కలనైనా.....

కనులకు కాటుకదిద్దాను
కలలోకి నీవు వస్తావని...
కనులు నులుముకుని చూసాను
కన్నీరై కరిగిపోయావు ఎందుకని???


కనికరించి నీవు కలలోకి వస్తానన్నావు
కలువరేకులై విచ్చుకున్నాయి కనులు...
కనుల కాంతులను తట్టుకోలేక దూరమైనావు
కలలు అయినాయి సాగరాన్ని తాకని అలలు...

కడకు కమ్మని కలవై కనిపించావు
కలలోనే నన్ను కౌగిలిలో బంధించావు...
కనులార్పకుండా చూడాలనుకున్న నాకు
కనులపై ముద్దాడి కనుమరుగైనావు...

18 comments:

  1. బాగుంది కాని ఈ ఒక్క సంటేన్స్ ఎందుకో నచ్చాలే " కనికరించి నీవు కలలోకి వస్తానన్నావు" కనికరించి కాకుండా వేరే ఇంకేమన్నా ఉండే బాగుందేమో.

    ReplyDelete
  2. chaalaa baagundi... picture & poem...

    ReplyDelete
  3. చాలా బావుందండీ

    ReplyDelete
  4. చాలా చాలా బాగుంది పద్మాగారు..అ కలల రాజు ఎవరు ..ఇలా ఏన్నోసార్లు అనుకున్నా

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. కనులకు కాటుకదిద్దాను
    కలలోకి నీవు వస్తావని...
    కనులు నులుముకుని చూసాను
    కన్నీరై కరిగిపోయావు ఎందుకని???

    touching...

    ReplyDelete
  7. చాలాబాగుంది పద్మాగారు...

    ReplyDelete
  8. బావుందండీ కవిత ! Happy newyear!

    ReplyDelete
  9. kanula kantulanu tattukoleka dooramainaavu
    ante kopam to unnattu
    kanulu muusukuntea vacchi muddaadavu
    ante appudu prasantam ga unnattu

    ReplyDelete
  10. http://telugusms.net
    Telugu all types of sms' s and Telugu All Types of Heart Touching Kavithalu and more... visit now http://telugusms.net

    ReplyDelete
  11. నాకు కనులంటే ఇష్టం ee kavitha
    రాసిన నీకు na special thanks

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete
  13. Hi, did you paint/sketch all these pics that are used in your posts? They are completely awesome.
    Great !!!!!!!

    ReplyDelete