Thursday, December 29, 2011

కొన్నైనా కావా!!!

చేతిలోన చెయ్యేసి చెప్పేయవా!
నీకు నేను నాకు నీవున్నామని.
ఏకాంతవేళ ఊసులెన్నో చెప్పేయవా!
జీవితమంతా ఆనందమయమేనని.

నీ కౌగిలిలో నన్ను బంధించవా!
పట్టుతప్పిన వేళ పడిపోనీయనని.
సేదతీర్చి ముంగురులు సవరించవా!
జోలపాటై నన్ను జో కొడతానని.

భుజాలపై తలవాల్చనీయవా!
నా యోగక్షేమాలు నీవేనని.
గుండెల్లో నిదురించనీయవా!
ఆ సవ్వడిలో నాపేరు వినాలని.

కనులుమూస్తే కలలో నీవే రావా!
కలనైనా నన్ను ఎన్నడూ వీడనని.
ప్రతిక్షణం నా తలపు నీవే కావా!
అణువణువునా ఒదిగి ఉన్నావని.

కోయిల పాటై వినిపించవా!
ఎల్లవేళల వసంతం మనదేనని.
కలసి నాతో కడవరకూ సాగిపోవా!
ప్రేమకు నిర్వచనం మనమేనని.

16 comments:

మధురవాణి said...

Wow.. Beautiful!
చాలా అందంగా ఉంది మీ కవిత.. కవితకి తగిన బొమ్మా! :)

sarma said...

కవిత దానికి తగిన బొమ్మ నిజంగానే బాగుంది. ముఖస్తుతి కాదు.

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగుంది.

అక్షర మోహనం said...

అందమైన బొమ్మకి
మధురమైన పాట ...జత కుదిరింది

చిన్ని ఆశ said...

చాలా బాగుందండీ కవిత, మీరెంచుకున్న బొమ్మ కూడా!

Zilebi said...

కొన్నైనా కావా ?

కోవాయే వుండగా కొన్ని ఏల!

చీర్స్
జిలేబి.

కెక్యూబ్ వర్మ said...

beautiful expression Padmarpita garu..chaalaa baagundi..

వేణూ శ్రీకాంత్ said...

ఫోటో కవిత రెండూ చాలా బాగున్నాయండీ..

సృజన said...

అదిరింది కవిత దానికి తగిన బొమ్మ:-)

రాజి said...

పద్మార్పిత గారూ నాకు మీ అంత బాగా కవితలు రాయటం రాదండీ..
నేను ఎక్కడైనా చదివినవి,నాకు నచ్చినవి నా బ్లాగ్లో పోస్ట్ చేస్తుంటాను.
మీకు నచ్చిన "నా కవిత" కూడా అలాగ నాకు "Facebook Telugu Quotes Community"
లో దొరికింది.

Link:

http://www.facebook.com/photo.php?fbid=280810235286675&set=a.198753050159061.49814.198741476826885&type=1&permPage=1

ఈ కవిత ఎవరు రాశారో మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి.

నేను మీ నేస్తాన్ని said...

abbo maa pata padmaarpita malli bayatiki vastundee...

yohanth said...

Super pic...

జయ said...

Very beautiful. మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

kiran said...

nice one..pic kuda :)
happy new year :)

నీహారిక said...

ఈ కవిత చూస్తుంటే ....అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశ పడే మగాడు సుఖపడినట్లుగా చరిత్రలో లేదనిపిస్తుంది. ఏమనుకోకండి, ఇవి చాలా చిన్న కోరికలే కానీ తీరవేమో అని నా అభిప్రాయం.

dharani said...

meeru paintings kuda vestara?on the whole very good work. beautiful and sensuous great profile. meeru artist ayte hyderabad lo ne unte naku telisina inko manchi artist ni parichayam cheyagalanu if u don't mind.