బొమ్మలు!

బొమ్మలండీ...బొమ్మలు
అందమైన ఆట బొమ్మలు
కోమలమైన కొయ్య బొమ్మలు
మర్మమెరుగని మట్టి బొమ్మలు
ఆడుకోవడానికి అనువైన బొమ్మలు
మనిషి చేసిన ఈ ఆట బొమ్మలు!

బొమ్మలండీ...బొమ్మలు
జీవితపు రంగులద్దిన బొమ్మలు
మమతలమన్నుతో అతికిన బొమ్మలు
కారుణ్యమేకాని కఠినత్వమెరుగని బొమ్మలు
మంచికి మారుపేరుగా నిలచిన బొమ్మలు
ఇవి అలనాడు దేవుడు చేసిన బొమ్మలు!

బొమ్మలండీ...బొమ్మలు
ప్రేమ ఫైబర్ గా మారిన సైబర్ బొమ్మలు
అనుబంధాలకి అతీతమైనవి ఈ బొమ్మలు
గిరిగీసుకుని బ్రతుకుతున్న గిల్టు బొమ్మలు
స్వార్థమనే మూసలో తయారైన బొమ్మలు
క్రొత్తరంగులద్దుకున్న ఆధునికపు మరబొమ్మలు!

16 comments:

 1. బాగుంది...చివరి లైన్లు ఇంకా బాగున్నాయి..

  ReplyDelete
 2. బాగుందండీ కవిత. శేఖర్ గారన్నట్టు..చివరి పేరా చాలా బాగుంది.

  ReplyDelete
 3. పద్మార్పితగారూ, మీ కవిత చదవగానే నాకు పాప వైష్ణవి గుర్తు వచ్చింది. మనసంతా వికలమైపోయింది. అందుకే మీ కవితకి కొనసాగింపుగా ఇది వ్రాసాను.. మరోలా భావించకండి..
  బొమ్మలండీ బొమ్మలు
  కొత్తగా ఎర్రరంగు నలముకుంటున్న బొమ్మలు
  ప్రతిచోటా పతనానికి కారణమైన బొమ్మలు
  ప్రేమనే కాలరాస్తున్న బొమ్మలు
  రాక్షసంగా రాజ్యాలేల్తున్న ఈ బొమ్మలు
  మంచితనాన్ని తుంచివేస్తున్న బొమ్మలు
  పసితనాన్ని మసిచేస్తున్న బొమ్మలు
  అందర్నీ ఆక్రోశింపచేస్తున్న బొమ్మలు
  ఈనాడు దేవుడినే ఆడిస్తున్న బొమ్మలు..

  ReplyDelete
 4. "ప్రేమ ఫైబర్ గా మారిన సైబర్ బొమ్మలు" చాలా బాగా చెప్పారు పద్మార్పితగారు ! లలితగారి కొనసాగింపు కూడా బావుంది.

  ReplyDelete
 5. >>>గిరిగీసుకుని బ్రతుకుతున్న గిల్టు బొమ్మలు
  బాగుంది. బాగా చెప్పారు.

  ReplyDelete
 6. మనిషె ఆటబొమ్మ అయ్యాడు. బాగా రాసారండి.

  ReplyDelete
 7. చాలా బాగుంది బొమ్మలమైన మానవ బొమ్మల కథ.

  ReplyDelete
 8. rendo peraa naa laanti vaalla gurinchi anukuntaa.. :-) baagundandi

  ReplyDelete
 9. padma priya garu..mee poetry is gud..very sensble gaa think chesthunnaru..keep it up

  ReplyDelete
 10. Bommalapai mee bhaavanalu aksharaalaa bavunaayi. ''kaadedi kavitha kanarham'' ani niroopinchaaru.

  ReplyDelete
 11. బొమ్మలు...అంటే ఏదో ఆటల గురించి రాస్తారనుకున్నాను కాని ఇలా జీవశైలి గురించి వివరిస్తారనుకోలేదు...
  చాలాబాగుంది.

  ReplyDelete
 12. ఆఖరి లైన్లు అద్భుతంగా ఉన్నాయండి.

  ReplyDelete
 13. చివరి పేరా చాలా బాగుందండీ

  ReplyDelete
 14. chala bagunai... kannulatho chudaleni konni auragalani manasutho chupincharu chala thanks....

  ReplyDelete
 15. మొదటి పేరా చదివినప్పుడు ఏదో బొమ్మల కొలువును వర్ణిస్తున్నారు అనుకున్నాను.
  రెండో పేరాలో ఆఖరి వాక్యం చదివే వరకు అసలు ఏమి రాస్తున్నారో అర్ధం కాలేదు.
  పూర్తిగా చదివేసరికి.... నేను చెప్పలేను.
  చాలా బాగా రాసారు :)

  ReplyDelete