నవ్వుతున్నా!

ప్రేమలో తేలియాడాలన్న కోరిక
తీరింది చివరికి ఇలాగిక.....

హృదయం హృదయాన్ని చేరాలని
మనసులోని భావాలని చెప్పాలని

వ్యక్తపరచడానికి మాటలెన్ని ఉన్నా
మూగమనసు తెలుపలేకున్నన్నా

నరుడి కంటికి నల్లరాయి పగిలి
ప్రేమకి నలుగురి దృష్టి తగిలి....

కన్నీటితో తీర్చుకుంది అది ఋణం
శిక్షగా పెదవులపై విరిసింది నవ్వీక్షణం!

7 comments:

 1. నవ్వుతు బాధను వ్యక్తపరచడం బాగుంది. మీ చిత్రాలు చాలా బాగుంటున్నాయి.

  ReplyDelete
 2. ఎందుకో ఈ మధ్య బాగా నిరాశ వినిపిస్తోంది మీ గొంతులో...

  ReplyDelete
 3. ఏదో ఎడబాటు గోచరిస్తుంది కవితలో, కాదు కాదు నా వ్యాఖ్యలో!

  ReplyDelete
 4. బాగుంది..

  ReplyDelete