వృధ్ధాప్యం!

ముళ్ళబాటలో పయనిస్తున్న నాకేం తెలుసు పూల సుకుమారత్వం
నన్ను నేనే మరచిన నాకేం తెలుసు ఎదుటివారిని గుర్తుపట్టడం
పలుచటి గంజికై ప్రాకులాడే నేను ఆశించలేను పాలపాయసం
పరుల చెంత చేరిన నాకెక్కడివి పట్టుపరుపుల సోయగం
వృధ్ధాప్యంలో ఎందుకులే ఈ జీవిత సారం
నీకై ఎదురు చూస్తున్నాను...ఓ మరణం!

25 comments:

  1. పద్మర్పిత గారూ,
    .మీ భావానికి సరిగ్గా సరిపోతుందేమో నేను ఎప్పుడో తీసిన ఈ ఫోటో. లింక్ కింద ఇస్తున్నాను చూడండి.

    http://www.orkut.co.in/Main#AlbumZoom?uid=2985348060965006113&pid=1263654131249&aid=1224988708$pid=1263654131249

    ReplyDelete
  2. మరణం కోసం ఎదురుచూపులు బావుంది. ఇంత బాగా తెలుగు రాసే మీరు , ప్రొఫైల్ ఇంగ్లీష్ లో ఎందుకు పెట్టుకున్నారు? ఒక చిన్న సందేహం అంతే.

    ReplyDelete
  3. పునరావృతం ఈ స్వగతాలు. ఆపతరం కానివి ఆ ఎదురుచూపులు. ఆ నడుమ తన తర్వాతి తరానికి ఇవ్వాల్సిన తత్త్వం ఇంకెంతో వుంది కాదా?

    ReplyDelete
  4. ఏమిటో మనసును భారం చేసారు .

    ReplyDelete
  5. కవిత చాలా బాగుంది అని చెప్పాలని ఉంది, కానీ ఎంత వృద్దాప్యం అయినా మరణం కోసం ఎదురు చూడటం బాధ కలిగించేది గా ఉంది.

    ReplyDelete
  6. బాగుందండీ.. కొందరు వృద్ధాప్యం లో వున్న వారిని చూస్తే ఒక్క ఆర్ధిక పరిస్తితే కాదు అనేక కారణాల వల్ల మరణం కోసం ఎదురు చూస్తున్నట్లు వుంటారు. బలే బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది తలచుకుంటే వృద్ధాప్యాన్ని.

    ReplyDelete
  7. వృద్ధాప్యం అంటేనే ఎన్నో కారణాల వల్ల భయం వేస్తుంది. వృద్ధాప్యానికి ముందే మరణిస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఎలాగు చనిపోవాలి. వృద్ధాప్యం దాకా ఎందుకు? గంగగోవు పాలు కడివడైన చాలు, సక్రమంగా బ్రతికితే అనిపిస్తుంది. ఈ కవిత ఎంత బాగున్నా...తలచుకుంటే ఎంత భయం వేస్తుందో!

    ReplyDelete
  8. బాగుందండి...కాస్త లేటుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలండి.

    ReplyDelete
  9. అప్పారావు శాస్త్రి గురించి వాది నీచపు బ్రథుకు గురించి ఇక్కద చుదందీ

    http://telugusimha.blogspot.com/

    ReplyDelete
  10. యవ్వనం లో పూల సుకుమారత్వాన్ని అనుభవించే గా వ్రుధాప్యం లో అడుగు పెట్టేది ?
    అన్ని అయి పోయాక నా కేం తెలుసు అంటే ఎలాగా పద్మర్పిత గారు?
    అయినా తిరిగి పుట్టుటకే మరణం అయితే మరణం అంటే మరి మరి ఇష్టం
    యి లోకం లో యినా లోకం లో యినా ఇప్పటి లోకం లో
    ఎన్నలైన బతకడమిస్తం ఎపుడు రాలినా ఇష్టం
    నే రాలి పోయినా ఇష్టం
    యి కవితైతే ఆ ఫోటో కి ఇంకా బావుండేదేమో?

    ReplyDelete
  11. ఏవిటో మీ అందరినీ వృధ్ధాప్యాన్ని గుర్తుచేసి అందరినీ వ్యధకి గురిచేసానేమో అన్న ఫీలింగ్. సున్నిత మనస్కుల స్పందలనకు అభివాదములు...

    @కల్పనగారు....ఏదో జస్ట్ ఫర్ చేయింజ్...:)అర్థం చేసుకోరూ:):)

    ReplyDelete
  12. @ ఉషగారూ...కలయా!!! నిజమా!!!
    నా బ్లాగ్ లో ఎన్నాళ్ళో అయినట్లున్నది మీరు రాక.
    మరువపు సువాసనతో అహ్లాదం ఈ రోజంతా ఇక.
    మిస్ యూ మిత్రమా!!!

    @ శేఖర్ గారూ...థ్యాంకండీ!

    @ రవిగారు నా మట్టిబుర్రకి మీ స్పందన అర్థం కాకున్నదేలనో అని ఆలోచిస్తుంటిని???

    ReplyDelete
  13. చిన్న కవితే అయినా బాధ కలిగించేది గా ఉంది.

    ReplyDelete
  14. బావుంది.

    ReplyDelete
  15. బావుందండి. చిన్న కవిత అయినా చాలా బరువైన కవిత

    రాజన్

    ReplyDelete
  16. పద్మ గారు! చాలా బాగుంది. గుండె బరువెక్కింది. మీ వయసెంతని.. ఇంత లోతుగా ఆలోచిస్తున్నారు. నాకన్నా ఒక సంవత్సరం పెద్ద.. అంతేగా కాని నాకన్నా చాలా చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. మీ నేపధ్యం తెలుసుకోవాలని ఉంది.

    ReplyDelete
  17. చాలా బాగుందండీ.. అబ్బో జమాన అయినట్టుంది నేను ఇటుగా వచ్చి. మీ బ్లాగులో చాలా చాలా మార్పులు చేసేశారు.. బాగుంది.

    ReplyDelete
  18. @ సృజన, వాసు, రాజన్ గార్లకి ధన్యవాదాలు.
    @ సవ్వడి... స్పందించడానికి సంవత్సరాలకి సంబంధం ఉందంటారా! మీ అభిమానానికి కృతజ్ఞతలు.
    @ ఆత్రేయగారు బహుకాలానికి బ్లాగ్ కు విచ్చేసి మెచ్చిన మీకు ధన్యవాదాలండి.

    ReplyDelete
  19. పద్మర్పిత గారూ,

    మీ భావాలు చాలా బాగుందండీ..

    ReplyDelete
  20. బ్రతుకు ప్రయాణంలో చివరి మజిలీ ఈ వృధ్యాప్యం
    సింహావలోకనం చేసుకోవడానికి మంచి సమయం
    మరెన్నో విషయాలు అర్థమయే అద్భుత అవకాశం
    ఎన్నో సంఘటనలకు సాక్షులం
    రాబోయే తరాలకు ముందున్నామని మరిచిపోకుండా
    వారి నాగరితకు పునాది రాళ్ళమని సంతోషించే వయసది.

    ReplyDelete
  21. మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ www.jeevanianantapur.org ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.
    kathasv@gmail.com
    jeevani.sv@gmail.com

    మీ,

    జీవని.

    ReplyDelete
  22. చిన్నకవిత!బాగుందండి..

    ReplyDelete
  23. వౄద్దాప్యం

    బ్రతుకు బండిలొ
    ప్రయణిస్తున్న
    ఒంటరి బాటసారివి నీవు

    నీ జీవన పయనంలొ
    ఎన్నో మజిలీలు

    ఎన్నో విచారాల మద్య
    అప్పుడప్పుడు చిన్న సంతోషాలు

    గతించిన కాలాన్ని
    నీవు తీసుకురాలేవు

    మరణాన్ని నీవు కోరుకోలేవు
    అది వస్తే నీవు ఆపలేవు

    పద్మార్పిత గారు ఈ కవిత మీకు పోటీగా రాసింది కాదు, మీ భావాన్ని నా మదిలో ఊహించుకుని రాసింది. తప్పులుంటే క్షమించండి

    ReplyDelete