కోమలి...కూల్ కూల్:-)

చలి చలిగా ఉంది
గిలిగింతలు పెడుతుంది
నన్ను కౌగిలించుకోమంది...
ఊలువస్త్రం/Winter wear:-)

మొహం పగులుతుంది
బయట మంచు కురుస్తుంది
నన్ను పూసుకోమంది...
వెన్న/Cold creams:-)

వింటర్ లో విప్పేయమంది
కొప్పుగా నన్నేల బంధింతువంది
విరబూసిన అందం చూసుకోమంది...
కురులు:-)

సాయంకాలం త్వరగా చీకటైంది
నా వేడిని నీలో దాచుకోమంది
అల్పాహారంగా ఆరగించమంది...
మిరపకాయబజ్జీ/పకోడీ:-)

వేడినీళ్ళ స్నానమాచరించమంది
తన ఒడిలో మేను వాల్చేయమంది
రేయంత వెచ్చగా నిదురించమంది...
పరుపు:-)

చలి చంపి ఒళ్ళు వణికిస్తుంది
చిరుగాలిని చొరబడనీయకంది
నువ్వు నేను ఒకటైపొమ్మంది...
గొంగళి/రగ్గు:-)

ఇది కవిత కాదండి.....పొద్దున్నే (మార్నింగ్ వాక్ లో) పుట్టిన పిచ్చి ఆలోచన, మన్నిస్తారు కదూ:-)

15 comments:

 1. ప్రతీ నాలుగో లైను మూసి కవిత చదవండి. కొంచెం romantic గా లేదూ! పద్మార్పితా గారికి ఇంత దైర్యం ఎలా వచ్చిందో అనుకున్నాను. నా ప్రియురాలు పైన ఇంత romantic గా కవిత రాద్దామనుకున్నా, కాని ఏమి లాభం ఆ అమ్మాయికి తెలుగు చదవడం రాదు(అంతా ఆంగ్ల మాధ్యమమే). english లో ఆలోచించి పదాలను పేర్చేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. నా english poetry బ్లాగు లో ఒక లుక్ వేసేయ్యండి.

  http://myenglishpoetry.blogspot.com

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. కోమలి ఎవ్వరో కాని చాల హ్యాపీ గా పీల్ అవుతుంది పద్మావతి గారు...

  అలాగే ఈ మద్యలో ఒక మంచి హైదరాబాద్ గరం చాయ్ కూడా ఇస్తే బాగుంటుందేమో....

  ReplyDelete
 4. @శేషుగారు...నేను మీ నేస్తాన్ని అంటూనే అలుక ఏల?:-)

  Sarma గారు...కూల్ కూల్ స్మైల్:-)

  Bhaskar గారు....మార్నింగ్ చలి రొమాంటిక్ గా వణికిస్తుందండి:-)

  ReplyDelete
 5. వేణూ శ్రీకాంత్...:-) cooooooool కదా:-)

  LoVe YoU FoReVeR.....నిజమేనండోయ్!!! ఛాయ్, కాఫీల థాట్ రాలేదెండుకో

  ReplyDelete
 6. పద్మా....చలితో కూడా ఒప్పందం కుదుర్చుకున్నావా కబుర్లకి:)?

  ReplyDelete
 7. 'క్యా మాల్' సో కూల్!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 8. మార్నింగ్ వాక్కవిత అన్న మాట ! మీరు కాదన్నా మాకు కవితే లెండి .బావుంది

  ReplyDelete
 9. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.. హిహిహి ;)

  ReplyDelete