ఆచరించడానికి ఆరు!

మీ దయాదాక్షిణ్యాలు మిమ్మల్ని శక్తిహీనుల్ని చేస్తాయేమో
అయినా చలించక దయ చూపండి.

మీ సహాయసహకారాలు నిరుపయోగమై ఎవరూ గుర్తించరేమో
అయినా నిరాశపడక సహాయపడండి.
మీ నిజాయితీని ఎవరూ హర్షించక మిమ్మల్ని గేలిచేస్తారేమో
అయినా నీతినియమాలతో జీవించండి.
మీ భక్తిశ్రద్దలు ఎదుటివారికి చాదస్తంగా అనిపిస్తాయేమో
అయినా మీ నమ్మకం మీదనుకోండి.
మీ విజయపధంలో అవరోధాలెన్నో ఏమో
అయినా వెనుతిరుగక ముందుకి సాగిపొండి.
మీ మంచితనాన్ని ఎదుటివారు గుర్తించరేమో
అయినా మంచిని మరువకండి.

15 comments:

 1. సహృదయం, కరుణ ఉన్న మనిషి సమాజాన్ని జయిస్తాడు. విజయానికి దగ్గిర దారులు లేవు. మన సత్ప్రవర్తనే ఎన్ని అవమానాలనుంచైనా బయటకు తీసుకొచ్చి గౌరవాన్ని కలిగిస్తుంది. మనోబలమే ముఖ్యం. చాలా బాగా చెప్పారు. మీరు చెప్పిన ఈ అంశాలు నాకు చాలా నచ్చాయి.

  ReplyDelete
 2. ఆ మధ్యన ఒక టపాలో నేను రాసిన "స్వామి" చెప్పిన మాటలు ఇంచుమించు ఇలానే ఉన్నాయండీ...చూడండి...
  http://trishnaventa.blogspot.com/2009/11/blog-post_23.html

  ReplyDelete
 3. arishadwargaalani..paaradroladaaniki.
  dhanyavaadaalu..meekive.
  sariyagu sootralani..teliyajeppinanduki.......
  kaamam..x..vairaagyam
  krodham..x...samyamanam
  lobham...x..audaaryam
  moham...x....vikaaram
  madam...x...vinamram
  maatsaryam..x..kaarunyam
  sadaa mee snehaabhilaashi.
  raki

  ReplyDelete
 4. బంగారం లాంటి మాటలు చెప్పారు పద్మార్పిత గారూ.! అభినందనలు.

  ReplyDelete
 5. చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.

  ReplyDelete
 6. చక్కటి విషయాలు చెప్పారు.

  ReplyDelete
 7. చాలా మంచి విషయాలు చెప్పారు.

  ReplyDelete
 8. చాలా బాగుందండి, అభినందనలు

  ReplyDelete
 9. మంచి విషయాలు చెప్పారు.

  ReplyDelete
 10. Click here to watch all telugu channels free online , no software , registration needed .total free
  http://www.tamil10tv.com/2010/01/watch-telugu-movie-channels-free-online.html

  ReplyDelete
 11. bhogi sankranti subhakankshalu padmarpita..!

  ReplyDelete
 12. ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
  అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
  *** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
  SRRao
  శిరాకదంబం
  http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

  ReplyDelete
 13. ఇవన్నీ అందరి జీవితాల్లో ఎపుడోక్కపుడు
  ఖచ్చితంగా అనుభవమ్లోకి వచ్చే ఉంటాయి.అటువంటి సత్యాలు చెప్పారు. అభినందనలు..

  ReplyDelete
 14. ఇలాంటి భావాలున్న వారు ఎందరో ఉన్నా కొందరినైన ఇలా కలుసుకో గలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యంగానైనా మీకు నా ధన్యవాదాలు!

  ReplyDelete