ఒక రాజుగారికి నలుగురు భార్యలు....
నాలగవభార్య అంటే ఎంతో ముద్దు అందుకే ఆవిడని వస్త్రవైఢూర్యాలతో మురిపించేవాడు.
మూడవ భార్యని కూడా మురిపంగానే చూసుకునేవాడు, ఆవిడని ఒంటిస్తంభం మేడలోవుంచి ఎప్పుడూ ఒక కన్నేసి వుంచేవాడు ఆవిడ తనని వదిలి సామంతరాజులతో వెళ్ళిపోతుందేమోనని భయం.
రెండవభార్య అంటే అమితమైన అభిమానం, ఆవిడ రాజుగారికి అన్నివిధాల సహాయం చేసే శాంతమూర్తి మరియు సలహాదారిణిగా వ్యవహరించేది.
మొదటి భార్య గురించి చెప్పాలంటే, ఆవిడ పట్టపురాణి. రాజుగారికి చేదోడువాదోడుగా ఉంటూ, ఆయన ఆలనాపాలనా చూసుకునేది. కాని రాజుగారు ఆవిడని పట్టించుకునేవారుకాదు, అది కనపడకుండా గాంభీర్యం అనే ముసుగువేసుకుని ఆవిడతో గడిపేవారు.
ఇలా జరుగుతుండగా కొన్నాళ్ళకి.....
రాజుగారికి అనారోగ్య కారణంగా ఆయనలో మృత్యుభయం చోటు చేసుకుంది.
నాలగవభార్యని పిలచి నిన్ను నేను అమితంగా ప్రేమించాను నాతో పాటు మృత్యువులో తోడుంటావా అని అడిగితే లేదు అని ఆవిడ చెప్పిన సమాధానం రాజుగారి గుండెలో బాకులాదిగింది.
మూడవభార్యాని తోడు రమ్మంటే...నేను రాలేను నా జీవితం ఎంతో మధురమైనది మీరు మరణించిన పిదప నేను వేరొకరిని వివాహమాడుతానన్న మాటలకి రాజుగారు కృంగిపోయారు.
రెండవభార్యతో నీవైనా నా వెంట వస్తావా, నాకు ఇన్నాళ్ళు అన్నింటిలో సహాయ, సలహాలనిచ్చావుగా చరమాంకంలో కలసి పయనించమని వేడుకున్నాడు. దానికి ఆవిడ మీతో కలసి రాలేను కాని కడవరకు మిమ్మల్ని సాగనంపుతానంది.
"నేను వస్తాను మహారాజా మీవెంట మీరు ఎటువెళితే అటు"... అంటూ మొదటిభార్య గొంతు నిస్తేజంగా కృంగిపోతున్న మహారాజవారికి వినిపించింది. అప్పుడు చూసారు నీరసంతో క్షీణించిన మహారాణిగారి వంక, మనసుని నులిపెట్టే భాధతో అనుకున్నారు అయ్యో! నేను ఇంతకాలం ఈవిడనా నిర్లక్ష్యం చేసింది, తనని శ్రద్దగా చూసుకోలేక పోయానని అప్పుడు పశ్చాతాప పడ్డారు.
మనజీవితంలో ఆ నలుగురు.....
నాల్గవభార్య మన శరీరం:- మన శరీరాన్ని యవ్వనంలో ఎంతో మోహించి, శ్రద్దవహించి, ఎంతో సమయాన్ని వెచ్చించినా సమయానికి అది మనతో సహకరించదు.
మూడవభార్య మన అధికారం ఆడంబరం:- మనల్ని మృత్యువులో వీడి వేరొకరికి సొంతమౌతాయి.
రెండవభార్య సంసారం సంతానం:-ఎంతమనకి సహాయంచేసి సహకరించి సలహాలిచ్చినా వారు సాగనంపటానికే కాని సాంతం మనతోరారు. మొదటిభార్య మన ఆత్మ:- ఆడంబరాలకి, ఐశ్వర్యార్జనకు, పేరు ప్రతిష్ఠలకై మనం ఆత్మని ఎంత అశ్రద్ద చేసినా కడవరకు తోడుంటుంది.
పద్మార్పిత గారూ, కాలానుగుణంగా మారే భౌతిక శారీరక పరిణామ దశలను కధా రూపంలోసుతిమెత్తగా మనసుకు హత్తుకొనేలా తెలియచెప్పిన మీ కధన విధానం ...'మనజీవితంలో ఆ నలుగురు'.....
ReplyDeleteనాకు నచ్చింది అభినందనలు......నూతక్కి
చాలా బాగా చెప్పారు. చాలా మందికి మేలుకొలుపు.
ReplyDeleteగద్యం లో చెప్పిన ఈ చక్కటి సందేశం కవితలో ఉంటే ఎక్కుతుందా మనసుకు? కవితలు ఎంతమంది చదువుతారు? నేను గద్యం పక్షపాతినే.
ReplyDeleteచాలా బాగా చెప్పారండీ..
ReplyDeleteచాలా బాగా చెప్పారండీ..
ReplyDeleteచాలా బాగా వివరించారు. నాకు తత్వశాస్త్రం చదివిన త్రుప్తి కలిగింది. జీవితంలో దేనికి విలువ ఇవ్వాలో చక్కగా చెప్పారు.
ReplyDeleteచాల బాగుంది
ReplyDeleteబాగుంది బాగుంది!
ReplyDeleteమంచి సందేశం ! మనసుకి హత్తుకొనేలా చెప్పారు .
ReplyDeletevery nicely put.
ReplyDeleteఎంతో లోతైన విషయాన్ని చాలా చక్కగా మంచి ఉదాహరణతో సులువుగా అర్థమయ్యేలా చెప్పారు. బాగుంది.
ReplyDeleteచాల బాగా చెప్పారు పద్మ చాల .....చాల బాగుంది...
ReplyDeleteబాగుందండి...చాలా బాగాచెప్పారు.
ReplyDeleteexcellent..
ReplyDeleteno more words to say..
నా కవితలనే కాదు నా ప్రతీరాతని ప్రోస్తహిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు!
ReplyDeletewell said!
ReplyDeleteఅదిరింది పోస్ట్. చాలా బాగారాసారు పద్మ.
ReplyDeleteచాలా బాగా వ్రాసారు పద్మార్పిత గారు
ReplyDeleteపద్మ గారికి, నమస్కారములు.
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ బ్లాగు చదవకుండానే, నాకు మీరు మంచి స్నేహితులుగా దొరికారు. నా వ్యాసం "ఓ నా ప్రియా" మీకు నచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు.
ఇకపోతే, మీ వ్యాసాలు, కవితలు కొన్నింటిని ఇప్పుడే చదివాను. చాలా బాగున్నాయి.
"ఆలగే మన ఈ బ్లొగ్గెర్ లో ఉన్న ఆందరికీ, ఆదే చెత్తొ ఫ్రపంచం లో ఉన్న...??" (మీ బ్లాగ్లొ)
పై పదాల్లో కొన్ని అచ్చు తప్పులున్నాయి. సరిచేయగలరు.
భవదీయుడు,
మాధవరావు.
దాదాపు సంవత్సర కాలంగా తెలుగు బ్లాగులకి దూరమైపోయాను.మీరు నా బ్లాగులో వ్యాఖ్య పెట్టకపోతే మీ బ్లాగుని కూడా miss అయ్యేవాడినే. మీ బ్లాగు చాలా బావుంది. keep it up
ReplyDeleteజీవితాంతం గురుతుండిపోయే చక్కటి కథ చెప్పారు...థాంక్స్!
ReplyDeleteపద్మార్పితగారు కవితలతోనే కాదు కధలతో కూడా కదిలించగలరు మీరు మనసుని.
ReplyDeleteఅద్భుతం.. క్లిష్టమైన విషయాన్ని చాలా చాలా సింపుల్ గా చెప్పేశారు.
ReplyDeleteసూపరండి బాబూ....నాకు మాబాగ నచ్చేసినాదిగాదేటి...
ReplyDeleteఇది మీరే రాశారా. బావుంది . నేనింకా ఎక్కడినిన్చాన్నా ఉటంకిస్తున్నారేమో అనుకున్నాను.
ReplyDeletepadmarpitha garu chala chala baga chepparandi. joharulu meeku
ReplyDeleteennni sarlu chadivina malli chadavalnipisthundi
ReplyDeletechusina prathi sari oka kotha matter kanipisthundi indulo
really great padma...
very naice
ReplyDeleteHELOO MADAM.....
ReplyDeleteREALLY YOU BLOG IS EXELLENT...........PLAESE KEEP MAINTAIN FRESH CONTENT......
wow emi blog babooyi superb yaar keeka
ReplyDeleteJeevithann Kaachi vadaposi raasina mee analysis excellent.....
ReplyDelete