ప్రేమించిన నాచిట్టి మనసుని గాయపరచావు
వేటగాడివి నీవని నామనసుకి ఎలాతెలుపను?
నీ నిరీక్షణలో జీవితాంతం నేను వేచివుండగలను
నా హృదయాన్ని వేచి ఉండమని ఎలాచెప్పను?
దూరమై నాకు నీవు ధుఃఖాన్ని మిగిల్చావు
ఆ భాధని నీకివ్వమని భగవంతుని ఎలాకోరను?
నీ రూపమే కనపడుతుంది చందమామలోను చంద్రుని మబ్బులో దాగమని ఎలాచెప్పను?
కనుమరుగై నీవు నన్ను కలవర పరిచావు
నీ కంట కునుకు రానీయకని ఎవరికితెలుపను?
నీ ప్రేమే దక్కని నేను జీవించలేను
నిన్ను మరణించమని ఏలాచెప్పను?
నిన్ను మరణించమని ఏలాచెప్పను?
విరహ ప్రేమని తప్ప వేరేది రాయని పద్మను ,
ReplyDeleteఇంకేదైనా రాయమని ఎలా చెప్పను
:( :(
ReplyDeleteరవిగారు....పద్మ అంటే ప్రేమని మీలో ముద్ర పడ్డాక నేను ఏది వ్రాసినా మీకు ప్రేమే కనిపిస్తుందని ఏలాచెప్పను?:)
ReplyDeleteమధురవాణీగారు....ప్చ్ ప్చ్:(:( తిప్పి నవ్వేయండి! హ..హ:):)
పద్మార్పిత గారు మీ కవిత విన్నాక ఎందుకో నా మనసు బరువైంది ....
ReplyDeleteపద్మార్పిత గారు మీరేమన్నా పది రోజుల గ్యాప్ తో కవిత రాయాలని కంకణం కట్టుకున్నారా ??? పది రోజులయ్తే కాని కంటికి కనపడరు .......(సరదాగా ....)
ReplyDeleteఫణిగారు......భాధపడకండి, లైట్ తీసుకోండి:)
ReplyDeleteపదిరోజుల కంకణమేదో బాగుందే నేను గమనించలేదు:)
ఏమో అలా అన్నన్ని ప్రశ్నలు ఒకే సారి వేసేస్తే ఎలా?
ReplyDeleteఏదో పరీక్ష కొస్చిన్పేపరు చూస్తున్నట్టుంది.
కాస్త ఇక్కడ పరిస్థితి తేల్లిక చేద్దమని అలా అన్నాను ఏమనుకోకండి.
మీదైన రీతిలో బగా రాశారు.
నీ నిరీక్షణలో జీవితాంతం నేను వేచివుండగలను
ReplyDeleteనా హృదయాన్ని వేచి ఉండమని ఎలాచెప్పను?
మిగిలిన పాదాలకు దీనికి కొంత వ్యత్యాసమనిపించింది. నిరీక్షణ ప్రేమను మరింత దృఢపరుస్తుంది కదా? మరి వేచి వుండరా?
అత్రేయ కొండూరుగారు మిమ్మల్నే కంప్యూజ్ చేసాయి అంటే అవి తప్పక సులువైన ప్రశ్నలే..థ్యాంక్సండి!
ReplyDeleteకెక్యూబ్ గారు....తను వేచి ఉంటానంది కాని మనసు మాట వినన్నది... పాపం ఏంచేద్దాం:)
చాలా బాగుందండి...అన్నట్టు సైడ్ న పెట్టిన పెన్సిల్ స్కెచ్ ఫోటో చాలా చక్కగా ఉందండి.
ReplyDeleteహ్మ్మ్... బాగుంది.. ఇన్ని ఎలా లా పాపం పిచ్చి మనసు కు..
ReplyDeleteచెప్పడం ఎందుకు??అకల్మంద్ కో ఇషారా ఖాఫీ హై...సమజ్గయా:)
ReplyDeleteచాలా బాగుందండీ.
ReplyDeleteబాగుందండి
ReplyDeleteగాయం మానిందాండి ఇంతకు?:)
ReplyDeleteశేఖర్, భావన, సృజన, ప్రణీత స్వాతి, వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు.
ReplyDeleteభాస్కర్ గారు బ్లాగ్ వైపు లుక్కినందుకు థ్యాంక్సండి! ఇంకా ఎన్నాళ్ళు ఈ అజ్ఞాతవాసం (కరెక్ట్ పదమో కాదో తెలియదు).
లేపం రాయకుండా గాయం మానుతుందాండి:):)
chala bagundi padmarpita garu..
ReplyDeleteమనసుకే తెలుపలేనివి తనకెలా చేరతాయి?
ReplyDeleteమాట వినని హృదయం మారాం మానుతుందా?
దాగని వేదన, దరిచేరని కునుకు మాటవినేనా?
మరణానా మాయమవని ప్రేమ అతనికి ఎర అవునా?
నీలో కలిగిన ప్రశ్నకి మూలం నీవే కాదా?
nice one padmarpita garu
ReplyDeleteఉషగారు, హనుగారు థ్యాంక్సండి!
ReplyDeleteమనసుతోటే కదా ఈ కష్టాలన్నీ. అసలు మనసే లేకపోతే! ఎలా ఉంటుందో...
ReplyDeleteఎప్పటిలాగే మీ కవిత చాలా బాగుందండి. బాధను బాగుంది అనటానికి మనసొప్పటంలేదు. ఎలా?
పెన్సిల్ స్కెచ్ చాలా బాగుందండి...మీ కవిత కూడా :)
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteBadhanu kuda anandamga cheppadam meeku baga thelusu... padamarpita garu.
ReplyDeleteBadhal ni ela anandham ga sevkarinchadam.. oka kala.
मोहब्बत वो हसीन गुनाह है
ReplyDeleteजिसे हर इन्सान खुशी खुशी करता है
पर मोहब्बत में इंतज़ार वो सजा है
जो सिर्फ-ओ-सिर्फ वोह ही करता है जो सच में मोहब्बत करता है...........