కావాలి!!!

నన్ను నన్నుగా ప్రేమించాలి
అందమైన ఆజానుభాహుడేవలదు
ఆత్మీయతను పంచే అనుభవముండాలి!

కంటనీరు రానీయని నేస్తం కావాలి
నా ఎదురుగా ఉండనవసరంలేదు
నా అన్న నమ్మకం నాలో కలిగించాలి!!

ఒకరికోసం ఒకరం అన్న భావం రావాలి
అందుబాటైతే చాలు ఆస్తిపరుడితో పనిలేదు
అనురాగం పంచడంలో నన్నుమించిపోవాలి!!!

తన విశ్వంలో నాకంటూ ప్రత్యేక స్థానముండాలి
అనుబంధముంటేచాలు రక్తసంబంధం అక్కల్లేదు
గుండెలగుడిలో మమతలకోవెలై కొలువుండాలి!!!!

23 comments:

 1. chala bagundi andi

  అనుబంధముంటేచాలు రక్తసంబంధం అక్కల్లేదు
  గుండెలగుడిలో మమతలకోవెలై కొలువుండాలి!!!!

  ee line inkaa chala bagundi andi

  ReplyDelete
 2. పద్మా వెదకమంటావా????:)

  ReplyDelete
 3. ఈ అర్హతలన్నీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చంటారా అయితే! ;)

  ReplyDelete
 4. నేను మీ నేస్తాన్నికి , సుభగారికి నచ్చినందుకు హ్యాపీస్!

  సృజనగారు, మధురవాణీగారు....నీహారికకు వెతుకుతూ అప్లికేషన్స్ నేనూ పరిశీలిస్తానులెండి అలాంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్న వ్యక్తులు ఉన్నారేమోనని:-)

  ReplyDelete
 5. ఉన్నారు మీరు కోరుకున్నలాంటి వారు కూడా లోకంలో, కవిత బాగుందండి.

  ReplyDelete
 6. నన్ను నన్నుగా ప్రేమించాలి అని కాదు, నిన్నే ప్రేమించేవాడిని కోరుకో
  అందమైన ఆజానుభాహుడై నిన్నే
  తన ఆత్మగా అణువణువునా నింపుకునే వాడిని జతచేసుకో .....!

  కంటనీరు రానీయని నేస్తం కాదు,ప్రతి క్షణం నీ చెక్కిలి పై మిక్కిలి ఆనందంతో కన్నీటిని తెప్పించే నేస్తం రావాలని ప్రాణం కోరుకో...
  నా అన్న నమ్మకం నాలో కలిగించాలి అని కాదు,
  నీ ఆలోచనే తను అనే నమ్మకం కలిగించే వాడిని జత చేసుకో......!!

  ఒకరికోసం ఒకరం అన్న భావం రావాలి అని కాదు ,
  ఒకరు మరొకరి ప్రతిబింబం అన్న భావం కలగాలి అని కోరుకో....
  అనురాగం పంచడంలో నన్నుమించిపోవాలి అని కాదు,
  సుగుణాస్తి పరుడై అనురాగం పంచడంలో నిన్ను మరిపించే వాడిని జత చేసుకో ....!!!

  తన విశ్వంలో నాకంటూ ప్రత్యేక స్థానముండాలి అని కాదు ,
  నువ్వే తన విశ్వం అవ్వాలని కోరుకో
  అనుబంధముంటేచాలు రక్తసంబంధం అక్కల్లేదు అని కాదు,
  దానితో పాటు జీవితంలో చీకట్లు ముసిరేవేళ దిక్సూచి అయ్యే ఆత్మబంధువును జత చేసుకో.....!!!!

  ReplyDelete
 7. అతి చొరవ తీసుకొని రాసినందుకు క్షమించాలి .....కాని రాయాల్సొచ్చింది ..ఎందుకంటే మీ బ్లాగ్ పోస్ట్స్ చూసి మిమ్మల్ని కాస్త చదవగలిగాను ....సో.... మీరు కేవలం మిమ్మల్ని మీలా గౌరవించేవాడు ఒస్తే చాలు అనుకుంటున్నారు ..ఎలా చెప్పగలను అంటే ..మొదటి లైన్ "నన్ను నన్నుగా ప్రేమించాలి" అని రాసుకున్నారు....అలాంటివాడు వేరే అమ్మాయిని ఆమె లాగే ప్రేమించే అవకాశం ఉంది ఈ కాలం ఆడే ఆటలో ..... మీకు మిమ్మల్ని గౌరవించే వాడు కాకుండా...మిమ్మల్నే తన ఆత్మగా చేసుకునే వాడు రావాలి....coz u just dont need a person who respects u....but u need a guide who helps u in ur growth as a person of higher consciousness....n tell me whoz the best guide to a person when the whole universe is against her/him....its the SOUL that guides us unto right path in these kinda tough times....so i feel ....u need a soulmate rather than just a mate....n all the best for that....!!!

  ReplyDelete
 8. మీవన్నీ చాలా పేద్ద పేద్ద కోరికలండీ :-)

  ReplyDelete
 9. "నన్ను నన్నుగా ప్రేమించాలి" ఈ ఒక్కటి తప్ప మిగతా అర్హతలన్నీ ఉన్నవాడికి పెళ్ళైపోయిందే..ఇప్పుడెలా..

  ReplyDelete
 10. చాలా బావున్నాయి ఆమె (మీ) ఆశలు.
  అసాధ్యం కాదుగానీ... అక్కడక్కడ ఉంటారు. కానీ వెతికి పట్టుకోవడమే మహా కష్టం.

  All the best...

  ReplyDelete
 11. అంతస్తులతో పని లేదు ఆత్మీయత పంచె వాడు ...

  దురాన ఉన్నా కూడా దగ్గర వున్నా భావను కలిగించే వాడు ...
  తన బాధలో వున్నా అవి నా అనే భావనతో తలచే వాడు ...

  అనురాగంతో ప్రేమను పంచి , తన ఒడిలో నిదురించి , తానే నేనని మరిచే వాడు ...

  విశ్వాసానికి మరో పేరుగా నిలిచి.. అనుబందంతో ఆప్యాతను పంచి , గుండెల గుడిలో దేవతగా పూజించే వాడు... నీ వాడు

  ReplyDelete
 12. తనను తాను గా ప్రేమించి నిస్వార్థం గా ప్రేమ ను పంచె వాడు ..
  అంతస్తులతో పని లేదు ఆత్మీయత పంచె వాడు ...

  దురాన ఉన్నా కూడా దగ్గర వున్నా భావను కలిగించే వాడు ...
  తను బాధలో వున్నా అవి నా అనే భావనతో తలచే వాడు ...

  అనురాగంతో ప్రేమను పంచి , తన ఒడిలో నిదురించి , తానే నేనని మరిచే వాడు ...

  విశ్వాసానికి మరో పేరుగా నిలిచి.. అనుబందంతో ఆప్యాతను పంచి , గుండెల గుడిలో దేవతగా పూజించే వాడు... నీ వాడు

  ReplyDelete
 13. "గుండెలగుడిలో మమతల దీపమై కొలువుండాలి" అని ఉంటే బాగుండేదేమోనండీ !! కోవెల అన్నా గుడి అన్నా ఒకటే కదా రెండుసార్లు అవసరం లేదేమో !!

  అప్లికేషన్లు ఏమయినా వచ్చాయాండి ???

  ReplyDelete
 14. @kiran, Yohanth,వేణూ శ్రీకాంత్,sarmaగార్లకి నచ్చినందుకు నెనర్లు.
  @Santosh Reddyగారు ఇలా భయపెడితే వచ్చేవాడు కాస్తా పారిపోతాడేమో!:-)
  అయినా ఆడువారి మాటలకు అర్థాలే వేరులే:-).
  అర్థం అయిపోయివుంటుంది కదా:-)
  (Just kidding...thanks for comment)
  @అసలే భాస్కర్ గారు పేద్ద పేద్ద కోరికలు కోరాను అన్నారు...ఇంకేం కోరను?:-)

  ReplyDelete
 15. @జ్యోతిర్మయి గారు ఒకటో అరో క్వాలిఫికేషన్స్ ఉంటేనే అడ్జస్ట్ అయిపోతున్న రోజుల్లో అన్నీ ఉండి ఒకటి లేని వారిని ఒంటరిగా వదులుతారా చెప్పండి:-)

  @గీతిక బి గారు థ్యాంక్సండి....వెతకవలసిందేనా తప్పదంటారా???:-)

  ReplyDelete
 16. @LoVe YoU FoReVeR..... Thank Q...of course he is mine:-)


  @నీహారికగారు.....ఒకే గుడిలో వివిధ దేవుళ్ళకి కోవెలలు ఉన్నట్లే...గుండెలో కూడా మమతలకి, మరొకటికి వివిధ చాంబర్స్ అన్నమాట:-)
  ఇవ్వన్నీ చూసి ఎవరైనా అప్లై చేస్తారంటారా?:-)

  ReplyDelete
 17. pl log onto
  www.harikrishnamamidi.com
  or
  harikrishnam2110@gmail.com
  or
  contact me 99088 44222,if u please

  ReplyDelete
 18. pl log onto
  www.harikrishnamamidi.com
  or
  harikrishnam2110@gmail.com
  or
  contact me 99088 44222,if u please

  ReplyDelete