జీవితం ఏమిటి?


విధివ్రాతను ఎవరూ మార్చలేరు

కాగలకార్యాన్ని ఎవరూ ఆపలేరు

మార్చగలిగితే! ఆనందం ప్రతిఒక్కరిదంట
ఆపగలిగితే! భాధలకి చిరునామాయేలేదంట

తలచినది జరగని నాడు చింత పడవలదు
పలుమార్లు ప్రయత్నించడంలో జాప్యంవలదు

నిరాశ పడకు నీవు, ఏదీ నీకు సాధ్యం కాదని
తెలుపు సాధనతో అసాధ్యం కూడా సాధ్యమని!

ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవడమే జీవితం...
భాధలున్నా దిగమింగి నవ్వడమే జీవితం...
గెలుపొంది ఆనందించడమే కాదు జీవితం...
ఓటమిని చిరునవ్వుతో స్వీకరించడం జీవితం!

11 comments:

  1. ఆ పైనున్న బొమ్మకోసం ఈ మధ్య ఏ పోస్టు రాసినా వస్తున్నా ..ఏంటో విధిరాత..తప్పించడం కష్టం కదా :-)

    ReplyDelete
  2. బాగుందండీ! మౌనంగానే ఎదగమని పాట చరణాలు గుర్తుకొస్తున్నాయి!

    ReplyDelete
  3. nakosame raasinatlunnaru.. Ninna endko you can win telugu version chadivanu...
    Tom Wotson gari matalu gurthochai mee kavithalo..
    "Vijayaanni pondali ante nee apajayalanu rettimpu chesuko"..

    ReplyDelete
  4. 'ఓటమిని చిరునవ్వుతో స్వీకరించడం జీవితం!' ,
    జీవిత సత్యాన్ని చాలా చక్కని పదాల్లో చెప్పారండి

    ReplyDelete
  5. @భాస్కర్ గారు...వస్తున్నారనే చూస్తున్నా, కానీ ఎక్కడండి?:)
    ధూమపానం పై దుమ్ములేపేస్తూ బిజీ కదా మీరు!..:)
    సత్ సంకల్పం కదా అని సరిపెట్టుకుంటే....
    విధిరాత అని తప్పించుకుంటే ఎలాగండి?:)

    ReplyDelete
  6. @రసజ్ఞగారు...మీకు నా కవిత అంత గొప్ప పాటను తలపింపచేసినందుకు మిక్కిలి సంతోషమండి!

    @కమల్ గారు.... మీకోసం ఏమిటండి! మనందరి కోసం...స్పందించిన మీకు కృతజ్ఞతలు.
    @Kalyan గారు.....థ్యాంక్సండి.

    ReplyDelete
  7. Hmmmm...thats good, మంచి పిల్ల!:)
    ఇలాంటి మంచి కవితలు వ్రాస్తూండు:)

    ReplyDelete
  8. ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవడమే జీవితం...
    భాధలున్నా దిగమింగి నవ్వడమే జీవితం...
    గెలుపొంది ఆనందించడమే కాదు జీవితం...
    ఓటమిని చిరునవ్వుతో స్వీకరించడం జీవితం!
    పద్మా చాలా బాగా చెప్పారు.. గోరంత దీపం కొండంత వెలుగు.,చిగురంత ఆశ జగమంత వెలుగు అని, ఆశ దానితో పాటూ సంకల్ప బలం ఉంటే సాధించనిది ఏదీ ఉండదు.

    ReplyDelete
  9. జీవిత సత్యాన్ని చాలా చక్కని పదాల్లో చెప్పారండి!

    ReplyDelete
  10. సృజన,subha,ప్రేరణగార్లకు.....ధన్యవాదాలు!

    ReplyDelete
  11. ఆ శక్తి దేవుడే ప్రసాదించాలి :)

    ReplyDelete