహణ తగ్గి కోతి చేష్ఠ లూను. ఈ కథ నాకు తెలిసి జీవితం గురించి ఒక పాఠం నేర్పటానికే. ఇన్నిటా self-realization కొరకు ప్రయత్నించటానికి.
ReplyDeleteమీ వర్షన్ బాగుంది.
good one padma gaaru
ReplyDeleteఉషగారన్నట్లు ఈ కథ జీవితం గురించి ఒక పాఠం నేర్పటానికే, మరి మానవుడు నేర్చుకున్నాడంటారా ?
ReplyDeleteమనిషిలో ఇన్ని జీవులు ఒకేసారి !!! బాగుంది. ఈ కథ వినటం ఇదే మొదటిసారి.
ReplyDeleteబాగుందండి..
ReplyDeleteబాగుందండి. మనుషుల్లోని అన్నిరకాల జంతు ప్రవర్తనలను చెప్పకనే చెప్పారు. It's really good.
ReplyDeleteబాగుంది ఈ వెర్షన్ ఎక్కడ వినలేదు మీ సొంత వెర్షనా? బాగుంది... నేను ఉష చెప్పినవి విన్నా ఇంతకు ముందు... ఏమిటో అంతా జంతు జీవితం మొత్తానికి
ReplyDeleteనేనూ ఉషగారు చెప్పిన కధ విన్నాను :)
ReplyDeleteపద్మార్పిత గారు నెట్ లో కాలు జారారు .మొదటి రోజు శుభసూచకం గా గోవుని సృష్టిస్తూ రైతు కి అండ గా వుండననడం ఏంటండి?అప్పటికి రైతు ఎక్కడ పుట్టాడు చోద్యం గాక పొతే.రైతు కుడా నరుడే గా మానవి ?
ReplyDeleteఎవరు ముందైనా వెనుకైనా, ఊహైనా నిజమైనా...
ReplyDeleteఏవిటో అంతా జంతు జీవనమే!!!
బాగుందండి పద్మార్పితగారు.
ఇది కొత్త కథ అండీ.. నేనూ ఉష గారి కథ విన్నాను..
ReplyDeleteకథ బాగుందండీ :) :)
ReplyDeleteGood:):)
ReplyDeletebagundi .
ReplyDeleteమీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .
ఇదే కధని మా బామ్మ చెప్పింది. కానీ గోవు స్థానంలో గాడిదని పెట్టింది. అంటే గాడిద చాకిరీ చేస్తాడన్న మాట. :)
ReplyDeleteఅక్క బావుందండి
ReplyDeleteఇది నిజంగా నిజమేనా?
అక్క కామెంట్ చెయడానికి కొంచం ఇబ్బంది గా ఉంది మరి నాది యహూ ఐడి కదా!
మరేమి ఇబ్బంది అనుకొక పొతె
coose an identity lo
Name/URL
కూడా ఉండెట్టు comment section మర్చరూ.......
ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.
ReplyDeleteha ha ha ...
ReplyDeleteha!
ReplyDeleteINTERESTING..!
wov !keepitup Padmaji...with cardial wishes....Nutakki
ReplyDelete