చేసెయ్ బాసను!

నిన్ను వీడి క్షణముండలేను...
మరణాన్నికూడ దరిచేరనివ్వను!
నీతోనే కలసి జీవిస్తానన్నాను...
చేసిన బాసను నేనెన్నడు మరువను!

కలసిన వేళ కష్టాలేనని తెలుసును...
అయినా నిన్ను కలవక నేనుండలేను!
అధైర్యంతో ఎన్నడూ వెనుకడు వేయను...
నీతోడు లేనిదే ముందడుగు వేయలేను!

నాలోని భావాలే నీవైతేను...
నన్ను నీవుగా అనుకుంటేను!
నా చేతిలో చేయి వేసి నీవును...
చేసెయ్ కలకాలం కల్సుంటాననే బాసను!

9 comments:

 1. padmagaru cala bagundandi nijamga its simply super...gud luck andi

  ReplyDelete
 2. nice.. photo and poem...

  ReplyDelete
 3. చేసిన బాసని నిలబెట్టుకోమని కూడా అడుగు...:)

  ReplyDelete
 4. కలసిన వేళ కష్టాలేనని తెలుసును...
  అయినా నిన్ను కలవక నేనుండలేను!
  అధైర్యంతో ఎన్నడూ వెనుకడు వేయను...
  నీతోడు లేనిదే ముందడుగు వేయలేను!

  Excellent..!

  ReplyDelete
 5. It's in Padmarpita style:)

  ReplyDelete
 6. బాగుందండీ చివరాఖరిదాకా బాసను నిలుపుకునే నేస్తం కావాలి నిజంగా...

  ReplyDelete